Sunday, 14 September 2025

శాస్త్రీయ - జానపద - లలిత సంగీత రీతులమధ్య తేడాలు-పోలికలు



మాండలీక పదాలు:

ఒకే రాష్ట్రంలోని ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క రకమైన యాస వాడుకలో ఉంటుంది.

విద్యావంతులు, నాగరికుల భాషకు, పల్లెప్రజల భాషకు తేడా ఈ యాసే.

వివిధ ప్రాంతాలలో, మండలాలలో వాడుకలో ఉన్న పదాలు, మాటలు మాండలీక పదాలు. ఇవి గ్రామీణుల భాషకు ఒక విశిష్టతను, ప్రత్యేకతను, వినూత్న సౌందర్యాన్ని చేకూరుస్తాయి. అటువంటి మాండలీక శబ్దాలతోను, యాసతోను పల్లీయులు పాడుకొనే గీతాలలోని సాహిత్యమే జానపద సాహిత్యం.


ప్రౌఢ సాహిత్యం:

సంస్కృత భాషలోని క్లిష్టమైన పదాలతో, సమాసాలతో, ఛందోబద్ధంగా పాండిత్య ప్రకర్షతో వెలుగొందే సాహిత్యం.

వృత్తాలు, రగడలు, ద్విపదలు, జాతులు, ఉపజాతులు కలిగిన పద్యాలు, పురాణేతిహాసాలు, ప్రబంధాలు, మొదలైనవి.

Friday, 12 September 2025

గీతం, వాద్య సంగీతం - సంబంధ బాంధవ్యాలు

  • లలితసంగీతంలో వాద్యసహకారం చేసేది:
    • శృతి, లయ ఆధారాన్ని అందించటం
    • గీతానికి తగ్గ రసపోషణకు దోహదం చేయటం
    • గాయకునికి కాస్త విరామాన్ని అందించటం
    • పాటయొక్క ఇతివృత్తానికి, భావానికి, రసానికి మరింత అందాన్ని అందించటం

  • వాయిద్యములలో రకములు:
    1. సుషిరములు: బెజ్జము గల వాయిద్యములు (వేణువు, క్లారినెట్, మొ||) 
    2. తతములు: తంత్రీవాద్యములు (వీణ, సితార్, వయోలిన్, మొ||)
    3. ఘనములు: లోహ వాద్యములు (మంజీర, జైలోఫోన్, మొ||)
    4. అవనత్థములు: చర్మ వాద్యములు (మృదంగం, తబలా, మొ||)
    5. విద్యుత్ పరికరములు (కీబోర్డ్, సింథసైజర్, మొ||)

  • ఈ వాయిద్యాలను ఏ పద్ధతిలో మేళవించాలి అనే విషయంలో వారివారి మేధస్సు, ఆలోచనాసరళి, కాల్పనిక శక్తులను బట్టి ఒకొక్కరికి ఒకొక్క శైలి ఉంటుంది.

   లక్షణ గీతం

ప) సుందరమౌ గీతానికి అందమైన ఆభరణం

సరిజోడుగ సమకూరే వాద్య సమ్మేళనం


చ1) సుషిరములు తతములు ఘన అవనత్థములు

అధునాతన విద్యుచ్చాలితమౌ ధ్వని పరికరములు

సుషమ సురుచిర స్వనముల విరియించే వాద్యములు

మేళవించు విధములు మేధకు తగు పథములు


చ2) ఔన్నత్యమే ఆశయమై ఔచిత్యమే అవశ్యమై

శోభిల్లిగ రూపొందే వాద్యసంగీతం

సన్నివేశ సందర్భములితివృత్తములు

సరితూగే పదసంపద ఆధారమై

అనువైన స్వరలహరుల అలరారే గీతం - ఆ

గీత వాద్యముల కలయిక

పూవు తావి పోలిక - ఆ

మేళనం రససిద్ధికి సోపానం - చిత్త

రంజనం ఆ స్వర పద మధుపానం

వినేవారిని ఒక గీతం రంజింపజేయాలంటే, వాద్య సహకారానికి ఉండవలసిన లక్షణాలు:

  • ఉన్నతంగా ఉండాలి
  • ఔచిత్యాన్ని పాటించాలి
  • రసపోషణకు అనుగుణంగా ఉండాలి
  • వివిధ సందర్భాలకు, సన్నివేశాలకు, ఇతివృత్తాలకు సరితూగే పదజాలానికి అనుగుణమైన స్వరాలతో, బాణీతో ఉండాలి



లలితగీత, సంగీత స్వరూప స్వభావాలు - వివరణ

  • లలితగీతాల రచన ఎలా ప్రారంభమయ్యింది?
    • 20వ శతాబ్దం తొలిదశలో మన దేశంలో అనేక ఉద్యమాలు చోటుచేసుకున్నాయి.
    • ఆంగ్ల విద్యాబోధన మొదలైన తర్వాత Keats, Shelly, Wordsworth మొదలైన ఆంగ్ల కవుల ప్రభావం మన యువ కవులపై పడి "భావ కవితా ఉద్యమానికి" దారితీసింది.
    • ఛందోబద్ధమైన పదాలు, పరుష వాక్యాలకు బదులుగా ప్రకృతి సంబంధమైన ఇతివృత్తాలు, సరళమైన పదాలు, సున్నితమైన భావాలు కవితావస్తువులుగా మారాయి.
    • 1910 లో గురజాడ అప్పారావుగారు రాసిన "దేశమును ప్రేమించుమన్నా" మొట్టమొదటి లలితగీతంగా సాహిత్యకారులచే నిర్ణయించబడింది.

  • లలితగీతం - లక్షణం
    • భావం + మనోరంజకమైన రాగం = లలితగీతం
    • స్వరం + పదం = లలితగీతం
    • మాట + పాట సమపాళ్ళలో మేళవించి హృదయాన్ని రంజింపజేసేది లలితగీతం.
    • మనసులో కలిగే భావాలు గీతంగా మారితే, వాటికి మంజులమైన స్వరాలు జోడించి మధురమైన అమృతధారగా ప్రవహింపజేసేది సంగీతం.
    • గీతం + సంగీతం = విన్నవారికి రసస్ఫూర్తి, మధురానందం.

  • లక్షణగీతం:
ప) మనసున పూచే తీయని ఊహల
మాలికయే మృదుగీతం
మధుర మనోహర మంజుల నాద
సుధాఝరియే సంగీతం
గీతం - సంగీతం నవరసభావ భరితం

చ1) మాటలో నిండు నుడికారం
పాటలోని సుస్వరసారం
స్వరపద సౌరభ సుమహారం
సుందరగీతికి శ్రీకారం

చ2) పాటలోని రసభావం
మేటి గళములో జీవం
వివిధవాద్య సహకారం
కలగలసిన సాకారం

అదియే లలితగీతం
గానమే లలితసంగీతం
గీత సంగీత సంగమం
రసికజన చిత్తరంజనం

  • మనసులో కలిగే భావం సంతోషం, విషాదం, జుగుప్స ఇలా ఏదైనాసరే, వాటికి మంజులమైన స్వరాలు జోడించి గీతంగా మారితే, వినేవారికి కలిగే భావం చివరకు ఆనందమే.
  • లోకంలోని శోకహర్షాల కారకాలే కావ్యనాటకాల్లో కూడా ఉన్నప్పటికీ, చివరకు కలిగే అనుభూతి ఆనందమే అవుతుంది అని తత్త్వవేత్త Aristotle లాంటివారు కూడా అంగీకరించారు.
  • మృదుగీతం = లలితము, కోమలము అయిన లలితగీతం.
  • గీతం అంటే మంజులం, మనోహరం అయిన సంగీతం.
  • లలితగీతం, సంగీతం నవరసాలు ఆలవాలం అయినవి. ఉద్భటుడు ఈ కిందివాటిని నవరసాలుగా పేర్కొన్నాడు.
    1. శృంగారము
    2. హాస్యము
    3. కరుణ 
    4. రౌద్రము
    5. వీరము
    6. భయానకము 
    7. భీభత్సము
    8. అద్భుతము
    9. శాంతము
శృంగార హాస్య కరుణా రౌద్రవీర భయానకాః
భీభత్సాద్భుత శాంతాశ్చ నవనాట్య రాసాః స్మృతాః

  • శాస్త్రీయసంగీతంలో నవరసాలు సంబంధించిన రచనలు అరుదు (కథావస్తువు గల "నౌకా చరిత్రము", "ప్రహ్లాద భక్త విజయము" వంటివి తప్ప). ఎక్కువగా కనిపించేవి భక్తి ,  శృంగార రసాలు.
  • శృంగారంలో కూడా నాయికానాయక భావంతో "మధురభక్తి" ఎక్కువగా కనిపిస్తుంది.
  • లలితగీతాల్లో కనిపించినంత విరివిగా జానపదసంగీతంలో కూడా నవరస ప్రయోగం లేదు.
  • పల్లెల్లో వివిధ సందర్భాల్లోనూ, వేడుకల్లోనూ, పండుగల్లోనూ జాతర్లలోనూ జానపదులు వారివారి మనోభావాలకు అనుగుణంగా ఆశువుగా పాడుకొనే పాటల్లో శృంగార, హాస్య, కరుణ రసాలు ఎక్కువగా కనిపిస్తాయి. మిగిలిన రసాలు అరుదు.
  • లలిత సంగీతంలో భావప్రాధాన్యత అధికంగా ఉంటుంది. తత్సంబంధిత రసపోషణకు అవకాశం ఉంటుంది.
  •  లలిత సంగీతంలో సాహిత్యం రసభావభరితం. నుడికారం ఊపిరి. సంగీతం ప్రాణం.

  • లలితగీతం రక్తికట్టాలంటే ఇవి అవసరం:
    • భావం
    • పదం
    • వాటికి తగ్గ రాగం
    • వీటన్నిటికీ జీవం పోసే గళం
    • అందుకు తగ్గ వాద్యసహకారం
  



Thursday, 11 September 2025

గాత్ర సంస్కృతి

  •  గాత్ర సంస్కృతి = సులభంగా పాడే పద్ధతి
  • సంస్కృతి = సంస్కారం
  • శాస్త్రీయ సంగీతానికి, జానపద సంగీతానికి వారధి లాంటిది లలిత సంగీతం.
  • సంగీత, సాహిత్య కలయికతో వివిధ భావాల్ని ప్రకటించగలదు కాబట్టి పండితుల్ని, పామరుల్ని కూడా ఆకర్షించగలదు లలిత సంగీతం.
  • లలితగీతాన్ని జనరంజకం చేయాలంటే గాయకులకు భాషపై అవగాహన, భావ వ్యక్తీకరణ కలిగి ఉండాలి.
  • శాస్త్రీయ సంగీతంలోని కృతులు, కీర్తనలు మొదలైన వాటిలో భక్తి ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ లలిత సంగీతంలో
    • భక్తిగీతాలు
    • ప్రేమగీతాలు
    • విరహగీతాలు
    • భావగీతాలు
    • దేశభక్తిగీతాలు
    • ప్రబోధగీతాలు
    • ప్రకృతి గీతాలు
    • సందేశాత్మక గీతాలు
    • విప్లవగీతాలు
      వీటిలో ఎక్కువగా భావాలు పలికించాల్సిన అవసరం ఉండటంవలన గాయకులకు గాత్ర సంస్కృతి తెలియటం అవసరం.
  • స్వరజ్ఞానంతోపాటుగా గాయకులందరూ అవగాహన చేసుకోవలసినవి:
    • భావము
    • పద ఉచ్చారణ
    • మాడ్యులేషన్
    • టోనల్ క్వాలిటీ

  • భావవ్యక్తీకరణ:
    • గీతాన్ని రచించేటప్పుడు కవి ఒక దృశ్యాన్ని చిత్రీకరించుకుంటాడు. గాయకులూ ఆ గీతాన్ని ఆలపించినప్పుడు వినే ప్రేక్షకులకు కవి హృదయం కనిపించేటట్టు/ వినిపించేటట్టు భావవ్యక్తీకరణ చేయాలి.
    • సంగీతానికి, సాహిత్యానికి తగు మోతాదులో ప్రాధాన్యతనివ్వాలి.
    • భావం తెలియకపోతే అడిగి తెలుసుకొని పాడాలి.
    • రాగాలాపన, స్వరకల్పన లలితసంగీతంలో జోడించరు. భావానికి అందం తీసుకువస్తుంది అనిపించినప్పుడే ఆలాపన చేయాలి.
    • ప్రేమగీతాల్లో అన్యస్వర ప్రయోగం, హిందుస్తానీ సంప్రదాయం ఎక్కువగా రక్తికడుతుంది (అతికినట్టు పాడితేనే).
    • సంగీతపరంగా, సాహిత్యపరంగా గీతంలోని ప్రతి భావాన్ని పలికించగలగటం  ఉత్తమ గాయకుడి లక్షణం.
      • ఏదైనా పదంలోని ఒక స్వరానికి బదులు కింది స్వరమో పై స్వరమో పాడి, మార్చటంవల్ల భావం పెంపొందుతుంది.
        • ఉదా: జయజయజయ ప్రియభారత: ఇందులో జయమదీయ హృదయాశయ అనే వాక్యంలో "మదీయ" రెండు సంగతులతో "మదీయ" లో మ కి ఒకచోట 'స', ఇంకోచోట 'ని' వాడటంవల్ల, ఆ పదానికి emphasis ఇచ్చినట్టు అయ్యి, భావం ఇనుమడిస్తుంది. (జయమదీయ = గగ సగాగ, గగ నిగాగ). 
      • పాటలోని స్వరాల అమరికను బట్టి, అది ప్రేమగీతమా, విరహగీతమా, కరుణరసమా, హుషారైన గీతమా అనేది అర్థంచేసుకోవాలి. ఉదా: శివరంజని రాగం:
          • సాధారణంగా విషాదానికి వాడతారు. (ఉదా:Mera naam joker movie లోని జానే కహాఁ గయే వో దిన్)
          • అదే రాగాన్ని హుషారుగా కూడా ఉపయోగించారు. (ఉదా: వగల రాణివి నీవే, movie: బందిపోటు)
      • కనుక భావాన్ని పలికించటంలో తేడా చూపించటంవల్ల అదే రాగంలో రెండు రకాల భావాలను అందంగా పలికించవచ్చు.
      • అవే స్వరాలను భావానికి అనుగుణంగా ముద్దుగానో, భావంగానో, ప్రశ్నించే విధంగానో, శరణుకోరే విధంగానో భావప్రకటన చేయచ్చు.

  • పద ఉచ్చారణ:
    • పాట 3 స్థాయిల్లో ఎక్కడ ఉన్నా, పదాలను మింగకుండా స్పష్టంగా పలకాలి.
    • ళ-ల, ణ-న, శ-ష-స వంటి అక్షరాలు పలకాలంటే ఎక్కడ నాలుక స్పృశించాలో తెలుసుకోవాలి.
      • ఉదా: సమర్పన, షివ, కాల్లు వంటి ఉచ్చారణను మానాలి.
    • బాధ, భేదము, భావము వంటి పదాల్లో మహాప్రాణాక్షరాలను స్పష్టంగా వినిపించేలా పలకాలి.

  • మాడ్యులేషన్:
    • పాటలోని భావానికి తగినట్టు మృదువుగానో, గంభీరంగానో పాడాలి.
      • ఉదా: జయజయజయ ప్రియభారత: ఇందులో "జయదిశాంత గత శకుంత దివ్యగాన పారితోషణ" అనే వాక్యంలో "జయదిశాంత గత శకుంత" వరకు గంభీరంగా పాడి, "దివ్యగాన పారితోషణ" అనేది మృదువుగా పాడితే బాగుంటుంది.
      • ఉదా: వందేమాతరం: ఇందులో "శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం ఫుల్లకుసుమిత ధ్రుమదళ శోభినీంఅనే వాక్యాన్ని గంభీరంగా పాడి, "సుహాసినీం సుమధుర భాషిణీం" అనేది మృదువుగా పాడితే బాగుంటుంది.
      • ఉదా: జనగణమన: ఇందులో "తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిశ మాగేఅనే వాక్యాన్ని కోమలంగా పాడి, "గాహే తవ జయగాధా" అనేది గంభీరంగా పాడితే బాగుంటుంది.

  • Timber (Tonal quality):
    • సహజంగా ప్రతి ఒక్కరికి అబ్బే గాత్రశైలి ఇది.
    • గాయకులందరూ అన్ని రకాల గీతాలను పాడగలిగేలా కృషి చేయాలి. అందుకోసం:
      • గొంతును బాగా తెరిచి పాడాలి. భావాన్ని పలికించటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
      • పాట పెదవినుంచే కాదు, మనసులోంచి, నాభిలోంచి రావాలి.
      • పళ్ళను నొక్కిపెట్టి పాడకూడదు.
      • ముక్కుతో పాడకూడదు.
      • పాటకి సరైన శృతిని ఎంచుకోవాలి.

  • Visaala Bharathadesam Manadi - Patriotic Song - Dasarathi

    Jalra Settings used to record this song:

    Count: 4

    Style: Basic 5

    Speed: 130 bpm

    Pitch: A#


    Lyrics: Sri Dasarathi

    Music: Sri Upadrashta Krishnamurthy


    Raagam: Hindolam

    Thaalam: Aadi


    Pa) Visaala Bharathadesam manadi - Himaalayaalaku nilayamidi

    Ilaanti desamlo prajalanthaa - visaala hrudayamtho melagaali


    1) Mathaalu veraithenemi - Bhaashalu veraithenemi

    Bhaaratheeyulam andaram - Bharathadesam sundaram


    2) Dwesham rosham tholagaali - Prema sneham melagaali

    Buddha Gandhila bodhanaley - tholaginchunu mana vedanaley


    3) Prema pathaakam chethagoni - aikyapathampai payaniddaam

    Thyaagasakthi mana mahaayudhamgaa - desa sathruvulanediriddaam


    ప) విశాల భారతదేశం మనది - హిమాలయాలకు నిలయమిది

    ఇలాంటి దేశంలో ప్రజలంతా - విశాల హృదయంతో మెలగాలి


    1) మతాలు వేరైతేనేమి - భాషలు వేరైతేనేమి

    భారతీయులం అందరం - భారతదేశం సుందరం


    2) ద్వేషం రోషం తొలగాలి - ప్రేమ స్నేహం మెలగాలి

    బుద్ధ గాంధీల బోధనలే - తొలగించును మన వేదనలే


    3) ప్రేమ పతాకం చేతగొని - ఐక్యపథంపై పయనిద్దాం

    త్యాగశక్తి మన మహాయుధంగా - దేశ శత్రువులనెదిరిద్దాం

     


    Nannidisipettellinaadey Naa Raju - Folk Song - Sri Nanduri Subbarao

    Jalra Settings used to record this song:

    Count: 5

    Speed: bpm

    Style:

    Pitch: D#


    Lyrics: Sri Nanduri Subbarao

    Music: Sri BV Narasimharao


    Raagam: Harikambhoji

    Thaalam: Trisra Gathi Aadi Thaalam


    Pa) Nannidisi pettellinaadey naa raju

    Monna thirigosthanannaadey


    1) Neelu thebothuntey nee thodey olammi

    Naayenta evaronu nadisinattuntaadey


    2) Addamlo sootthantey adiyeto siggammi

    Naayenaka evaronu navvinattuntaadey


    3) Sallanni ennetlo saapesi kookuntey

    ottammi ollantha ulikuliki padathaadey


    ప) నన్నిడిసిపెట్టెల్లినాడే నా రాజు

    మొన్న తిరిగొస్తనన్నాడే


    1) నీలు తేబోతుంటే నీతోడే ఓలమ్మి

    నాయెంట ఎవరోను నడిసినట్టుంటాదే


    2) అద్దంలో సూత్తంటే అదియేటో సిగ్గమ్మి

    నాయెనక ఎవరోను నవ్వినట్టుంటాదే


    3) సల్లని ఎన్నెట్లో సాపేసి కూకుంటే

    ఒట్టమ్మి ఒళ్ళంత ఉలికులికి పడతాదే

    Tuesday, 9 September 2025

    Darisenameeyaraa - Sri Aadipudi Somanatharao - Devotional Song

    Lyrics: Sri Aadipudi Somanatharao

    Music: Sri Kalaga Krishna Mohan


    Raagam: Suddha Sarang

    Thaalam: Aadi Thaalam


    Pa) Darisenameeyaraa dhanyula seyaraa

    Parama dayaakaraa paapa nivaaraa


    1) Mamu krupajoodaraa - Maa mora vinaraa

    Sumano manoharaa - Suddha vichaaraa


    2) Raaraa maa madi dora - raajyamu seyaraa

    Korikalu mithimeera - kollaga panduraa


    3) Chinthalu deercharaa chitthaabja Bhaskaraa

    Santhaapamarparaa - Santhi sudhaakaraa


    ప) దరిసెనమీయరా ధన్యుల సేయరా

    పరమదయాకరా పాపనివారా


    1) మము కృపజూడరా - మా మొర వినరా

    సుమనోమనోహరా - శుద్ధ విచారా


    2) రారా మా మది దొర - రాజ్యము సేయరా

    కోరికలు మితిమీరి - కొల్లగ పండురా


    3) చింతలు దీర్చరా చిత్తాబ్జ భాస్కరా

    సంతాపమార్పరా శాంతి సుధాకరా