Showing posts with label Raaga Lakshanas. Show all posts
Showing posts with label Raaga Lakshanas. Show all posts

Monday, 18 May 2026

Characteristics of Sankarabharanam Raaga - శంకరాభరణ రాగ లక్షణములు

 ఇది 29వ మేళకర్త రాగము. కటపయాది సంఖ్యలో ఇముడ్చుటకు ఈ రాగమునకు ముందు “ధీర” అను పదము చేర్చబడి “ధీరశంకరాభరణము” అయినది.

ఇది “బాణ” అను 5వ చక్రములోని 5వ రాగము.

ఆరోహణ సరిగమపదనిస.

అవరోహణ సనిదపమగరిస

శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము

లక్షణములు: సంపూర్ణ రాగము. అన్ని స్వరములూ రాగచ్ఛాయాస్వరములు. ససరిరిగగమమ అను జంటలును, పదనిపద, మపగమరి అను దాటువులును ప్రసిద్ధ అలంకారములు. చాలా వ్యాప్తిలోగల రాగము. ఎల్లప్పుడూ పాడదగిన రాగము. శ్లోకములు, పద్యములు పాడవచ్చును. రాగాలాపన విస్తృతముగా చేయుటకు తగిన రాగము. అన్ని రకములైన రచనలు చేయుటకు రచింపబడిన రాగము. చాలా జన్యరాగ సంతతిగల జనకరాగము. సంగీతరత్నాకరమునందు చెప్పబడిన రాగము. హిందుస్తానీ సంగీతములో ఈ రాగమునకు “బిలావల్” అని పేరు. షడ్జము, మధ్యమము, పంచమములలో రచనలు ప్రారంభించబడును. సదపమగరిస అనునది రంజక ప్రయోగము.

రచనలు:

గీతము: గోవిందాచ్యుత - మఠ్యతాళము - పురంధరదాసు

వర్ణము: సామినిన్నే - ఆదితాళము - వీణ కుప్పయ్యర్

కృతి:

స్వరరాగసుధ - ఆదితాళం - త్యాగరాజు

సరోజదళనేత్రి - ఆదితాళం - శ్యామశాస్త్రి

మనసు స్వాధీనమైన - చాపుతాళం - త్యాగరాజు

ఎందుకు పెద్దలవలె - ఆదితాళం - త్యాగరాజు

కీర్తన:

అలరులు కురియగ - ఆదితాళం - అన్నమయ్య


Characteristics of Naatakuranji Raaga - నాటకురంజి రాగ లక్షణములు

 ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగజన్యము.

ఆరోహణ సరిగమనిదనిపదనిస.

అవరోహణ స.నిదమగమపగరిస


శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: పంచమము అరుదైన స్వరమైనప్పటికీ, నిదనిపదనిస., సరిగమపగరిస అను సంచారములలో వచ్చును. వక్ర సంపూర్ణ రాగము. నిదనిపదనిస. ప్రయోగము కొత్త శోభనిచ్చును. ఉపాంగరాగము. గాంధార, మధ్యమ, దైవత, నిషాదములు రాగఛ్చాయాస్వరములు. గమకవరికరక్తిరాగము. ప్రత్యాహత గమకములు ఈ రాగమునకు అలంకారములు. సాయంకాలములో పాడదగు రాగము.

రచనలు:

వర్ణము: చలమేల - ఆదితాళము - మారైపట్టం రంగస్వామి

కృతి:

పరాతీత సరస్వతి - రూపకతాళం - తిరుపతి నారాయణస్వామి

మనసు విషయనట - ఆదితాళం - త్యాగరాజు

నవగ్రహ కీర్తన:

బుధమాశ్రయామి - ఝంపెతాళం - దీక్షితార్


Characteristics of Darbar Raaga - దర్బార్ రాగ లక్షణములు

 ఇది 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ రాగజన్యము.

ఆరోహణ సరిమపదనిస.

అవరోహణ సనిదపమరిగాగారిస

శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: ఇది షాడవ వక్ర సంపూర్ణ రాగము. దీర్ఘగాంధారము ఈ రాగమునకు అత్యంత శోభనిచ్చును. గాంధార నిషాదములు రాగచ్చాయా స్వరములు. గమకవరికరక్తిరాగము. ఉపాంగ రాగము, ఎల్లప్పుడూ పాడదగిన రాగము.

సంచారము: మపదనిస.పా - దనిపామదపమరీ - గారిసరిపమపా - దపమపదనిసా - రిపమరిగారిసా - నిరిసనిసదాప - మపదనిపా - మదపమగరీ - గారిసా

రచనలు:

వర్ణము: చలమేల - ఆదితాళం - వీణ కుప్పయ్యర్

కృతి: యోచన - ఆదితాళం - త్యాగరాజు

ముందువెనుక - చాపుతాళం - త్యాగరాజు

అపరాధముల మాన్పి - ఖండచాపు - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్


Characteristics of Hamsadhwani Raaga - హంసధ్వని రాగ లక్షణములు

 ఇది 29వ మేళకర్త అయిన ధీరశంకరాభరణ రాగజన్యము.

ఆరోహణ సరిగపనిస.

అవరోహణ స.నిపగరిస

శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, పంచమము, కాకలి నిషాదము

లక్షణములు: ఔడవ రాగము, ఉపాంగరాగము, మధ్యమ దైవతములు ఈ రాగములో వర్జ్యములు. ఈ రాగమును రామస్వామిదీక్షితులు కనిపెట్టిరి. గాంధార నిషాదములు జీవస్వరములు. నిగ.రి. స. - నిరి.స.ని - పస.నిప - గనిపగారి - పగరిస - రిపగరిసా అను దాటువులు ప్రసిద్ధ అలంకారములు. అన్నివేళలా పాడదగిన రాగము. సభారంభమున పాడదగిన రాగము.

సంచారము: గపనిసా - పనిస.రి.గ.రి. - గ.ప.గ.రి.సా. - నిస.రీ.స.నిప - గపనిస.నీప - గనిపగారి - సరిగపనిసా. - పనీగపారిగా - సరిగపగారిసా - .ని.పసా

రచనలు:

వర్ణము: జలజాక్షి - ఆదితాళం - వెంకట సుబ్బయ్యగారు

కృతులు:

రఘునాయక - ఆదితాళం - త్యాగరాజు

శ్రీ రఘుకుల - ఆదితాళం - త్యాగరాజు

వాతాపిగణపతిం - ఆదితాళం - దీక్షితార్

కీర్తన: గజవదనా - ఆదితాళం - పురంధరదాసు

Characteristics of Vasantha Raaga - వసంతరాగ లక్షణములు

 ఇది 17వ మేళకర్త అయిన సూర్యకాంత రాగజన్యము.

ఆరోహణ సగమదనిస.

అవరోహణ స.నిదమగరిస


శృతులు: షడ్జము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము

లక్షణములు: ఔడవ షాడవ రాగము, వర్జ్యరాగము. ఆరోహణలో రిషభ పంచమములు వర్జ్యములు. అవరోహణలో పంచమము మాత్రం వర్జ్యము. గాంధార మధ్యమ దైవతములు రాగచ్ఛాయా స్వరములు. గమకవరిక రక్తిరాగము. ప్రసిద్ధ రాగము. దేశీయరాగము. ఎల్లప్పుడూ పాడదగిన రాగము. సాయంసమయమున పాడుట సమంజసము. కర్ణాటకసంగీతములో లలితరాగమునకు దీనికి దగ్గర పోలిక కలదు. పంచమ వర్జ్య రాగములలో ఇది ఒకానొక ప్రముఖ రాగము. స.గ.రి.స.నిద - దస.నిదమగ - గదమగరిస వంటి దాటువులు ప్రసిద్ధములు.

సంచారము: స.నిదమగా - మగరిసా - .నిస.నిస మామ - గమదా - దనిస.రి.సా. - స.గ.రి.స.నిదా - దనిస.నిదమా - మదనిదమగా - మాగరిసా - .ద.నిసా

రచనలు:

వర్ణం: నిన్నుకోరి - ఆదితాళం - వీణ కుప్పయ్యర్

కృతులు:

సీతమ్మ మాయమ్మ - రూపకతాళం - త్యాగరాజు

రామచంద్ర భావయామి - రూపకతాళం - దీక్షితార్

అష్టపది: లలిత లవంగ - ఆదితాళం - జయదేవుడు

Characteristics of Sri Raagam - శ్రీరాగ లక్షణములు

 ఇది 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ రాగజన్యము.

ఆరోహణ సరిమపనిస.

అవరోహణ స.నిపదనిపమరిగరిస


శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: ఔడవ వక్ర సంపూర్ణ రాగము. ఆరోహణమునకు గాంధారదైవతములు వర్జ్యములు. ఘనరాగపంచకములో ఐదవ రాగము. పూర్వ ప్రసిద్ధ మేళములలో ఒకటి. దీనిని ప్రాచీనులు మేళకర్తగా తీసుకొనిరి. అల్పదైవతమును ఉపయోగించు రాగము. అనగా, ఈ రాగములో దైవతము చాలా తక్కువగా ఉపయోగించబడును. వెంకటమఖి సంప్రదాయములో దీనిని 22వ మేళకర్తగా తీసుకొనిరి. ఉపాంగరాగము. రిషభ, గాంధార, నిషాదములు రాగచ్ఛాయాస్వరములు. మంగళకరమైన రాగము. మిట్టమధ్యాహ్నము పాడుటకు తగిన రాగము. కానీ ఎల్లవేళల పాడుటకు తగినది. రిపమనిపస.నిరి. - స.రి.నిస.పనిమప అను దాటువులు ప్రసిద్ధములు. రిగరిస - పదనిపమ అనునవి రంజక ప్రయోగములు.ఈ రాగమును మధ్యమావతి బదులుగా గానసభానంతరము పాడుట కలదు. అన్ని దోషములు పారద్రోలుటకై పాడబడును.

సంచారము: పనిసా.నిపా - మపనిపమరీ - రిగరిసా - .నిసరిమపా - మపనీ - పనిస.నిసా - నిస.రి.గ.రి.సా. - నిరి.స.నిపా - రి.స.నిస.నిపా - పదనిపమరీగరిసా

రచనలు:

వర్ణము: సామినిన్నే - ఆదితాళం - కరూర్ దేవుడు అయ్యర్

గీతము: మీనాక్షి జయ కామాక్షి - ధ్రువతాళము - పైడాల గురుమూర్తిశాస్త్రి

కృతి: శ్రీవరలక్ష్మీ నమోస్తుతే - రూపకతాళం - దీక్షితార్

పంచరత్నకీర్తన: ఎందరో మహానుభావులు - ఆదితాళం - త్యాగరాజు

Characteristics of Sri Ranjani Raaga - శ్రీరంజని రాగ లక్షణములు

 ఇది 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ రాగజన్యము.

ఆరోహణ సరిగమదనిస.

అవరోహణ స.నిదమగరిస


శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధమధ్యమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: షాడవ రాగము. ఉపాంగ రాగము. ఆరోహణ అవరోహణములయందు పంచమము వర్జ్యస్వరము. కరుణరస ప్రధానమైన రాగము. కర్ణాటకసంగీతమున గల అనేక ముఖ్య రాగములలో ఇది ఒకటి. ప్రాచీనరాగము. సాధారణంగా మధ్యమ నిషాదములతో రచనలు ప్రారంభించబడును.

సంచారము: గమదా - మదనీసా. - దనిస.రి.గ.రి.స.నిద - మదనిస.నిద - మనిదమ - దమగరిగా - రిగమదనీస.నీదమాగరి - మగరిసా - .ద.నీసా


రచనలు:

కృతులు: మారుపల్కకున్నావేమిరా - ఆదితాళం - త్యాగరాజు

భువిని దాసుడనే - ఆదితాళం - త్యాగరాజు

సొగసుగా మృదంగతాళము - రూపకతాళం - త్యాగరాజు

లక్షణగీతము: అరెరే జయజయ - త్రిపుటతాళం - గోవిందాచార్య

Characteristics of Hindola Raaga - హిందోళరాగ లక్షణములు

 ఇది 20వ మేళకర్త అయిన నఠభైరవి రాగజన్యము.

ఆరోహణ సగమదనిస.

అవరోహణ స.నిదమగస

శృతులు: షడ్జము, సాధారణ గాంధారము, శుద్ధమధ్యమము, శుద్ధ దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: ఔడవ రాగము, ఉపాంగ రాగము. ఆరోహణ అవరోహణములు రెండింటిలోను రిషభ పంచమములు వర్జ్యములు. మధ్యాహ్న సమయమందు గానము చేయుట తగును. మధ్యమము, దైవతము, నిషాదము రాగచ్చాయాస్వరములు.

సమగమ - గమనిద - మదనిస. - స.నిదమగస అనునవి రంజకమైన ప్రయోగములు. కొన్ని ప్రాచీన లక్షణ గ్రంథములలో ఈ రాగము 22వ మేళకర్త ఖరహరప్రియ రాగజన్యముగా చెప్పియున్నందువలన కొందరు సుప్రద్ధ సంగీత విద్వాంసులు చతుశృతి దైవతమును వాడుచున్నారు. సగసమగ - మదనిద - స.నిగ.స. అను దాటువులు, గగమమదదనిని అను జంటలు, స.ని నిద దమ మగ గస అను ప్రత్యాహత గమకాలు ఈ రాగములో ప్రసిద్ధములు.

సంచారము: గమనీద - దనీస. - నిస.మ.గ.స. - నిగ.స.నిద - మదనిసా. - నిదమ - గమనిదమగ - మగసా - .ద.నీ.సా

రచనలు:

కృతులు: సామజవరగమనా - ఆదితాళం - త్యాగరాజు

మనసులోని మర్మమును - ఆదితాళం - త్యాగరాజు

నీరజాక్షి కామాక్షి - రూపకతాళం - దీక్షితార్

కీర్తన: కొండలలో నెలకొన్న - ఆదితాళం - అన్నమయ్య

Thursday, 23 April 2026

Characteristics of Mayamalavagowla Raaga - మాయామాళవగౌళ రాగ లక్షణములు

  • ఈ రాగము అగ్ని అను 3వ చక్రములోని 3వ రాగము. 15వ మేళకర్త రాగము.


    ఆరోహణ సరిగమపదనిస.

    అవరోహణ సనిదపమగరిస


    శృతులు: షడ్జము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము

    లక్షణములు: సంపూర్ణ రాగము, సప్తస్వర గమక వరిక రక్తి రాగము. అనురాగ గుణమును, హాయినిచ్చు రాగము. ఉత్తమోత్తమ రాగము. సంగీతకళకు పునాది రాగము. అన్నివేళల పాడదగిన రాగము. కర్ణాటక సంగీతము నేర్చుకొనువారు ముందుగా ఈ రాగములో సరళీ, జంట, అలంకారములు నేర్చుకుందురు. గాంధార పంచమములు విశ్రాంతి స్వరములు. దోషరహిత రాగము.

    షడ్జ, గాంధార, నిషాద, దైవతములపై రచనలు ప్రారంభించబడును. సంగీతరత్నాకరమునందు పేర్కొనబడిన రాగము. హిందుస్థానీ సంగీతంలో ఈ రాగమును పోలిన రాగము “భైరవ్” రాగము. పూర్వము దీనికి “మాళవగౌళ” అని పేరు. 15వ మేళకర్తగా చేయుటకు ఈ పేరునకు ముందు “మాయా” అన్న పదము చేర్చిరి. అచల స్వరములు, కంపిత స్వరములు కలిగిన రాగము. నెమ్మదిగాను, తీవ్రముగాను కూడా జంట, దాటు స్వరములు పాడవచ్చును. షడ్జమునకు రిషభము, గాంధారమునకు మధ్యమము, పంచమమునకు దైవతము, నిషాదమునకు తారషడ్జమును దాసిన స్వరములు (అనుసరించిన) కావున సరళీస్వరములు ఈ రాగములో సాధన చేయుటకు అనువైన రాగము. ఈ రాగమునందు అన్ని స్వరములు గమకంతో పాడినను పూర్ణకంపితమునకు ఇచ్చట అవకాశం లేదు. మధ్యమమున ఎక్కువగా న్యాసము (ముగింపు) మనోధర్మముచేత కనిపించుటకు తగిన జంట, దాటు, ఆహత, ప్రత్యాహత ప్రయోగములన్నింటికి వీలైన రాగము.

    త్రిస్థాయి రాగము: అన్ని స్వరములు జీవస్వరములని చెప్పినప్పటికినీ, రిషభ దైవతములు ముఖ్య జీవస్వరములు. కేవలము స్వరప్రస్థాన రాగము. ఈ రాగమును ఆలపించుటకు వీలైనను భావము సంగ్రహముగా కనిపించుచున్నది. శుభప్రదమైన రాగము. కానీ, మధ్యమకాలములో పాడినా మిక్కిలి రంజకముగా ఉండును. ఈ రాగము ద్విస్వర మూర్ఛనాకారక మేళము. రిషభమును గ్రహభేదము చేసినచో, మధ్యమము వచ్చును. నాదనామక్రియ, లలిత, ఫరజు, సావేరి, మలహరి మున్నగునవి ఈ రాగ జన్యములు.

    సంచారము: దపమపదప - పమగ - మగరిస - సరిమప - గమపదనిస. - స.నిగ.రి.స.నిదా - స.రి.నీ - స.నిదపమా - గమపదపమగా - పమగరీ - మగరిసా

    రచనలు:

    సరళీస్వరములు, జంటస్వరములు, దాటుస్వరములు, అలంకారములు

    వీటిని రచించినవారు పురంధరదాసు

    కృతులు: మాయాతీత స్వరూపిణి - రూపకతాళం - పున్నయ్యపిళ్ళై

    తులసీదళములచే - ఆదితాళం - త్యాగరాజస్వామి

    త్రినాథాది - రూపకతాళం - ముత్తుస్వామి దీక్షితార్

    మేరుసమాన - ఆదితాళం - త్యాగరాజస్వామి


  • ఈ రాగము అగ్ని అను 3వ చక్రములోని 3వ రాగము. 15వ మేళకర్త రాగము.

ఆరోహణ సరిగమపదనిస.

అవరోహణ స.నిదపమగరిస

  • శృతులు: షడ్జము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము
  • లక్షణములు:
    • సంపూర్ణ రాగము, సప్తస్వర గమక వరిక రక్తి రాగము.
    • అనురాగ గుణమును, హాయినిచ్చు రాగము. ఉత్తమోత్తమ రాగము.
    • సంగీతకళకు పునాది రాగము. కర్ణాటక సంగీతము నేర్చుకొనువారు ముందుగా ఈ రాగములో సరళీ, జంట, అలంకారములు నేర్చుకుందురు.
    • అన్నివేళల పాడదగిన రాగము.
    • గాంధార పంచమములు విశ్రాంతి స్వరములు.
    • దోషరహిత రాగము.
    • షడ్జ, గాంధార, నిషాద, దైవతములపై రచనలు ప్రారంభించబడును.
    • సంగీతరత్నాకరమునందు పేర్కొనబడిన రాగము.
    • హిందుస్థానీ సంగీతంలో ఈ రాగమును పోలిన రాగము “భైరవ్” రాగము.
    • పూర్వము దీనికి “మాళవగౌళ” అని పేరు. 15వ మేళకర్తగా చేయుటకు ఈ పేరునకు ముందు “మాయా” అన్న పదము చేర్చిరి.
    • అచల స్వరములు, కంపిత స్వరములు కలిగిన రాగము.
    • నెమ్మదిగాను, తీవ్రముగాను కూడా జంట, దాటు స్వరములు పాడవచ్చును.
    • షడ్జమునకు రిషభము, గాంధారమునకు మధ్యమము, పంచమమునకు దైవతము, నిషాదమునకు తారషడ్జమును దాసిన స్వరములు (అనుసరించిన) కావున సరళీస్వరములు ఈ రాగములో సాధన చేయుటకు అనువైన రాగము.
    • ఈ రాగమునందు అన్ని స్వరములు గమకంతో పాడినను పూర్ణకంపితమునకు ఇచ్చట అవకాశం లేదు.
    • మధ్యమమున ఎక్కువగా న్యాసము (ముగింపు) మనోధర్మముచేత కనిపించుటకు తగిన రాగము.
    • జంట, దాటు, ఆహత, ప్రత్యాహత ప్రయోగములన్నింటికి వీలైన రాగము.
    • త్రిస్థాయి రాగము.
    • అన్ని స్వరములు జీవస్వరములని చెప్పినప్పటికినీ, రిషభ దైవతములు ముఖ్య జీవస్వరములు.
    • శుభప్రదమైన రాగము.
    • మధ్యమకాలములో పాడినా మిక్కిలి రంజకముగా ఉండును.
    • ఈ రాగము ద్విస్వర మూర్ఛనాకారక మేళము.
    • రిషభమును గ్రహభేదము చేసినచో, మధ్యమము వచ్చును.
    • నాదనామక్రియ, లలిత, ఫరజు, సావేరి, మలహరి మున్నగునవి ఈ రాగ జన్యములు.
  • సంచారము: దపమపదప - పమగ - మగరిస - సరిమప - గమపదనిస. - స.నిగ.రి.స.నిదా - స.రి.నీ - స.నిదపమా - గమపదపమగా - పమగరీ - మగరిసా
  • రచనలు:
    • సరళీస్వరములు, జంటస్వరములు, దాటుస్వరములు, అలంకారములు - పురంధరదాసు
    • కృతులు:
      • మాయాతీత స్వరూపిణి - రూపకతాళం - పున్నయ్యపిళ్ళై
      • తులసీదళములచే - ఆదితాళం - త్యాగరాజస్వామి
      • త్రినాథాది - రూపకతాళం - ముత్తుస్వామి దీక్షితార్
      • మేరుసమాన - ఆదితాళం - త్యాగరాజస్వామి



  • This raga is the 3rd raga in the 3rd chakra called Agni. It is the 15th Melakarta raga.

Aarohana: Sa Ri Ga Ma Pa Da Ni Sa.

 

Avarohana: Sa. Ni Da Pa Ma Ga Ri Sa

  • Sruthis: Shadjam, Shuddha Rishabham, Antara Gandharam, Shuddha Madhyamam, Panchamam, Shuddha Daivatam, Kakali Nishadham
  • Characteristics:
    • A sampoorna raaga, It's called a Saptha swara gamaka varika rakthi raaga.
    • It embellishes hearts. An excellent raaga.
    • This raaga is the foundation of music. Those who learn Carnatic music first learn the basic exercises, Sarali Swaras, Janta Swaras and Alankaras in this raaga.
    • A raaga that can be sung at all times.
    • Gandhara and Panchama are resting notes.
    • A flawless raga.
    • Compositions in this raaga begin with Shadja, Gandhara, Nishada, and Daivata.
    • This raaga has been mentioned in Sangeetha Rathnakaram.
    • Hindustani counterpart to this raaga is 'Bhairav'.
    • This raga was previously called 'Malavagowla'. 'Maya' was added as prefix in order to fit it into Melakartha chart.
    • This raaga has achala swaras and kampitha swaras.
    • Janta swaras and Daatu Swaras can be sung slowly as well as fiercely.
    • Rishabham follows Shadjam, Madhyamam follows Gandharam, Daivatham follows Panchamam, Thara Shadjam follows Nishadam. So it is an ideal raaga to practice Sarali Swaras.
    • All swaras in this raaga are sung with gamakam, yet there is no scope for poorna kampitham.
    • Conclusion of Manodharmam can be done mostly at Madhyamam.
    • A raaga that has chance for Janta, Daatu, Aahatha, Prathyaahatha exercises.
    • A Thristhaayi raaga.
    • All swaras are said to be Jeeva Swaras, but Rishabham and Daivatham are the main jeeva swaras.
    • An auspicious raaga.
    • It is enjoyable even when sung at medium speed.
    • It is a two-note moorchana mela raaga.
    • On doing grahabhedam, Rishabham can become Madhyamam.
    • Nadanamakriya, Lalitha, Faraju, Saveri, Malahari, etc. are derivatives of this raaga.
  • Sancharam: DPMPDP - PMG - MGRS - SRMP - GMPDNS. - S.NG.R.S.ND, - S.R.N, - S.NDPM, - GMPDPMG, - PMGR, - MGRS,
  • Compositions:
    • Sarali Swaras, Janta Swaras, Daatu Swaras, Alankarams - Purandharadasa
    • Kruthis:
      • Mayatheetha Swaroopini - Roopaka Thaalam - Punnaiah Pillai
      • Tulasi Dalamulachey - Aadi Thaalam - Thyagaraja
      • Trinathaadi - Roopaka Thaalam - Muthuswamy Dikshitar
      • Meru samaana - Aadi Thaalam - Thyagaraja

Characteristics of Naata Raaga - నాటరాగ లక్షణములు

  • చలనాట అను 36వ మేళకర్త రాగజన్యము.
            ఆరోహణ సరిగమపదనిస.
            అవరోహణ స.నిపమరిస
  • శృతులు: షడ్జము, షట్శృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, షట్శృతి దైవతము, కాకలి నిషాదము
  • లక్షణములు:
    • సంపూర్ణ రాగము, ఔడవ రాగము, ఉపాంగ రాగము, వర్జ్య రాగము, ఘన రాగము.
    • రిషభ, మధ్యమ, నిషాదములు రాగచ్ఛాయ స్వరములు.
    • సభారంభమున పాడదగు రాగము.
    • వేంకటమఖి దీనిని 36వ రాగాంగ రాగముగా తీసుకొనిరి.
    • సాయంసమయమున పాడదగిన రాగము. అన్నివేళల పాడదగిన రాగము.
    • సంగీతరత్నాకరము, సంగీతమకరందము, సంగీతసమయసారము, చతుర్దండిప్రకాశికలో చెప్పబడినది.
  • సంచారము: గమపనిపా - స.నిపా - .నిసరిసరీ - గమపమరీసా - స.నిపనిసా. - నిస.నిపా - మగమపామ - గమపనిసా. - నిస.నిపా - మగమపామ - గమపని సా.నిపమ - గమపమ - గమరి - సరిస.నిస 
  • రచనలు:
    • గీతము: హరిహరనుత - చతురశ్రజాతి ఏకతాళం - పురంధరదాసు
    • వర్ణము:
      • సామి నిన్నే కోరి - ఆదితాళం
      • సుముఖము - అటతాళం - వడివేలుపిళ్ళై
    • కృతి:
      • మహాగణపతిం - చతురశ్రజాతి ఏకతాళం - ముత్తుస్వామిదీక్షితార్
      • స్వామినాథ పరిపాలియాశుమాం - ఆదితాళం - ముత్తుస్వామిదీక్షితార్
    • పంచరత్నకీర్తన: జగదానందకారక - ఆదితాళం - త్యాగరాజు

  • It is the janya raaga of the 36th Melakartha 'Chalanaata'.
  • Aarohana SRGMPDNS.

    Avarohana S.NPMRS

    • Sruthis: Shadjam, Shatsruthi Rishabham, Anthara Gandharam, Suddha Madhyamam, Panchamam, Shatsruthi Daivatham, Kaakali nishadam
    • Characteristics:

      • It's a Sampoorna - Oudava raaga.
      • An Upaanga raaga (Has swaras that are in its parent raaga)
      • A varjya raaga (Missing some swaras)
      • A ghana raaga
      • Ragacchaya swaras are Rishabham, Madhyamam, Nishadam
      • It's a raga that can be sung in the beginning of the concert.
      • Venkata Makhi considered it as the 36th raaganga raaga.
      • It's ideal to be sung in the evening time. It can also be sung at all times.
      • This raga has mention in Sangeetha Rathnakaramu, Sangeetha Makarandamu, Sangeetha Samayasaaramu and Chathurdandi Prakaasika.
    • Sanchaaram: GMPNP, - S.NP, - .NSRSR, - GMPMR,S, - S.NPNS., - NS.NP, - MGMP,M - GMPNS., - NS.NP, - MGMP,M - GMPNS.,NPM - GMPM - GMR - SRS.NS 
    • Compositions:
      • Geetham: Hariharanutha - Chaturasra Jaathi Eka Thaalam - Purandharadasa
      • Varnam:
        • Saami Ninne Kori - Aadi Thaalam
        • Sumukhamu - Ata Thaalam - Vadivelu Pillai
      • Kruthi:
        • Mahaganapathim - Chaturasra Jaathi Eka Thaalam - Muthuswamy Dikshitar
        • Swaminatha Paripaalayaasumaam - Aadi Thaalam - Muthuswamy Dikshitar
      • Pancharatnakeerthana: Jagadananda karaka - Aadi Thaalam - Thyagaraju

Friday, 12 January 2024

Characteristics of Malahari Raaga - మలహరి రాగ లక్షణములు

  • ఇది 15వ మేళకర్త మాయామాళవగౌళరాగజన్యము.

    ఆరోహణ సరిమపదస.

    వరోహణ సదపమగరిస


    శృతులు: షడ్జము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, శుద్ధ దైవతము

    లక్షణములు: ఆరోహణమునందు గాంధార నిషాదములు, అవరోహణమునందు నిషాదము వర్జ్యములు. ఉపాంగ రాగము, ఔడవ షాడవ రాగము. రిషభ, మధ్యమ, పంచమ, దైవతములు రాగచ్ఛాయా స్వరములు. ఎల్లప్పుడూ పాడదగు రాగము. కానీ ఉదయమున పాడుట సమంజసము. సభ ఆరంభమున పాడదగు రాగము. రిమపద, దపమగరిస, దపదసా, అను ప్రయోగములు రాగ రంజకములు. సరిమాగరి, సరిగరిసా అనునవి విశేష ప్రయోగములు.

    రచనలు:

    గీతములు: శ్రీగణనాథ, కుందగౌర - రూపకతాళం

    వీటిని రచించినవారు పురంధరదాసు

    కృతి: పంచమాతంగముఖ గణపతి - ఆదితాళం - ముత్తుస్వామి దీక్షితార్
    Malahari  is a janya of the 15th Melakarta raga Mayamalavagowla.
  • This raaga is known to be a morning raaga which brings out a sense of calmness.
  • It is associated with the rainy season.
  • The word 'Malahari' means 'that which drains/eradicates impurity'. It is an auspicious raaga. 
  • Malahari evokes Bhakhi rasa.
  • It is a Tristhaayi raga (sung in three octaves).
  • In classical carnatic training, it is often used as a raaga for beginners using geetha right after the swara-based exercises in Mayamalavagowla.
  • Sri Purandharadasa, the father of Carnatic Music, devised compositions for beginners' Abhyaasa (Pillaari/Piliyaari Geethams) in this raagam. It is not of wide use lately in concerts. Instead Saveri is being used widely (which is different from Malahari only with respect to the absence/presence of Nishaadam in the Avarohana).
  • Many of the Geethas in this raga have been composed by Purandara Dasa and Muthuswami Dikshitar.
  • Moorchana of Malahari:
    • S R₁ M₁ P D₁ 
    •  D₁ P M₁ G₃ R₁ S
  • This raga is an asymmetric scale and is classified as an Upaanga Varjya (G,N missing in Aarohana and N missing in Avarohana) audava-shadava raga (five notes in the ascending scale and six notes in the descending scale).
  • The notes in this scale are
    • shaDjam
    • shuddha rishabha
    • shuddha madhyama
    • panchakam
    • shuddha dhaivata in arohana and
    • additional anthara gandhara in avarohana.
  • Since this scale does not have a nishadha, it can be derived from Gayakapriya (13th melakarta) or Vakulabharanam (14th) too, but has been traditionally associated with Mayamalavagowla (15th) as the parent.
  • Compositions in Malahari usually begin with swaras R,M,P,D.
  • Jeeva swaras are M,P,D.
  • Vaadi, Graha swaras of Malahari are S,M,D.
  • Samvaadi swaras of Malahari are S-P, R-D, S-M, M-S, P-S
  • Janta swaras like RR MM PP DD, MM PP DD SS, DD PP MM GG RR may appear frequently.
  • Malahari raaga has mention in famous granthas like:
    • Sangeetha Makarandamu - Narada
    • Sangeetha Ratnaakaramu - Sarngadeva
    • Sangeetha Choodaamani - Jagadekamallu
    • Pandithaaraadhya Charithramu - Palkuriki Somanatha
    • Sangeetha Saaramu - Vidyaaranya
    • Chaturdandi Prakaasika - Venkatamakhin
    • Raaga Thaala Chinthaamani - Poluri Govindaamaathya
  • Popular compositions in Malahari Raagam:

    • shri GaNanaatha in Rupaka, written by Purandara Dasa
    • kunda gowra gowrivara in Rupaka, written by Purandara Dasa
    • padumanaabha paramapurusha in Triputa, written by Purandara Dasa
    • kereya neeranu kerege chelli in Triputa, written by Purandara Dasa
    • Panchamatanga in Rupaka composed by Muthuswami Dikshitar
    • Ananta Padmanaabam in Rupaka composed by Muthiah Bhagavatar
    • Kalaye Devadeva in Jhampa composed by MaharajaSwathi Thirunal
    • Melukovayya in Adi composed by Shahji Maharaja