Showing posts with label Reethigowla. Show all posts
Showing posts with label Reethigowla. Show all posts

Thursday, 6 February 2025

Paripalaya Paripalaya - Thyagaraja Divyanaama Keerthana




Raagam: Reethigowla

Thaalam: Roopaka


ప. పరిపాలయ పరిపాలయ పరిపాలయ రఘునాథ


1. తనువే నీకనువైన సదనమౌరా రఘునాథ

2. స్థిర చిత్తము వర చామీకర పీఠము రఘునాథ

3. సు-పద ధ్యానము గంగా జలమౌరా రఘునాథ

4. ఇభ పాలక అభిమానము శుభ చేలము రఘునాథ

5. ఘన కీర్తిని పలికే వాసన గంధము రఘునాథ

6. హరి నామ స్మరణములు విరులౌరా రఘునాథ

7. తొలి దుష్కృత ఫలమెల్ల గుగ్గులు ధూపము రఘునాథ

8. నీ పాద భక్తియే ప్రొద్దు దీపంబగు రఘునాథ

9. నే జేయు సు-పూజా ఫలము భోజనమవు రఘునాథ

10. ఎడ-బాయని నాయెడ కల్గు సుఖము విడెమౌరా రఘునాథ

11. నిన్ను జూచుటే ఘన దీపారాధనమౌరా రఘునాథ

12. పూజా విధి నైజ త్యాగరాజ కృతము రఘునాథ


Pa) Paripaalaya paripaalaya paripaalaya Ragunaatha


1) Thanuve neekanuvaina sadanamauraa Ragunaatha

2) Sthira chitthamu vara chaameekara peethamu Ragunaatha

3) Supada dhyaanamu Gangaa jalamouraa Ragunaatha

4) Ibha paalaka abhimaanamu subha chelamu Ragunaatha

5) Ghana keerthini palikey vaasana gandhamu Ragunaatha

6) Hari naama smaranamulu virulouraa Ragunaatha

7) Tholi dushkRtha phalamella guggulu dhoopamu Ragunaatha

8) Nee paada bhakthiye proddu deepambagu Ragunaatha

9) Ney jeyu supoojaa phalamu bhojanamavu Ragunaatha

10) Edabaayani naayeda kalgu sukhamu videmouraa Ragunaatha

11) Ninnu joochute ghana deepaaraadhanamouraa Ragunaatha

12) Pojaa vidhi naija Thyagaraja kRthamu Ragunaatha


Tuesday, 30 January 2024

Seetha Nayaka - Thyagaraja Divyanaama Keerthana

Raagam: Reethigowla

Thaalam: Misrachaapu


Pa) Seethaa Naayaka srithajana poshaka

Sri Raghukula thilaka O Rama


1) Nirupeda bhakthula karikotha padaleka

giripainekkukontivo


2) Angalaarpu joochi Rangapuramuna

chelanguchu pandithivo


3) Kaachina bhakthula joochi yaa Baliney

yaachincha vedalithivo


4) Aasa minchi ninnaasu jerenani

keesula jerithivo


5) Jaalitho vacchu Kucheluni gani Gopee

chelamuletthithivo


6) Ingithmerigi upponguchu brochu

bangaaru doravaithivo


7) Nee gunamula guttu baaguga thelisenu

Thyagaraja vinutha


ప) సీతానాయక శ్రితజనపోషక - శ్రీరఘుకుల తిలక ఓ రామ

1) నిరుపేద భక్తుల కరికోత పడలేక - గిరిపైనెక్కుకొంటివో

2) అంగలార్పుజూచి రంగపురమున - చెలంగుచు పండితివో

3) కాచిన భక్తులజూచియా బలినే - యాచించ వెడలితివో

4) ఆశ మించి నిన్నాశు జేరెనని - కీశుల జేరితివో

5) జాలితో వచ్చు కుచేలుని గని గోపీ - చేలములెత్తితివో

6) ఇంగితమెరిగి ఉప్పొంగుచును బ్రోచు - బంగారు దొరవైతివో

7) నీ గుణముల గుట్టు బాగుగ తెలిసెను - త్యాగరాజ వినుత 

Wednesday, 12 April 2023

Srirama Kalyaana Subhalagnamaey - Anupama Yeluripati & Sri Bharatam Srimannarayana - Pelli paata



Raagam: Reethigowla - based

Thaalam: Khandachaapu


Jalra settings used to record this song:

Count: 5

Style: 2.5 ThomTaKiTa

100 BPM

Pitch: G#


ప) శ్రీరామ కళ్యాణ శుభలగ్నమే నేడు

సీతమ్మ వధువైన సుముహూర్తమీనాడు


నానందమే - ఆనందమే

ఆనందమానందమానందమే - ఆనందమానందమానందమే


1) భక్తమానస నిలయుడనుచు కీర్తించి

మంగళము పాడిరట మగువలందరునిచట

కర్పూరహారతులు, పసుపుగంధాలతో

సుందరాంగుని వరుని చేయగా వీక్షించ


నానందమే - ఆనందమే

ఆనందమానందమానందమే - ఆనందమానందమానందమే


2) సిగ్గువడి సీతమ్మ పెడమరలి కూర్చుండ

చెలికత్తెలిటు చేరి ఏడి నీ వరుడంటు

ఆడుచూ పాడుచూ అల్లర్లు చేయుచూ

ముస్తాబులొనరింప చూచు కన్నులకు


నానందమే - ఆనందమే

ఆనందమానందమానందమే - ఆనందమానందమానందమే


3) సురగణము దిగిరాగ పెళ్ళిపెద్దలుగా

భూసురులు దీవింప వేదమంత్రాలతో

బ్రహ్మాది దేవతలు అక్షతలు వేసి

ఆశీర్వదించగా అరయువారికినెల్ల


నానందమే - ఆనందమే

ఆనందమానందమానందమే - ఆనందమానందమానందమే


4) మేళాలు తాళాలు భేరీ మృదంగాలు

శంఖాలు కాహళలు హోరెత్తి మ్రోగంగ

బంధువుల సందడులు పరిహాసవాక్యాలు

పరిపరి విధంబులుగ పందిరంతట సాగ


నానందమే - ఆనందమే

ఆనందమానందమానందమే - ఆనందమానందమానందమే


Pa) Srirama kalyaana suubha lagnamey - nedu

Seethamma vadhuvaina sumuhoorthamey


Aanandamey - Aanandamey

Aanandamaanandamaanandamey - Aanandamaanandamaanandamey


1) Bhaktha maanasa nilayudanuchu keerthinchi

mangalamu paadirata maguvalandarunichata

Karpoora haarathulu, pasupu gandhaalatho

sundaraanguni varuni cheyagaa veekshincha


naanandamey - Aanandamey

Aanandamaanandamaanandamey - Aanandamaanandamaanandamey


2) Sigguvadi Seethamma pedamarali koorchunda

chelikatthelitu cheri edi nee varudantu

aaduchoo paaduchoo allarlu cheyuchoo

musthaabulonarimpa choochu kannulaku


naanandamey - Aanandamey

Aanandamaanandamaanandamey - Aanandamaanandamaanandamey


3) Suraganamu digiraaga pellipeddalugaa

bhoosurulu deevimpa vedamanthraalatho

Brahmaadi devathalu akshathalu vesi

aseervadinchagaa arayuvaarikinella


naanandamey - Aanandamey

Aanandamaanandamaanandamey - Aanandamaanandamaanandamey


4) Melaalu thaalaalu bheree mrudangaalu

sankhaalu kaahalalu horetthi mroganga

bandhuvula sandadulu parihaasa vaakyaalu

paripari vidhamuluga pandiranthata saaga


naanandamey - Aanandamey

Aanandamaanandamaanandamey - Aanandamaanandamaanandamey





Thursday, 2 June 2022

Sri Gayathri Stotram - Sri Bharatam Srimannarayana

Lyrics: Sri Bharatam Srimannarayana

Music: Anupama Yeluripati

Raagam: Raaga Maalika (Hamsadhwani, Reethigowla, Mohana, Hindolam, Bilahari, Madhyamavathi)

Thaalam: Chuthurasra gathi Eka Thaalam, Khanda gathi Eka Thaalam





1) ఉదయాస్త మయాచల మధ్య చరత్

కమనీయ శరీర సుకాన్తిమతి!

కరుణా వరుణాలయ దివ్యకళే!

పరిపాలయ లోక మహో జనని!


ఉదయాస్తమయ పర్వతముల నడుమ గల భువనములందు విస్తరించియున్న శరీరకాంతులు కల్గినదానా! కరుణాసింధూ! ఓ గాయత్రీమాతా! నీ లోకములను నిత్యము రక్షించుకొనుము.


2) శుభ మేమి భవత్ పద మార్జనయా

సుఖమేమి భవత్ కర లాలనయా।

యశ ఏమి భవద్గుణ కీర్తనయా

ఋతమేమి భవన్మను చింతనయా॥


నీ పాదములను కడుగుట వలన శుభమును, నీ కరయుగ్మలాలనముచే సుఖమును, నీ గుణగానముచే కీర్తిని, నీ మంత్రజపముచే సత్యప్రవృత్తిని పొందుదునుగాక.


3) అధరీకృత కామగవీ చరితే!

ఉరరీకృత సాధు సుభక్తనుతే!

విదళీకృత దానవ దుష్ట గతే!

విశదీకృత మౌని మనః ప్రకృతే!


కామధేను చరిత్రను మించిన చరిత్ర నీది. భక్తుల నమస్కారములను అంగీకరించు శీలము నీది. దానవుల దుష్టతను తొలగించు ప్రవృత్తి నీది. మౌనుల మనఃప్రవృత్తులను తీర్చి దిద్దు కరుణ నీదే.


4) భవబంధన మోచన కేళి రతే

కరుణామృత సేచన భవ్యగతే

గతి ధిక్కృత గంధగజాధిపతే

శ్రుతి కీర్తిత దివ్య గుణ ప్రతతే


సంసార బంధమును తొలగించి, కరుణారసమును చిలికించి, గమనముచే గజాధిపతిని నిర్జించి శ్రుతులచే పొగడబడిన గుణసంపద గల తల్లీ నీకు ప్రణతులు.


5) సుజనీకృత సర్వ విరోధిపతే!

స్వజనీకృత నిశ్చల భక్త తతే!

ధ్వజినీకృత సర్వసతీ నివహే!

విజనీకృత సన్నుత కేళి గృహే!


నీ సర్వ విరోధులను సుజనులుగా మార్చుకొను నేర్పుగలదానవు. భక్తులను నీ స్వజనముగా స్వీకరించు ఔదార్యము కలదానవు. సతీవర్గమును నీకు సైనికవర్గముగా చేసికొనే సౌశీల్యము గలదానవు. నీ కేళి గృహమున మాత్రమెవ్వరికిని (నీ పతికి తక్క) స్థానము నీయని పతివ్రతవు.


6) తనుతాం తనుతాం మమ పాపశతమ్

భజతాం భజతాం విరతిం దురితమ్!

అయతామయతాం జన దుశ్చరితం

త్వసతా మసతాం నికృతం సుకృతమ్॥


నా పాపశతము క్షయమునందునుగాక! నీ భక్తుల పాపము శమించుగాక! జనుల దుష్కృత్యములు శుభకృత్యములగుగాక! దుర్జనుల చరితము నీ దయ వలన సుచరితమగుగాక!


7) వివిధాని వచాంసి వదేత్ జనతా

తవ నామ న కించిదపి స్మరతి

క్షమయా కృపయా పరిపాలయ తాం

జననీ యది కుప్యతి కః శరణమ్?


జనములలో చాలామంది ఏవేవో ప్రలాపములు చేయుదురే గానీ, నీ నామమును ఉచ్చరించువారెవ్వరును లేరు. వారి అజ్ఞానమును క్షమింపుము. తల్లియే కోపించిన బిడ్డలకిక దిక్కెవ్వరు?

8) హరి రుద్ర విరించి దివస్పతయో

గతయోగతయోపగతిమ్ దధతే।

యదినోపదిశేస్తదవశ్య విధీన్

జగతాం గతిరేతి తమః పటలమ్॥


త్రిమూర్తులు, ఇంద్రుడు యోగమార్గమున నిన్నే ధ్యానింతురు. వారి వారి కర్తవ్యములను ఎప్పటికప్పుడు తెలుపకపోయినచో లోకములన్నియు చీకటి మయమైపోవా?


9) వినా వేదమాత్రా, న ధాతా న విష్ణుః

న రుద్రో నచేంద్రో న సూర్యో నచన్ద్రః।

న తారా న లోకా న కాలా న వేదా

న శాస్త్రం న విద్యా న మంత్రో న తంత్రమ్॥


వేదమాత గాయత్రిని విడిచి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, లోకములు, కాలములు, వేదములు, శాస్త్ర-విద్యలు, మంత్ర-తంత్రములు వీని ఉనికియే లేదు.


10) బిభేత్యేవ వాయుస్త్వదగ్రే ప్రవాతుం

తపత్యేవ సూర్యో భయాత్ త్వత్సకాశే।

భియా చేంద్ర వహ్నీ త్వదాజ్ఞాం వహేతే

ప్రధావ త్యహో దూర దేశం స మృత్యుః॥


ఓ గాయత్రీ! నీ భయము వలననే వాయువు వీచుచున్నాడు. నీ భయము వలననే సూర్యుడు లోకములకు వెలుగునిచ్చుచున్నాడు. నీకు భయపడియే ఇంద్రుడు, అగ్ని, లోకపాలకత్వమును వహించుచున్నారు.


11) వృథా దేహదార్ఢ్యం వృథా వస్తు వృద్ధిః

వృథా పుత్ర పౌత్రాది చాయుర్వృథైవ।

వృథా తస్య జన్మాపి యస్త్వాం వివర్జ్య

యథేచ్ఛం ప్రవర్తేత విప్రోSపి భూత్వా॥


విప్రుడైయుండియు ఎవడు నిన్ను విడిచి యథేచ్ఛముగా లోకయాత్ర సాగించునో, వాని దేహసంపద, వస్తుసంపద, దారాపుత్రాది సంపద, ఆయుస్సంపద - చివరకు వాని జన్మము కూడ వ్యర్థములే.


12) స్త్రియా మన్త్ర పాఠాధికారో న చేత్ స్యాత్,

భవన్నిత్య పూజాధికారోSస్తి తంత్రాత్।

తథా శూద్ర జాతి స్తథై వాన్త్యజా వా,

భవత్ పూజనార్హాశ్చ తాన్ రక్ష మాతః॥


స్త్రీలకు, శూద్రులకు నీ మంత్రపాఠము విషయమున అధికారము లేకున్నను, తంత్ర విధానముచే నీ పూజాదికములు నిర్వర్తించు అధికారమున్నది. వారి పూజను స్వీకరించి, వారిని కూడా విప్రులవలెనే కాపాడుచుందువుగాక!


1) Udayaasthamayaachala madhya charath

Kamaneeya sareera sukaanthimathi!

Karunaa varunaalaya madhyakaley!

Paripaalaya loka mahojanani!


O light that bathes the earth between sunrises and sunsets, O ocean of love, O mother Gayatri, please protect your worlds.


2) Subhamemi bhavath pada maarjanayaa

Sukhamemi bhavath kara laalanayaa|

Yasa emi bhavadguna keerthanayaa

Rithamemi bhavanmanu chinthanayaa||


May those who wash your feet and hands get good fortune and happiness. May those who sing your virtues get glory, and may those who chant your mantra lead a righteous life.


3) Adhareekritha kaamagavee charithey!

Urareekritha saadhu subhakthanuthey!

Vidaleekritha daanava dushta gathey!

Visadeekritha mouni manah prakrithey!


As a giver, your fame is larger than Kamadhenu’s. You readily accept your devotees’ respect and love. Cleansing the evil in demons is your second nature. It is your grace that blesses ascetics to overcome fickleness of the mind.


4) Bhava bandhna mochana keli rathey

Karunaamritha sechana bhavyagathey

Gathi dhikkritha gandhagajaadhipathey

Sruthi keerthitha divya guna prathathey


You remove the shackles of samsara and the ill-effects of Gajadhipati, the sacred texts so glorify your virtues. I bow to you O mother.


5) Sujaneekritha sarva virodhipathey!

Swajaneekritha nischala bhaktha thathey!

Dhwajineekritha sarva sathee nivahey!

Vijineekritha sannutha keli grihey!


You turn every foe into a friend. You accept everyone as your own and they in turn shall willingly join your army if need be. You are a pativrata.


6) Thanuthaam thanuthaam mama paapasatham

Bhajathaam bhajathaam virathim duritham!

Ayathaam ayathaam jana duscharitham

Thwasathaam asathaam nikrithi sukritham||


May your devotees' sins wane. By your grace, may misdeeds become virtuous deeds and ignoble reputations become noble.


7) Vividhaani vachaamsi vadeth janathaa

Thava naama na kinchidapi smarathi

Kshamayaa kripayaa paripaalaya thaam

Jananee yadi kupyathi kah saranam?


Please countenance those who ignore to chant your name with devotion. Forgive their ignorance as a mother would.


8) Hari Rudra Virinchi divaspathayo

Gathayo gathayo pagathim dadhathey|

Yadinopadisesthadavasya vidheen

Jagathaam gathirethi thamah patalam||


The Trinity and Lord Indra pray to you through the path of Yoga and get guidance from you. Without that the worlds will fall into darkness.


9) Vinaa veda maathraa, na Dhaathaa na Vishnuh

Na Rudro na chendro na Suryo na Chandrah|

Na thaaraa na lokaa na kaalaa na vedaa

Na saasthram na vidyaa na manthro na thantham||


Without you O mother Gayatri, Brahma, Vishnu, Rudra, Indra, Surya, Chandra, the stars, the worlds, time, the vedas, knowledge, and mantra-tantra don’t exist.


10) Bibhethyeva vaayusthwadagrey pravaathum

Thapathyeva Suryo bhayaath thwathsakaasey|

Bhiyaa chendra vahnee thwadaajnyaam vahethey

Pradhaava thyaho doora desam sa mrithyuh||


O Gayatri, it is the fear of you that makes Vayu give air and Surya give light. It is the fear of you that makes Indra and Agni fulfil their responsibilities as rulers of the world.


11) Vrithaa dehadaardhyam vrithaa vasthu vriddhih

Vrithaa puthra pouthraadi chaayurvrithaiva|

Vrithaa thasya janmaapi yasthwaam vivarjya

Yatheccham pravarthetha vipropi bhoothwaa||


A person of knowledge who turns a blind eye to you, such a person's riches like good health, wealth, family, longevity, including the very birth itself, are in vain.


12) Sthriyaa manthra paathaadhikaaro na cheth syaath,

Bhavannithya poojaadhikaarosthi thanthraath|

Thathaa soodra jaathi sthaivaanthyajaa vaa,

Bhavath poojanaarhaascha thaan raksha maathah||


Although women and shoodras cannot pray to you in the mantra form, they can worship you in the tantra method through rituals. Please accept their prayers and protect them too.

Thursday, 16 July 2020

Jo Jo Rama Ananda Ghana - Thyagaraja Keerthana - Reethigowla - Aadi

జో జో రామ ఆనంద ఘన

చ1. జో జో దశరథ బాల రామ
జో జో భూజా లోల రామ (జో)

చ2. జో జో రఘు కుల తిలక రామ
జో జో కుటిల తరాలక రామ (జో)

చ3. జో జో నిర్గుణ రూప రామ
జో జో సుగుణ కలాప రామ (జో)

చ4. జో జో రవి శశి నయన రామ
జో జో ఫణి వర శయన రామ (జో)

చ5. జో జో మృదు తర భాష రామ
జో జో మంజుళ వేష రామ (జో)

చ6. జో జో త్యాగరాజార్చిత రామ
జో జో భక్త సమాజ రామ (జో)

Jo jo Rama Ananda ghana

1) Jo jo Dasaratha Baala Rama
Jo jo Bhoojaa lola Rama

2) Jo jo Raghukula thilaka Rama
Jo jo kutila tharaalaka Rama

3) Jo jo nirguna roopa Rama
Jo jo suguna kalaapa Rama

4) Jo jo Ravi Sasi nayana Rama
Jo jo Phanivara sayana Rama

5) Jo jo mruduthara bhaasha Rama
Jo jo manjula vesha Rama

6) Jo jo Thyagaraajaarchitha Rama
Jo jo bhaktha samaaja Rama