Tuesday, 20 July 2021

Kondalalo nelakonna - Annamacharya Keerthana




Raagam: Hindolam

Thaalam: Aadi


Pa) Kondalalo nelakonna koneti raayadu vadu

Kondalantha varamulu guppedu vaadu

1) Kummara daasudaina kuruvaratthi Nambi
immanna varamulella ichhina vaadu
dommulu chesinayatti Thondaman chakkuravarthi
rammanna chotaki vachhi nammina vaadu

2) Achhapu veduka thoda Ananthaaluvaariki
muchchili vettiki mannu mochina vaadu
machhika dolaka Thirumala Nambi todutha
nicchanichha matalaadi nachhina vaadu

3) Kanchilonunna Thirukachhi Nambi meeda karu-
ninchi tanayedaku rappinchina vaadu
enchi ekkudaina Venkateshudu manalanu
manchivaadai karuna paalinchinavaadu

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు ||

కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు |
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ||

అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు |
మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నచ్చినవాడు ||

కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద కరు-
ణించి తన యెడకు రప్పించిన వాడు |
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు ||

Kaligenidey naaku kaivalyamu - Annamacharya Keerthana

 Raagam: Sindhu Bhairavi

Thaalam: Aadi



కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది

జయపురుషోత్తమ జయ పీతాంబర
జయజయ కరుణాజలనిధే
దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా
క్రియ యిది నీ దివ్య కీర్తనమే

శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్ధన
పరమ మెఱంగను భక్తి యెఱంగను
నిరతము నాగతి నీదాస్యమే

నమో నారాయణా నమో లక్ష్మీపతి
నమో పుండరీకనయనా
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే


Kaligenidey naaku kaivalyamu

Tholuthanevvarikee dorakanidi


Jaya Purushotthama jaya Peethaambara

Jaya jaya Karunaajalanidhi

Daya yeranga ney dharmamu neraga naa

kriya idi divya keerthanamey


Saranamu Govinda saranamu Keshava

Saranamu saranu Sri Janardana 

Parama meranganu bhakthi yeranganu

Nirathamu naa gathi nee daasyamey



Namo Narayanana namo Lakshmipathi

Namo  Pundareeka nayanaa

Amitha Sri Venkataadhipa idey naa

Kramamellanu nee kainkaryamey

Brundaaraka sandohamutho - Devulapalli Krishna Sastry




Raagam: Brundavana Saranga

Thaalam: Aadi 


ప) బృందారక సందోహముతో

వందారు మౌని బృందముతో

పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ

మందిరమును విడి తరలేనే ॥


1) తులసీవనిలో మొలకయటే

అల హరి కౌగిలి చిలుకయటే

వెలసి నెయ్యమున విష్ణుచిత్తులకు

నిలయ దీపమై వెలిగెనటే ॥


2) విరజానది కావేరియటే

పరమపదము శ్రీరంగమటే

వరుడారంగేశ్వరుడె కదా మన

సిరి ఆండాళే వధువు కదా ॥

Pa) Brundaaraka sandohamutho

Vandaaru mouni brundamutho

Pendiruvadi Perumaalley Sree

Mandiramunu vidi tharaleney


1) Thulasee vanilo molakayatey

Ala Hari kougili chiilukayatey

Velasi neyyamuna Vishnu chitthulaku

Nilaya deepamai veligenatey


2) Virajaa nadi Kaaveriyatey

Parama padamu Sreerangamatey

Varudaa Rangeswarudey kadaa mana

Siri Aandaaley vadhuvu kadaa