Showing posts with label Bhadrachala Ramadasu/Kancharla Gopanna. Show all posts
Showing posts with label Bhadrachala Ramadasu/Kancharla Gopanna. Show all posts

Thursday, 21 March 2024

Enduku Krupa Raadu - Bhadrachala Ramadasu Keerthana

 



Raagam: Aananda Bhairavi

Thaalam: Trisra Gathi Eka Thaalam


Pa) Enduku krupa raadu Sri Rama

Nenemi chesithinayyaa Sri Rama


1) Gathi neeveyanukonti Sri Rama - naa

vetha maanpagalavayyaa Sri Rama


2) Ayyayyo naa neramemi Sri Rama - naa

kuyyaalimpavayya Sri Rama


3) Inka nee daya raakunte Sri Rama - naa

sankatametu theeru Sri Rama


4) Vaasiyou Bhadraadrivaasa Sri Rama - Rama

dasuni viduvaku Sri Rama

ప) ఎందుకు కృప రాదు శ్రీరామ - నేనేమి చేసితినయ్యా శ్రీరామ


1) గతి నీవేయనుకొంటి శ్రీరామ నా - వెత మాన్పగలవయ్యా శ్రీరామ

2) అయ్యయ్యో నా నేరమేమి శ్రీరామ నా - కుయ్యాలింపవయ్యా శ్రీరామ

3) ఇంక నీ దయ రాకుంటే శ్రీరామ నా - సంకటమెటు దీరు శ్రీరామ

4) వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ రామ-దాసుని విడువకు శ్రీరామ


Saturday, 8 April 2023

Pahimam Sri Rama antey - Bhadrachala Ramadasu Keerthana




Jalra settings used to record this song:

Count: 4

Style: Basic 5

60 BPM

Pitch: G#


Raagam: Yadukula Kambhoji

Thaalam: Aadi


Pa) Paahimaam Sri Rama antey palakavaithivi - nee

sneham ettidani ney cheppanohohohohohohoho


1) Ibbandinondi aakari bobba pettinanthaloney

Gobbuna gaachithivata jabbuseyaka

Nibbaramugaa nenentho kabbamicchi vedukonna

Thabbibbu chesedavu Rama abbabbabbabbabbabbabbaa


2) Sannuthinchinavaarinella munnu dayatho brochithivani

Pannagasaayini kani vinnavinchithi

Vinnapamu vinakayentho kannada chesedavu Raama

Ennatikee nammaraadurannannannannannannannaa


3) Chayyena Bhadradri nilaya swamivani nammi nenu

Vemaru vidhamula vinuthi cheya saagithi

Iyyada Raamadaasuni kuyyaalinchi brovakunna

Vayyaaramemanavacchu ayyayyayyayyayyayyayyo


ప) పాహిమాం శ్రీరామ అంటే పలకవైతివి - నీ 

స్నేహమెట్టిదని నే చెప్పనోహోహోహోహోహోహోహో 


1) ఇబ్బందినొంది ఆఖరి బొబ్బ పెట్టినంతలోనే

గొబ్బున గాచితివట జబ్బుసేయక

నిబ్బరముగా నేనెంతో కబ్బమిచ్చి వేడుకొన్న

తబ్బిబ్బు చేసెదవు రామ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా


2) సన్నుతించినవారినెల్ల మున్ను దయతో బ్రోచితివని

పన్నగశాయిని కని విన్నవించితి

విన్నపము వినక ఎంతో కన్నడ చేసెదవు రామ

ఎన్నటికీ నమ్మరాదురన్నన్నన్నన్నన్నన్నన్నా


3) చయ్యెన భద్రాద్రినిలయ స్వామివని నమ్మి నేను

వేమారు విధముల వినుతి చేయ సాగితి

ఇయ్యడ రామదాసుని కుయ్యాలించి బ్రోవకున్న 

వయ్యారమేమనవచ్చు అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో


Tuesday, 28 March 2023

Charanamuley Nammithi - Bhadrachala Ramadasu Keerthana



Raagam: Kaapi

Thaalam: Aadi


Pa) Charanamuley nammithi - nee divya

charanamuley nammithi


1) Vaaradhi gattina vara Bhadraachala varadaa varadaa  varadaa nee divya

2) Aadipurusha nannaramarajeyakumayyaa nee divya

3) Vanamuna raathini vanithagaa jesina charanam saranam nee divya

4) Paadaaravindamey aadhaaramani ney pattithi pattithi nee divya

5) Baaguga nannelu Bhadraachala Raamadaasuda daasuda daasuda nee divya


ప) చరణములే నమ్మితి - నీ దివ్య చరణములే నమ్మితి

1) వారధిగట్టిన వర భద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య

2) ఆదిపురుష నన్నరమరజేయకుమయ్యా నీ దివ్య

3) వనమున రాతిని వనితగజేసిన చరణం శరణం నీ దివ్య

4) పాదారవిందమే ఆధారమై నే పట్టితి పట్టితి నీ దివ్య

5) బాగుగ నన్నేలు భద్రాచల రామదాసుడ దాసుడ దాసుడ నీ దివ్య

Monday, 27 March 2023

Thakkuvemi Manaku - Bhadrachala Ramadasu Keerthana



Raagam: Souraashtra

Thaalam: Aadi


ప) తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనెయుండగ


1) మ్రుచ్చుసోమకుని మునుజంపినయా - మత్స్యమూర్తి మన పక్షమునుండగ

2) సురుల కొరకు మందరగిరి మోసిన - కూర్మావతారుని కృప మనకుండగ

3) దురాత్మకుని హిరణ్యాక్షు ద్రుంచిన - వరాహుండు మనవాడై యుండగ

4) హిరణ్యకసిపుని ఇరు చెక్కలుగా - పరచిన నరహరి ప్రక్కనెయుండగ

5) భూమి స్వర్గమును పొందుగ గొలిచిన - వామనుండు మనవాడై యుండగ

6) ధరలో క్షత్రియుల దండించినయా - పరశురాముడు మన దరినుండగ

7) దశగ్రీవు మును దండించినయా - దశరథరాముని దయ మనకుండగ

8) ఇలలో యదుకులమందుదయించిన - బలరాముడు మన బలమైయుండగ

9) దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగ

10) కలియుగాంతమున కలిగెడి దైవము - కలికి మనలను కావగనుండగ

11) రామదాసునిల రక్షించెదనని - ప్రేమతో పలికిన ప్రభువిటనుండగ

Pa) Thakkuvemi manaku Raamundokkadundu varaku

Pakka thodugaa Bhagavanthudu mana Chakradhaariyai chenthaneyundaga


1) Mrucchusomakuni munujampinayaa

Mathsya moorthi mana pakshamunundaga


2) Surala koraku Mandaragiri mosina

Koormaavathaaruni krupa manakundaga


3) Duraathmakuni Hiranyaakshu drunchina

Varaahundu manavaadai yundaga


4) Hiranyakasipuni iru chekkalugaa

parachina Narahari prakkaneyundaga


5) Bhoomi swargamunu ponduga golichina

Vaamanundu manavaadai yundaga


6) Dharalo kshathriyula dandinchinayaa

Parasu Raamudu mana darinundaga


7) Dasagreevu munu dandinchinayaa

Dasaratha Raamuni daya manakundaga


8) Ilalo Yadukulamandudayinchina

Balaraamudu mana balamai yundaga


9) Dushta Kamsuni drunchinatti Sri

Krishnudu manapai krupathonundaga


10) Kaliyugaanthamuna kaligedi daivamu

Kaliki manalanu kaavaganundaga


11) Raamdaasunila rakshinchedanani

prematho palikina prabhuvitanundaga


Wednesday, 15 March 2023

Raamajogi mandu konarey - Bhadrachala Ramadasa Keerthana



Raagam: Khamas

Thaalam: Aadi


Pa) Raamajogi mandu konarey o janulaaraa

Raamajogi mandu konarey


1) Ramajogi mandu meeru prematho bhujiyincharayyaa

Kaamakrodhamulanella kadaku paaradroley mandu


2) Kaatuka kondalavanti karmamuledabaapey mandu

Saatileni jagamunandu swamy Raamajogi mandu


3) Koti dhanamulitthunani konnanu dorakani mandu

Saatileni bhaagavathulu smarana chesi thalachu mandu


4) Vaaduku cheppinagaani vaari paapamulugottu

Mudamuthoney mokshamicchey muddu Raamajogi mandu


5) Mudamutho Bhadradriyandu mukthini pondinchey mandu

Sadayudaina Ramadasu sadbhakthitho golichey mandu


ప) రామజోగి మందు కొనరే ఓ జనులారా

రామజోగి మందు కొనరే


1) రామజోగి మందు మీరు ప్రేమతో భుజియించరయ్యా

కామక్రోధములనెల్ల కడకు పారద్రోలే మందు


2) కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు

సాటిలేని జగమునందు స్వామి రామజోగి మందు


3) కోటి ధనములిత్తునని కొన్నను దొరకని మందు

సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు


4) వాదుకు చెప్పినగాని వారి పాపములుగొట్టు

ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగి మందు


5) ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు

సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచే మందు

Monday, 17 January 2022

Seetha Rama Swamy - Bhadrachala Ramadasu Keerthana

సీతారామస్వామి నే జేసిన నేరంబేమి

ఖ్యాతిగ నీ పదపంకజ యుగళము ప్రీతిగ దలపక భేదమెంచితినా


రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా

ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా
కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా
మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని

తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా
పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా
స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా

ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా
దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా
విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా
ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా

Monday, 4 October 2021

Ramakrishna Govinda Narayana - Bhadrachala Ramadasu Keerthana


Raagam: Yaman Kalyan

Thaalam: Aadi


ప) రామకృష్ణ గోవింద నారాయణ - శ్రీ 

రామకృష్ణ గోవింద నారాయణ


1) రామకృష్ణయని ప్రేమతో పిలచిన

మోమైనా జూపవేమి నారాయణ


2) అండజ వాహన పుండరీకాక్షా నీ

దండ జేరినామయ్య నారాయణ


3) మాధవ విష్ణు మధుసూదనా శేషశయన

శ్రీధర శ్రీమన్నారాయణ


4) వాసుదేవ ముకుంద వనమాలి చక్రధర

నరసింహాచ్యుత నారాయణ 


5) పతితుడనని నిన్ను బ్రతిమాలుకున్న - సీతా

పతి నన్ను కావవేమి నారాయణ


6) రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచల

రాముడవైన శ్రీ నారాయణ


Pa) Ramakrishna Govinda Narayana - Sri

Ramakrishna Govinda Narayana


1) Ramakrishnayani prematho pilachina

momaina joopavemi Narayana


2) Andaja vaahana Pundareekaaksha nee

danda jerinaamayyaa Narayana


3) Madhava Vishnu Madhusudana Seshasayana

Sridhara Srimannarayana


4) Vasudeva Mukunda Vanamali Chakradhara

Narasimhachyutha Narayana


5) Pathithudanani ninnu brathimaalukunna - Seethaa

pathi nannu kaavavemi Narayana


6) Ramadasuni brova prematho Bhadrachala

Ramudavaina Sri Narayana

Tuesday, 28 September 2021

Paahi Ramaprabho - Bhadrachala Ramadasu Keerthana





Raagam: Madhyamavathi

Thaalam: (Khanda gathi) Aadi


పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో

1. ఇందిరా హృదయారవిందాధిరూఢ
సుందరాకార ఆనంద రామప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో

2. బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్శితానంద రామప్రభో
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో

3. నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో

4. శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారెకును వింతగా చదువు రామప్రభో
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో

5. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో

6. పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్ర శైల రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో

Paahi Ramaprabho paahi Ramaprabho

Paahi Bhadraadri Vaidehi Raamaprabho

Paahi Ramaprabho


1. Indiraa hrudayaaravindaadhiroodha

Sundaraakaara Aananda Ramaprabho

Endu ney chooda mee sundaraanandamu

kanduno kannulimponda Shyaamaprabho


2. Brundaarakaadi brundaarchitha padaara-

vindamula sandarsithaananda Raamaprabho

Thallivi neevey maa thandrivi neevey

Maa daathavu neevey maa bhraatha Ramaprabho


3. Needu baanambulanu naadu shathrula batti

baadhinpakunnaavademi Ramaprabho

Aadi madhyaantha bahirantharaathmundanuchu

Vaadinthuney Jagannaatha Ramaprabho


4. Sri Raama raamethi sreshtha manthramu saare

saarekunu vinthagaa chaduvu Ramaprabho

Sri Raama nee naama chinthanaamrutha paana

saaramey naadu madi goru Ramaprabho


5. Kaliki roopamu daalchi kali yugambuna neevu

velasithivi Bhadraadri nilaya Ramaprabho

Avyayudavaina ee avathaaramula valana

Divyulainaaru munulayya Ramaprabho


6. Paahi Srirama nee paada padmaasrayula

Paalimpumaa Bhadrasaila Ramaprabho

Paahi Ramaprabho Paahi Ramaprabho

Paahi Bhadraadri Vaidehi Ramaprabho




Thursday, 16 July 2020

Rama Seetha Rama - Bhadrachala Ramadasu Keerthana




Raagam: Janjhooti
Thaalam: Roopaka Thaalam

రామ సీతారామ రఘు రామా జయ రామా
రామా నా మనవి విని ఏమంటివి రామా            

అపరాధిని నెపమెన్నక గృప జూడుము రామా
జపతపము జేసి గతి నెపమెరుగను రామా                 

పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామా
యేపారజ పెనుభూతము నాబాయను రామా            

ఇలసౌఖ్యము అధికంబని యెంచితిరా రామా
కలకాలంబొక రీతిని గడువదు గద రామా                 

సుర వందిత భద్రాచల వరనిలయుడ రామా
కరుణ గలిగి రామదాసుని కరుణించవే రామా 

Rama Seetharama Raghurama Jayarama
Rama naa manavi vini emantivi Rama

Aparaadhini nepamennaka krupa joodumu Rama
Japa thapamu jesi gathi nepameruganu Rama

Papathmuda bahu baadhala paalaithini Rama
Epaayaja penubhoothamu naa baayanu Rama

Ila soukhyamu adhikambani enchithiraa Rama
Kalakaalamboka reethini gaduvadu gada Rama

Sura vanditha Bhadrachala vara nilayuda Rama
Karuna galigi Ramadaasuni karuninchave Rama

Jalra settings: Pitch A#

Style - Basic 5

Count 3

Tuesday, 16 April 2019

Sri Rama nee naamamemi ruchiraa - Bhadrachala Ramadasa keerthana


Raagam: Kharaharapriya
Thaalam: Aadi




) శ్రీరామ నీ నామమేమి రుచిరా
రామ నీ నామమెంత రుచిరా

1)     మధురసముల కంటె దధి ఘృతముల కంటె అతిరసమగు నామమేమి రుచిరా
2)     నవరస పరమాన్న నవనీతముల కంటెనధికమౌ నీ నామమెంత రుచిరా
3)     అంజనా తనయ హృత్కంజ దళములందు రంజిల్లు నీ నామమేమి రుచిరా
4)     సదాశివుడు మది సదా భజించెడి సదానంద నామమెంత రుచిరా
5)     సారము లేని సంసారమునకు సంతారకమగు నామమేమి రుచిరా
6)     శరణన్న జనముల సరగున రక్షించు బిరుదు కల్గిన నామమెంత రుచిరా
7)     కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణుల గాచిన నీ నామమేమి రుచిరా
8)     కదలీ ఖర్జూరాది ఫల రసముల కంటె పతిత పావన నామమెంత రుచిరా
9)     తుంబురు నారదులు డంబు మీరగ గానంబు జేసెడి నామమేమి రుచిరా
10)  అరయ భద్రాచల వర రామదాసుని ప్రేమనేలిన నామమెంత రుచిరా

Pa) Sree Rama nee naamamemi ruchiraa
O Rama nee naamamentha ruchiraa
1)      Madhu rasamula kante dadhi ghruthamula kante athirasamagu naamamemi ruchiraa
2)      Navarasa paramaanna navaneethamula kante nadhikamau nee naamamentha ruchiraa
3)      Anjanaa thanaya hruthkanja dalamunandu ranjillu nee naamamemi ruchiraa
4)      Sadaa Sivudu madi sadaa bhajinchedi sadaananda naamamentha ruchiraa
5)      Saaramu leni samsaaramunaku santhaarakamagu naamamemi ruchiraa
6)      Sarananna janamula saraguna rakshinchu birudu kalgina naamamentha ruchiraa
7)      Kariraja Prahlada Dharanija Vibheeshanula gaachina nee naamamemi ruchiraa
8)      Kadalee karjooraadi phala rasamula kante pathitha paavana naamamentha ruchiraa
9)      Thumburu Naaradulu dambu meeraga gaanambu chesedi naamamemi ruchiraa
10)  Araya Bharachala Vara Raama daasuni premanelina naamamentha ruchiraa

Image result for bhadrachala ramadasu

Wednesday, 27 January 2016

Ramachandraya - Bhadrachala Ramadasu Keerthana


Raagam: Navaroj

Thaalam: Tisra Eka


రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం

కోసలేశాయ మందహాస దాస పోషణాయ
వాసవాది వినుత సర్వదాయ మంగళం

చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం

లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలద సదృశ దేహాయ చారు మంగళం

దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజా గురువరాయ భవ్య మంగళం

పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ
అండజ వాహనాయ అతుల మంగళం

విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ సుభద మంగళం

రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం

rAma candrAya janaka rAjajA manOharAya mAmakAbhIshTadAya mahita mangaLam

kOsalESAya mandahAsa dAsa pOshaNAya vAsavAdi vinuta sarvadAya mangaLam

cAru mEgha rUpAya candanAdi carcitAya hAra kaTaka SObhitAya bhUri mangaLam

lalita ratna kunDalAya tulasI vana mAlikAya jalada sadruSa dEhAya cAru mangaLam

dEvakI suputrAya dEvadEvOttamAya bhAvajA guruvarAya bhavya mangaLam

punDarIkAkshAya pUrNachandra vadanAya anDajA vAhanAya atula mangaLam

vimala rUpAya vividha vEdAnta vEdyAya sumukha chitta kAmitAya subhada mangaLam

rAma dAsAya mrudula hRdaya kamala vAsAya swAmi bhadragirivarAya sarva mangaLam

Ramachandraaya Janaka raajajaa manoharaaya maamakaabheeshtadaaya mahitha mangalam 

Kosalesaaya mandahaasa daasa poshanaaya
vaasavaadi vinutha sarvadaaya mangalam 

Chaaru megha roopaaya chandanaadi charchithaaya
haara kataka sobhithaaya bhoori mangalam

Lalitha rathna kundalaaya thulasee vana maalikaaya
jalada sadrusa dehaaya chaaru mangalam

Devakee suputhraaya devadevotthamaaya
bhaavajaa guruvaraaya bhavya mangalam

Pundareekaakshaaya poornachandra vadanaaya
andaja vaahanaaya athula mangalam

Vimala roopaaya vividha vedaantha vedyaaya
 sumukha chitta kaamithaaya subhada mangalam

Ramadaasaaya mrudula hridaya kamala vaasaaya
swaami bhadragirivaraaya sarva mangalam