Monday 4 October 2021

Bhakthi nilipi - Kaivara Amara Nareyana Thathwam




ప) భక్తి నిలిపి పరమాత్ముని చేరే భావము గనవలెరా విరక్తి పురుషుడై పగతులనందరి పట్టి అణచవలెరా 1) బిసబిస తిరిగే వాయువు నిలిపే వీలు తెలియవలెరా వాయువు తిరిగే మార్గములన్నియు బంధించగవలెరా 2) మూడు అండములు మృదువుగా ఉన్నవి మూలమెరుగవలెరా అండములో బ్రహ్మాండంబుల సుషుమ్నాంగము గనవలెరా 3) శాస్త్ర శోధకులు ఎన్ని నేర్చినా మార్గము తెలియదురా దేహ శోధకము సాధకమెరిగిన యోధకు తెలుసునురా 4) ఇహ జాలంబులు అంటీ అంటక యుక్తినొందవలెరా మాయా మయమగు మాయను గెలిచే మర్మము కనవలెరా 5) నిద్ర సమాధిలో మరువక తెలివిగా నిద్ర సేయవలెరా సంతసముగా శ్రీసద్గురు ఉన్నది ఉనికి తెలియవలెరా 6) ఎప్పుడు శ్రీహరి ధ్యానము మరువక ముక్తుడు కావలెరా అమర నారేయణ ఆదిగురునిలో ఐక్యము గావలెరా


Pa) Bhakthi nilipi paramaathmunu cherey
bhaavamu kanavaleraa - vi
rakthi purushudai pagathulanandari
patti anachavaleraa

1) Bisabisa thirigey vaayuvu nilipey
veelu theliyavaleraa
Vaayuvu thirigey maargamulanniyu bandhimpagavaleraa

2) Moodu andamulu mruduvuga unnavi
moolamerugavaleraa
Andamulo brahmaandambula sushumnaangamu kanavaleraa

3) Saasthra sodhakulu enni nerchinaa
maargamu theliyaduraa
Deha sodhakamu saadhakamerigina
yodhaku thelusunuraa
 
4) Iha jaalambulu antee antaka
yukthinondavaleraa
Maayaamayamagu maayanu gelichey
Marmamu kanavaleraa

5) Nidra samaadhilo maruvaka theliviga
nidra seyavaleraa
Santhasamuga Sri Sadguru unnadi
uniki theliyavaleraa

6) Epudoo Srihari dhyaanamu maruvaka
mukthudu kaavaleraa
Amara Nareyana Aadigurunilo
aikyamu kaavaleraa
 



No comments:

Post a Comment