Monday, 17 January 2022

Seetha Rama Swamy - Bhadrachala Ramadasu Keerthana

సీతారామస్వామి నే జేసిన నేరంబేమి

ఖ్యాతిగ నీ పదపంకజ యుగళము ప్రీతిగ దలపక భేదమెంచితినా


రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా

ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా
కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా
మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని

తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా
పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా
స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా

ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా
దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా
విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా
ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా

No comments:

Post a Comment