Showing posts with label Kaivara Amara Nareyana. Show all posts
Showing posts with label Kaivara Amara Nareyana. Show all posts

Monday, 4 October 2021

Bhakthi nilipi - Kaivara Amara Nareyana Thathwam




ప) భక్తి నిలిపి పరమాత్ముని చేరే భావము గనవలెరా విరక్తి పురుషుడై పగతులనందరి పట్టి అణచవలెరా 1) బిసబిస తిరిగే వాయువు నిలిపే వీలు తెలియవలెరా వాయువు తిరిగే మార్గములన్నియు బంధించగవలెరా 2) మూడు అండములు మృదువుగా ఉన్నవి మూలమెరుగవలెరా అండములో బ్రహ్మాండంబుల సుషుమ్నాంగము గనవలెరా 3) శాస్త్ర శోధకులు ఎన్ని నేర్చినా మార్గము తెలియదురా దేహ శోధకము సాధకమెరిగిన యోధకు తెలుసునురా 4) ఇహ జాలంబులు అంటీ అంటక యుక్తినొందవలెరా మాయా మయమగు మాయను గెలిచే మర్మము కనవలెరా 5) నిద్ర సమాధిలో మరువక తెలివిగా నిద్ర సేయవలెరా సంతసముగా శ్రీసద్గురు ఉన్నది ఉనికి తెలియవలెరా 6) ఎప్పుడు శ్రీహరి ధ్యానము మరువక ముక్తుడు కావలెరా అమర నారేయణ ఆదిగురునిలో ఐక్యము గావలెరా


Pa) Bhakthi nilipi paramaathmunu cherey
bhaavamu kanavaleraa - vi
rakthi purushudai pagathulanandari
patti anachavaleraa

1) Bisabisa thirigey vaayuvu nilipey
veelu theliyavaleraa
Vaayuvu thirigey maargamulanniyu bandhimpagavaleraa

2) Moodu andamulu mruduvuga unnavi
moolamerugavaleraa
Andamulo brahmaandambula sushumnaangamu kanavaleraa

3) Saasthra sodhakulu enni nerchinaa
maargamu theliyaduraa
Deha sodhakamu saadhakamerigina
yodhaku thelusunuraa
 
4) Iha jaalambulu antee antaka
yukthinondavaleraa
Maayaamayamagu maayanu gelichey
Marmamu kanavaleraa

5) Nidra samaadhilo maruvaka theliviga
nidra seyavaleraa
Santhasamuga Sri Sadguru unnadi
uniki theliyavaleraa

6) Epudoo Srihari dhyaanamu maruvaka
mukthudu kaavaleraa
Amara Nareyana Aadigurunilo
aikyamu kaavaleraa
 



Tuesday, 25 August 2020

Sri Krishnaayanu - Kaivara Amara Nareyana

Lyrics: Sri Kaivara Amara Nareyana 

Music: Sri Mangalampalli Bala Murali Krishna


Sri Krishnaayanu naama manthra ruchi siddhinchuta naakennatiko

Sri guru paadaabjambulu madilo sthiramuga nilachedennatiko


1) Maruvaka Madhavu mahimalu pogadey marmamu thelisedennatiko

Hari Hari Hariyanu  naamaamrutha paanamu chesedennatiko


2) Kamalaakshuni naa kannulu challaga kani sevinchedennatiko

Lakshanamuga Sri Lakshmi ramanuni bhakthudanayyedennatiko


3) Panchaakshari manthramu madilo pathiyinchuta inkennatiko

Aadimurthy Sri Amara Nareyana daasudanayyedennatiko

శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో

శ్రీ గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగ నిలచేదెన్నటికో


1) మరువక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో

హరి హరి హరియను హరి నామామృత పానము చేసేదెన్నటికో


2) కమలాక్షుని నా కన్నులు చల్లగ కని సేవించేదెన్నటికో

లక్షణముగ శ్రీ లక్ష్మీ రమణుని భక్తుడనయ్యేదెన్నటికో


3) పంచాక్షరీ మంత్రము మదిలో పఠియించుట ఇంకెన్నటికో

ఆదిమూర్తి శ్రీ అమర నారేయణ దాసుడనయ్యేదెన్నటికో




Tuesday, 16 April 2019

Sri Rama nee naamamu jihvaku - Kaivara Amara Nareyana Keerthana


Raagam: Folk
Thaalam: Aadi

{. ... . - . ... . - . ... . - రి. . ని...
. రి.. రి. - . రి.. రి. - ని. రి.. . - . రి. ...}

) శ్రీరామా నీ నామము జిహ్వకు రుచిగా ఉన్నది
ఎప్పుడూ ఎవ్వేళా మనసు మరువకున్నది

1) మోహాపాశమనే మొలక తెంచుమన్నది
కక్ష కామ క్రోధాదులను తుంచి కొట్టుమన్నది

2) పామరులతోను పొందు పాపమన్నది
సజ్జనులతోను బాగు సౌఖ్యమన్నది

3) సుజ్ఞానులను ఎరుగ చాలా సులభమన్నది
నారేయణ స్వామి గురుని నమ్ముమన్నది

{sa ga ma ga sa ga ma ga sa ga ma ga ri sa nI


pa ri ma ri pa ri ma ri ni ri pa ma ga ri sA}


Pa) Sri Rama nee naamamu jihvAku ruchigaa vunnadi

Eppudoo evvela manasu maruvakunnadi


1) Mohaapaasamaney molaka thenchumannadi

kaksha kaama krodhaadulanu thunchi kottuamannadi


2) Paamarulathonu pondu paapamannadi

sajjanulathonu baagu saukhyamannadi


3) Sujnaanulanu eruga chaalaa sulabhamauu  nnadi

Nareyana Swamy guruni nammumannadi


Related image