Raaga Lakshana - Malahari
- Malahari is a janya of the 15th Melakarta raga Mayamalavagowla.
- This raaga is known to be a morning raaga which brings out a sense of calmness.
- It is associated with the rainy season.
- The word 'Malahari' means 'that which drains/eradicates impurity'. It is an auspicious raaga.
- Malahari evokes Bhakhi rasa.
- It is a Tristhaayi raga (sung in three octaves).
- In classical carnatic training, it is often used as a raaga for beginners using geetha right after the swara-based exercises in Mayamalavagowla.
- Sri Purandharadasa, the father of Carnatic Music, devised compositions for beginners' Abhyaasa (Pillaari/Piliyaari Geethams) in this raagam. It is not of wide use lately in concerts. Instead Saveri is being used widely (which is different from Malahari only with respect to the absence/presence of Nishaadam in the Avarohana).
- Many of the Geethas in this raga have been composed by Purandara Dasa and Muthuswami Dikshitar.
- Moorchana of Malahari:
- S R₁ M₁ P D₁ Ṡ
- Ṡ D₁ P M₁ G₃ R₁ S
- This raga is an asymmetric scale and is classified as an Upaanga Varjya (G,N missing in Aarohana and N missing in Avarohana) audava-shadava raga (five notes in the ascending scale and six notes in the descending scale).
- The notes in this scale are
- shaDjam
- shuddha rishabha
- shuddha madhyama
- panchakam
- shuddha dhaivata in arohana and
- additional anthara gandhara in avarohana.
- Since this scale does not have a nishadha, it can be derived from Gayakapriya (13th melakarta) or Vakulabharanam (14th) too, but has been traditionally associated with Mayamalavagowla (15th) as the parent.
- Compositions in Malahari usually begin with swaras R,M,P,D.
- Jeeva swaras are M,P,D.
- Vaadi, Graha swaras of Malahari are S,M,D.
- Samvaadi swaras of Malahari are S-P, R-D, S-M, M-S, P-S
- Janta swaras like RR MM PP DD, MM PP DD SS, DD PP MM GG RR may appear frequently.
- Malahari raaga has mention in famous granthas like:
- Sangeetha Makarandamu - Narada
- Sangeetha Ratnaakaramu - Sarngadeva
- Sangeetha Choodaamani - Jagadekamallu
- Pandithaaraadhya Charithramu - Palkuriki Somanatha
- Sangeetha Saaramu - Vidyaaranya
- Chaturdandi Prakaasika - Venkatamakhin
- Raaga Thaala Chinthaamani - Poluri Govindaamaathya
- Popular compositions in Malahari Raagam:
- shri GaNanaatha in Rupaka, written by Purandara Dasa
- kunda gowra gowrivara in Rupaka, written by Purandara Dasa
- padumanaabha paramapurusha in Triputa, written by Purandara Dasa
- kereya neeranu kerege chelli in Triputa, written by Purandara Dasa
- Panchamatanga in Rupaka composed by Muthuswami Dikshitar
- Ananta Padmanaabam in Rupaka composed by Muthiah Bhagavatar
- Kalaye Devadeva in Jhampa composed by MaharajaSwathi Thirunal
- Melukovayya in Adi composed by Shahji Maharaja
- మలహరి రాగం 15వ మేళకర్త రాగమైన మాయామాళవగౌళ యొక్క జన్యరాగం.
- ఈ రాగం ఉదయ కాల రాగంగా ప్రసిద్ధి పొందింది, ఇది ప్రశాంతతను పెంపొందిస్తుంది.
- దీనిని వర్షాకాలంలో పాడతారు.
- 'మలహరి' అంటే 'మలినాన్ని పోగొట్టునది' అని అర్థం. ఇది ఒక మంగళప్రదమైన రాగం.
- మలహరి భక్తి రస ప్రధానమైనది.
- ఇది త్రిస్థాయిరాగం (మూడు స్థాయుల్లో పాడబడునది).
- కర్నాటకసంగీత శిక్షణలో, మాయామాళవగౌళలో నేర్చుకొనే స్వరపాఠాల తర్వాత నేర్చుకొనే గీతాల్లో మలహరిని ఉపయోగిస్తారు.
- కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురంధరదాసులవారు ఈ రాగంలో పిళ్ళారి/పిళియారి గీతాలు రచించారు.
- ప్రాచీన కాలంలో ప్రాచుర్యంలో ఉన్నఈ రాగాన్ని ఆధునిక కాలంలో ఎక్కువగా ఉపయోగించటం జరగట్లేదు. దాని స్థానంలో సావేరి రాగం ఎక్కువగా వినిపిస్తోంది. (మలహరికి, సావేరికి అవరోహణలో నిషాదం మాత్రమే తేడా).
- ఈ రాగంలో చాలా గీతలు పురంధరదాసు, ముత్తుస్వామి దీక్షితులవారు రచనలు చేశారు.
- మలహరి రాగ మూర్ఛన:
స రి₁ మ₁ ప ద₁ స
స ద₁ ప మ₁ గ₃ రి₁ స - మలహరి ఉపాంగ వర్జ్య (ఆరోహణలో గ, ని ఉండవు, అవరోహణలో ని ఉండదు). ఔడవ-షాడవ రాగం (ఆరోహణంలో ఐదు స్వరాలు, అవరోహణలో ఆరు స్వరాలు).
- ఈ రాగంలో స్వరాలు:
- షడ్జం
- శుద్ధ రిషభం
- శుద్ధ మధ్యమం
- పంచమం
- శుద్ధ ధైవతం
- ఆరోహణలో అదనంగా అంతర గాంధారం
- మలహరి రాగ మూర్ఛనలో నిషాదం లేకపోవడంతో ఇది గాయకప్రియ (13వ మేళకర్త) లేదా వకుళాభరణం (14వ మేళకర్త) నుండి కూడా పుట్టినట్టు చెప్పవచ్చు కానీ, ఈ రాగం పూర్వంనుండే మాయామాళవగౌళ (15వ మేళకర్త) కు జన్యరాగంగా ప్రసిద్ధిచెందింది.
- మలహరి రాగంలో రచనలు సాధారణంగా రి, మ, ప, ద స్వరాలతో ప్రారంభమవుతాయి.
- జీవ స్వరాలు మ, ప, ద.
- మలహరి యొక్క వాది, గ్రహస్వరాలు స, మ, ద.
- మలహరి యొక్క సంవాది స్వరాలు స-ప, రి-ద, స-మ, మ-స, ప-స.
- తఱచుగా ఈ రాగంలో ఇటువంటి జంటస్వరాల ప్రయోగం కనిపిస్తుంది.
- రిరి మమ పప దద, మమ పప దద సస, దద పప మమ గగ రిరి
- మలహరి రాగ ప్రస్తావన ఈ ప్రసిద్ధ గ్రంథాలలో ఉంది:
- సంగీత మకరందము - నారద
- సంగీత రత్నాకారం - శార్ఙ్గదేవ
- సంగీత చూడామణి - జగదేకమల్లు
- పండితారాధ్య చరిత్రము - పాల్కురికి సోమనాథ
- సంగీత సారము - విద్యారణ్య
- చతుర్దండి ప్రకాశిక - వెంకటమఖిన్
- రాగతాళ చింతామణి - పోలూరి గోవిందామాత్య
- మలహరి రాగంలో ప్రసిద్ధ రచనలు:
- శ్రీ గణనాథ - రూపక తాళం రచన: పురంధర దాస
- కుందగౌర గౌరీవర - రూపక తాళం రచన: పురంధర దాస
- పదుమనాభ పరమపురుష - త్రిపుట తాళం రచన: పురంధర దాస
- కెరెయ నీరను కెరెగె చెల్లి - త్రిపుట తాళం రచన: పురంధర దాస
- పంచమాతంగ - రూపక తాళం రచన: ముత్తుస్వామి దీక్షితార్
- అనంత పద్మనాభం - రూపక తాళం రచన: ముత్తయ్య భాగవతార్
- కలయే దేవదేవ - ఝమ్పె తాళం రచన: మహారాజ స్వాతితిరుణాల్
- మెలుకోవయ్య - ఆదితాళం రచన: షాజీ మహారాజ్
No comments:
Post a Comment