Lyrics: Traditional
Music: Traditional
Raagam:
Thaalam:
Pa) Vishnu Eswara Brahma mugguru annadammulanta
Vaari mahimatho chesina nenoka mattibommananta
1) Thommidi kitikeelu darwaazaalatho maatalaadukontaa
Povey jeevamaa poddu sallanga ledu pandukonta nenu
2) Vasthaa padaraa pothaa padaraa dharmamu thana venta - ee
Sambasivudu ninu bilva pampenu jaldiga rammanta
3) Chethilo bellam unnanthasepey kaaki palakamanta
Chethilo bellam saripadipothey evaru raaru venta
4) Tholinaallu evallainanu gunjuku rammanta
Yamunollocchi chuttu nilichinara kaallanu themmanta
5) Inti mundata mekapillalu vela balagamanta
Edcheru aarcheru kaanee evaru raaru venta
6) Neellu bosi kurchundabettiri maayabommananta
Puvvulu dandalu vesinaarayaa peddalu veeranta
7) Chinni peddalu kurchunnaaru chinthalu padakunta
Etthandoy etthandoy edu katla saavaari
8) Dimpudu kallam kaada dinchinaaru peddalu veeranthaa
Sommu sommandamu theesukonnaru peddalu veeranthaa
9) Guruvey posthadu sanku theerthamu mukthi pedavulanta
Mantlo mannu galpi mari potharu vaaranthaa
10) Dhana dhaanyamulu evari padaarthamu dharmamu thana venta
Chesina paapamu chesina punyamu vacchunu thana venta
ప) విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట
వారి మహిమతో చేసిన నేనొక మట్టిబొమ్మనంట
1) తొమ్మిది కిటికీలు దర్వాజాలతొ మాటలాడుకొంటా
పోవే జీవమా పొద్దు సల్లంగ లేదు పండుకొంట నేను
2) వస్తా పదరా పోతా పదరా ధర్మము తన వెంట - ఈ
సాంబశివుడు నిను బిల్వ పంపెను జల్దిగ రమ్మంట
3) చేతిలో బెల్లం ఉన్నంతసేపే కాకి పలకమంట
చేతిలో బెల్లం సరిపడిపోతే ఎవరు రారు వెంట
4) తొలినాళ్ళు ఎవళ్ళైనను గుంజుకు రమ్మంట
యమునోళ్ళొచ్చి చుట్టు నిలిచినార కాళ్ళను తెమ్మంట
5) ఇంటి ముందట మేకపిల్లలు వేల బలగమంట
ఏడ్చేరు ఆర్చేరు కానీ ఎవరు రారు వెంట
6) నీళ్ళుబోసి కూర్చుండబెట్టిరి మాయబొమ్మనంట
పువ్వులు దండలు వేసినారయా పెద్దలు వీరంతా
7) చిన్ని పెద్దలు కూర్చున్నారు చింతలు పడకుంటా
ఎత్తండోయ్ ఎత్తండోయ్ ఏడు కట్ల సావారి
8) దింపుడు కళ్ళం కాడ దించినరు పెద్దలు వీరంతా
సొమ్ము సొమ్మందము తీసుకొన్నరు పెద్దలు వీరంతా
9) గురువే పోస్థడు శంకుతీర్థము ముక్తి పెదవులంట
మంట్లో మన్ను గల్పి మరి పోతరు వారంతా
10) ధన ధాన్యములు ఎవరి పదార్థము ధర్మము తనవెంట
చేసిన పాపము చేసిన పుణ్యము వచ్చును తనవెంట
Chesina paapamu chesina punyamu vacchunu thana venta