Monday, 18 August 2025

Rangi - Telugu folk song - తెలుగు జానపద గీతం

రాములోరి గుడికి పోదామే - నా ముద్దుల రంగి - సీతమ్మ తల్లి పెళ్ళి సూద్దామే

గుడికి పోతే అలిసిపోతారా - ఓ సుబ్బడు మావా - పెళ్ళికి నువ్వే పోయి రారాదా

సీతమ్మ తల్లి ముస్తాబయ్యిందే - నా ముద్దుల రంగి - రాములోరితో జంట కడతాందే

రాములోరు యిల్లుని యిరిసే - సీతమ్మ తల్లి మనసుని గెలిసె


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

సింత సిగురు కోసియ్యలేదా - సంతకు యెల్లాలంటే కొనిపోలేదా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

మల్లె పందిరి పాకించలేదా - ముల్లు తగలకుండ నడిపించలేదా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

గోరింట సేతులు ముద్దాడలేదా - గోంగూర తెమ్మంటే గిల్లివ్వలేదా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

కొత్త కోక కొని తేలేదా - కొండెక్కి సెరుకును ఇరిసి తేలేదా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

పులుపంటే ఉసిరికాయలు కొట్టియ్యనా - అలుపంటే ఎడ్లబండి కట్టియ్యనా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


మావా నా మావా - నీ రంగినే కానా

నీ మాటలింటే అలుపెక్కడుంటాది - నీతో ఉంటే లోటేమిటుంటాది

మావా నా మావా - నీ రంగినే కానా

మల్లెమాలలు కట్టుంచాను - ముస్తాబయ్యే ఉన్నాను

రాములోరి గుడికి పోదాం - సీతమ్మ తల్లికి దండలు వేద్దాం


పదరా మావా పదరా - పదయే నా రంగి

పదరా మావా పదరా మావా - పదయే నా రంగి

No comments:

Post a Comment