Tuesday, 26 August 2025

Ganapathi Thaalam

Vikatothkata sundara danthi mukham
Bhujagendra susarpa gadaabharanam
Gajaneela gajendra Ganaadhipathim
Pranathosmi Vinayaka hasthimukham ॥ 1 ॥ Sura sura Ganapathi sundara kesam
Rishi rishi Ganapathi yajna samaanam
Bhava bhava Ganapathi padma sareeram
Jaya jaya Ganapathi divya namasthe॥ 2 ॥ Gaja mukha vakthram Girijaa puthram
Gana guna mithram Ganapathim Eesapriyam॥ 3 ॥
Kara dhrutha parasum kankana paanim
kabalitha padmaruchim
Surapathi vandyam sundara nruttham
surachitha mani makutam॥ 4 ॥
Pranamatha devam prakatitha thaalam
Shadgiri thaalamidam
Thath thath shadgiri thaalamidam
Thath thath shadgiri thaalamidam॥ 5 ॥
Lambodara vara kunjaasura krutha
kumkuma varnadharam
Swethasa srungam modaka hastham
preethisa panasa phalam॥ 6 ॥ Nayana thraya vara naaga vibhooshitha
Naanaa Ganapathidam thath thath
Nayana thraya vara naaga vibhooshitha
Naanaa Ganapathidam thath thath
Naanaa Ganapathidam ॥ 7 ॥
Dhavalitha jaladhara dhavalitha chandram
Phani mani kirana vibhooshitha khadgam
Thanu thanu vishahara shoola kapaalam
Hara Hara Siva Siva Ganapathimabhayam॥ 8 ॥ Katathata vigalitha madajala jaladhitha
Ganapathi vaadyamidam
Katathata vigalitha madajala jaladhitha
Ganapathi vaadyamidam thath thath
Ganapathi vaadyamidam thath thath
Ganapathi vaadyamidam॥ 9 ॥
Thath thadhim nam thariku
Thari jhanaku kuku thaddhi
kuku thakita dindingu diguna kuku thaddhi Thath thajham jham tharitha
Tha jham jham tharitha
Thakita jham jham tharitha
tha jham jham tharitha
thari danatha danajhanutha jhanudhimitha
kithathaka tharikinathom
Thakita kitathaka tharikita thom
Thakita kitathaka tharikita thom thaam ॥ 10 ॥
Thaka thakita thaka thakita thaka thakita thath thom
Sasikalitha Sasikalitha moulinam soolinam
Thaka thakita thaka thakita thaka thakita thath thom
Vimala subha kamala jala paadukam paaninam
Dhitthakita dhitthakita dhitthakita thath thom
Pramatha gana guna kathitha sobhanam sobhitham
Dhitthakita dhitthakita dhitthakita thath thom
Prithula bhuja sarasija vishaanakam poshanam
Thaka thakita thaka thakita thaka thakita thath thom
Panasa phala kadali phala modanam modakam Dhitthakita dhitthakita dhitthakita thath thom Pranatha guru Siva thanaya Ganapathi thaalanam
Ganapathi thaalanam Ganapathi thaalanam ॥ 11 ॥ 


వికటోత్కటసున్దరదన్తిముఖం భుజగేన్ద్రసుసర్పగదాభరణమ్ । గజనీలగజేన్ద్ర గణాధిపతిం ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ ॥ 1 ॥ సుర సుర గణపతి సున్దరకేశం ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ । భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్యనమస్తే ॥ 2 ॥ గజముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ ॥ 3 ॥ కరధృతపరశుం కఙ్కణపాణిం కబలితపద్మరుచిమ్ । సురపతివన్ద్యం సున్దరనృత్తం సురచితమణిమకుటమ్ ॥ 4 ॥ ప్రణమత దేవం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదమ్ । తత్తత్ షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి తాళమిదమ్ ॥ 5 ॥ లమ్బోదరవర కుఞ్జాసురకృత కుఙ్కుమవర్ణధరమ్ । శ్వేతసశృఙ్గం మోదకహస్తం ప్రీతిసపనసఫలమ్ ॥ 6 ॥ నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్ నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్ నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదమ్ ॥ 7 ॥ ధవళిత జలధరధవళిత చన్ద్రం ఫణిమణికిరణవిభూషిత ఖడ్గమ్ । తనుతనువిషహర శూలకపాలం హర హర శివ శివ గణపతిమభయమ్ ॥ 8 ॥ కటతట విగలితమదజల జలధిత- గణపతివాద్యమిదం కటతట విగలితమదజల జలధిత- గణపతివాద్యమిదం తత్తత్ గణపతివాద్యమిదం తత్తత్ గణపతివాద్యమిదమ్ ॥ 9 ॥ తత్తదిం నం తరికు తరిజణకు కుకు తద్ది కుకు తకిట డిణ్డిఙ్గు డిగుణ కుకు తద్ది తత్త ఝం ఝం తరిత ; త ఝం ఝం తరిత తకత ఝం ఝం తరిత ; త ఝం ఝం తరిత తరిదణత దణజణుత జణుదిమిత కిటతక తరికిటతోం ; తకిట కిటతక తరికిటతోం ; తకిట కిటతక తరికిటతోం
తామ్ ॥ 10 ॥ తకతకిట తకతకిట తకతకిట తత్తోం శశికలిత శశికలిత మౌలినం శూలినమ్ । ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
విమలశుభ కమలజల పాదుకం పాణినమ్ । తకతకిట తకతకిట తకతకిట తత్తోం ప్రమథగణ గుణకథిత శోభనం శోభితమ్ । ధినతకిట ధినతకిట ధినతకిట తత్తోం
పృథులభుజ సరసిజ విషాణకం పోషణమ్ । ధినతకిట ధినతకిట ధినతకిట తత్తోం పనసఫలకదలిఫలమోదనం మోదకమ్ । తకతకిట తకతకిట తకతకిట తత్తోం ప్రణతగురు శివతనయ గణపతి తాళనమ్ । 

గణపతి తాళనం గణపతి తాళనం తాం

గణపతి తాళనం గణపతి తాళనం తాం

గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనమ్ ॥ 11 ॥ 


Wednesday, 20 August 2025

Pranava Swaroopam - Ganapathi Sacchidaananda Bhajan



Raagam: Rishyakethupiya

Thaalam: Aadi


Pa) Pranava swaroopam Phaniraja bhoosham

Animaadi siddhiprada Sri Vighnarajam


1) Ganaraja yogigana vandya paadam

Pranamaami Girijaa Sivaananda nandanam


2) Ganaraja yogigana vandya paadam

Pranamaami Girijaa Sri Sacchidaanandam


ప) ప్రణవ స్వరూపం ఫణిరాజ భూషం

అణిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం


1) గణరాజ యోగిగణ వంద్యపాదం

ప్రణామామి గిరిజా శివానంద నందనం


2) గణరాజ యోగిగణ వంద్యపాదం

ప్రణామామి గిరిజా శ్రీ సచ్చిదానందం 

Tuesday, 19 August 2025

Om Namaste Ganapathaye - Ganapathi Sacchidananda Bhajan



Raagam: Malayamarutham

Thaalam: Aadi


ఓం నమస్తే గణపతయే

వరవరద శుభద గణపతయే


కర్తా ధర్తా సంహర్తా

ప్రత్యక్షం త్వం బ్రహ్మాసి

జ్ఞానమయా విజ్ఞానమయా

మూలాధారస్థిత శక్తా


త్వత్తోలోక త్రితయీయం

ప్రభవతి తిష్ఠతి లయమేతి

భూతం భౌతిక జాతమిదం 

సచ్చిదానందా తే రూపం


Om namaste Ganapathaye

Varavarada subhada Ganapathaye


Karthaa dharthaa samharthaa

Prathyaksham thwam Brahmaasi

Jnaanamayaa vijnaanamayaa

Moolaadhaara sthitha sakthaa


Thwattho loka thrithayeeyam

Prabhavathi thishtathi layamethi

Bhootham bhouthika jaathamidam

Sacchidananda the roopam


Monday, 18 August 2025

Rangi - Telugu folk song - తెలుగు జానపద గీతం





రాములోరి గుడికి పోదామే - నా ముద్దుల రంగి - సీతమ్మ తల్లి పెళ్ళి సూద్దామే

గుడికి పోతే అలిసిపోతారా - ఓ సుబ్బడు మావా - పెళ్ళికి నువ్వే పోయి రారాదా

సీతమ్మ తల్లి ముస్తాబయ్యిందే - నా ముద్దుల రంగి - రాములోరితో జంట కడతాందే

రాములోరు యిల్లుని యిరిసే - సీతమ్మ తల్లి మనసుని గెలిసె


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

సింత సిగురు కోసియ్యలేదా - సంతకు యెల్లాలంటే కొనిపోలేదా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

మల్లె పందిరి పాకించలేదా - ముల్లు తగలకుండ నడిపించలేదా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

గోరింట సేతులు ముద్దాడలేదా - గోంగూర తెమ్మంటే గిల్లివ్వలేదా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

కొత్త కోక కొని తేలేదా - కొండెక్కి సెరుకును ఇరిసి తేలేదా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


రంగికి సుబ్బడు సేసిందేటి - సెప్పరా మావా సెప్పు

పులుపంటే ఉసిరికాయలు కొట్టియ్యనా - అలుపంటే ఎడ్లబండి కట్టియ్యనా

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?

రంగీ నా రంగీ - అది పేమc కాదంటే?


మావా నా మావా - నీ రంగినే కానా

నీ మాటలింటే అలుపెక్కడుంటాది - నీతో ఉంటే లోటేమిటుంటాది

మావా నా మావా - నీ రంగినే కానా

మల్లెమాలలు కట్టుంచాను - ముస్తాబయ్యే ఉన్నాను

రాములోరి గుడికి పోదాం - సీతమ్మ తల్లికి దండలు వేద్దాం


పదరా మావా పదరా - పదయే నా రంగి

పదరా మావా పదరా మావా - పదయే నా రంగి

Wednesday, 16 July 2025

Saranu Siddhi Vinayaka - Purandhara Dasa Keerthana



Composer: Sri Purandhara Dasa

Raagam: Naata

Thaalam: Misrachaapu


ప) శరణు సిద్ధివినాయక శరణు విద్యా ప్రదాయక

శరణు పార్వతీతనయ మూర్తి శరణు మూషికవాహన


1) నిటిల నేత్రన దేవి సుతనే నాగ భూషణ ప్రియనే

తటిలతాంకిత కోమలాంగనే కర్ణకుండల ధారణే


2) బట్టముత్తిన పదకహారనే బాహుహస్త చతుష్టనే

ఇట్టతొడుగెయ హేమకంకణ పాశ అంకుశ ధారణే


3) కుక్షి మహా లంబోదరనే ఇక్షు చాపన గెలిదనే

పక్షివాహన సిరి పురందర విఠలన నిజదాసనే


Pa) Saranu Siddhi Vinayaka Saranu vidyaa pradaayaka

Saranu Parvathi thanaya moorthi saranu mooshika vaahana


1) Nitila nethrana devi suthaney Nagabhooshana priyane

Thatilathaanthika komalaanganey karna kundala dhaaraney


2) Batta mutthina padakahaaraney baahu hastha chathushtaney

Itta thodugeya Hema kankana paasa ankusa dhaaraney


3) Kukshi mahaa lambodaraney ikshu chaapana gelidaney

Pakshi vaahana siri Purandhara Vithalana niha daasaney



Monday, 17 March 2025

Chittithalliki nedu seemanthamu - Seemantham song

Chittithalliki nedu seemanthamu

Sri Ramarakshayani deevinthamu


Ninna monnati paapa thaanu illaalai

Bangaaru thalligaa avatharinchey vela

Pasupu kumkumalicchi pasidi gaajulu thodigi

Paripari vidhamula deevinthamu

Pacchagaa noorellu jeevimpagaa


Parimala gandhaalu paaraani aladi

Pandlu poolu icchi padathi odi nimpi

Mudamaara mudithanu deevinthamu

Kalalannee nijamulai phaliyimpagaa

Pandanti paapaayi prabhavimpagaa


చిట్టితల్లికి నేడు సీమంతము - శ్రీ రామరక్షయని దీవింతము


నిన్న మొన్నటి పాప తాను ఇల్లాలై

బంగారుతల్లిగా అవతరించే వేళ

పసుపు కుంకుమలిచ్చి పసిడి గాజులు తొడిగి

పరిపరి విధముల దీవింతము

పచ్చగా నూరేళ్ళు జీవింపగా


పరిమళ గంధాలు పారాణి అలది

పండ్లు పూలు ఇచ్చి పడతి ఒడి నింపి

ముదమార ముదితను దీవింతము

కలలన్నీ నిజములై ఫలియింపగా

పండంటి పాపాయి ప్రభవింపగా


Seethamma thalliki seemanthamu - Seemantham Song - సీమంతం పాట

Seethamma thalliki seemanthamu

cheyaga raarey chelulandaroo

Santhasammugaa athivalandaroo 

subhamasthu antoo kadali vaccheru


Malle jaaji manchi sampengalu

Kurulandu unchiri sreemukhulu

Attharu panneeru gandhamunu

Janaki menuna chilikincheru


Odibiyyamu chalimidi katnammulu

pasupu kumkuma cheera saarelu

Pasidi gaajulu madhura phalamulatho

Vedukagaanu odi nimperu


Santhasammugaa ghanamaina saarenu

puttintivaaru theccheru

Santhsanthaanamu kalugavalenani

Atthintivaaru deevincheru

Akshinthalatho athithulandaroo

aseessulanu kuripincheru


సీతమ్మ తల్లికి సీమంతము - చేయగ రారే చెలులందరూ

సంతసమ్ముగా అతివలందరూ - శుభమస్తు అంటూ కదలి వచ్చేరు


మల్లె జాజి మంచి సంపెంగలు - కురులందు ఉంచిరి శ్రీముఖులు

అత్తరు పన్నీరు గంధములు - జానకి మేనున చిలికించేరు


ఒడిబియ్యం చలిమిడి కట్నమ్ములు - పసుపు కుంకుమ చీరసారెలు

పసిడి గాజులు మధుర ఫలములతో - వేడుకగాను ఒడి నింపేరు


సంతసమ్ముగా ఘనమైన సారెను - పుట్టింటివారు తెచ్చేరు

సత్సంతానము కలుగవలెనని - అత్తింటివారు దీవించేరు

అక్షింతలతో అతిథులందరూ - ఆశీస్సులను కురిపించేరు