Showing posts with label Aarabhi. Show all posts
Showing posts with label Aarabhi. Show all posts

Wednesday, 7 January 2026

O Rama O Rama - Thyagaraja Keerthana

ప. ఓ రామ ఓ రామ ఓంకార ధామ

ఓ రామ ఓ రామ ఒనరించు ప్రేమ


చ1. నా మేలునందరు నవ్వుటకాయె-

నేమని తాళుదునిక దేవ రాయ (ఓ)


చ2. నన్నేచినందుకు నయమేమి కలిగే

నిన్నే నెర నమ్మితి నీవే నా సలిగ (ఓ)


చ3. నీకే తగియున్నాను నిజము నా మాట

సాకేత రామ రక్షణ చేయీ పూట (ఓ)


చ4. ధర లోన రక్షకులు లేరు దేవ

మరచితే వెరచితే మాకేమి దోవ (ఓ)


చ5. ఈ జన్మమెందుకు ఎవరు తనకేల

రాజీవ నేత్ర దయ రానిది మేలా (ఓ)


చ6. హృదయము చలువైతే ముదము నీ పాలు

సు-దయాళుడవైతే సుఖము నీవేలు (ఓ)


చ7. ఆత్మకైయొకటైన ఆసించ లేదు

పరమాత్మ నీకని పల్క మనసేల రాదు (ఓ)


చ8. నీరైన పాలైన నీకేయనుకొంటి

తీరైన చక్కని దేవతనుకొంటి (ఓ)


చ9. నీకాసించితి కాని నిమిషము మాన

ఏకమై నన్నేలుకోకుంటేయాన (ఓ)


చ10. నీ కంటే దొరకునా నిరుపమ గాత్ర

పరాకేల శ్రీ త్యాగరాజుని మిత్ర (ఓ)


Pa. O Rama O Rama Omkaara dhaama

O Rama O Rama onarinchu prema


1. Naa melunandaru navvutakaaye

-nemani thaaludunika devaraaya


2. Nannechinanduku nayamemi kaligey

Ninney nera nammithi neevey naa saliga


3. Neekey thagiyunnaanu nijamu naa maata

Saaketha Rama rakshana cheyee poota


4. Dharalona rakshakulu leru deva

marachithey verachithey maakemi dova


5. Ee janmamenduku evaru thanakela

Raajeevanethra daya raanidi melaa


6. Hrudayamu chaluvaithey mudamu nee paalu

Sudayaaludavaithey sukhamuneevelu


7. Aathmakai okataina aasinchaledu

Paramaathma neekani palka manasela raadu


8. Neeraina paalaina neekeyanukonti

Theeraina chakkani devathanukonti


9. Neekaasinchithi kaani nimishamu maana

Ekamai nannelukokunteyaana


10. Neekantey dorakunaa nirupama gaathra

Paraakela Sri Thyagarajuni mithra


Tuesday, 9 September 2025

Mathamantey Mari Emitanna - Religious Harmony Song - Light Music Song - Sri Puttaparthi Narayanacharyulu



Jalra Settings used to record this song:
Count: 4
Style: Basic 5
Speed: 80 bpm
Pitch: C

Lyrics: Sri Puttaparthi Narayanacharyulu
Music: Dr.M. Chittharanjan

Raagam: Aarabhi
Thaalam: Aadi

Pa) Mathamante mari emitanna
Mana puraanaalalo choochi cheppannaa

1) Maanavula edalapai mahadeelu  kattukoni
bhakthi bhakthantenu phalamemitannaa

2) Poddasthaanammu paadu kutralu nerchi
Rama Rama antey rakthi edannaa

3) Peddollu seppina vedavaakyaalalo
maanavuni preminchute neethi annaaru

4) Manasu suddhiga unte Madhavundunnaadu
Theeru sarigaa leka devudedannaa

ప) మతమంటే మరి ఏమిటన్నా
మన పురాణాలలో చూచి చెప్పన్నా

1) మానవుల ఎదలపై మహడీలు కట్టుకొని
భక్తి భక్తంటేను ఫలమేమిటన్నా

2) పొద్దస్తమానమ్ము పాడు కుట్రలు నేర్చి
రామ రామ అంటే రక్తి ఏదన్నా

3) పెద్దోళ్ళు సెప్పిన వేదవాక్యాలలో
మానవుని ప్రేమించుటే నీతి అన్నారు

4) మనసు శుద్ధిగా ఉంటే మాధవుండున్నాడు
తీరు సరిగా లేక దేవుడేడన్నా

Thursday, 10 October 2024

Jaya Jaya Vaishnavi Durge - Narayana Theertha Tharangam



Raagam: Aarabhi

Thaalam: Aadi


Pa) Jaya Jaya Vaishnavi Durge Amba - Jaya Jaya kalpitha sarge

Jaya jaya thoshitha bharge Amba - Jaya jaya kuchalitha Durge


1) Srikara sadguna jaale Amba - Sindoora ranjitha phaale

paaka saasana mani neele Amba - praaleya bhoodhara baale


2) Paalitha kisalaya chaape Amba - Parvathi lokaika deepe

Kaalika komala roope Amba - khanditha thribhuvana thaape


3) Bhaktha janaamara bhooje Amba - bhaasitha loka samaaje

Raktha mrudula paadaambhoje Amba - rangadutthunga vakshoje


4) Veenaa vinodini Girije Amba - vidruma mani sannibha Girije

Maanitha loka samaaje Amba - Madana Gopaalaka sathye


ప) జయ జయ వైష్ణవి దుర్గే అంబ - జయ జయ కల్పితసర్గే

జయ జయ తోషిత భర్గే అంబ - జయ జయ కుచలిత దుర్గే


1) శ్రీకర సద్గుణజాలే అంబ - సిందూర రంజిత ఫాలే

పాక శాసన మణి నీలే అంబ - ప్రాలేయ భూధర బాలే


2) పాలిత కిసలయ చాపే అంబ - పార్వతి లోకైక దీపే

కాళిక కోమల రూపే అంబ - ఖండిత త్రిభువన తాపే


3) భక్త జనామర భూజే అంబ - భాసిత లోక సమాజే

రక్త మృదుల పాదాంభోజే అంబ - రంగదుత్తుంగ వక్షోజే


4) వీణా వినోదిని గిరిజే అంబ - విద్రుమ మణి సన్నిభ గిరిజే

మానిత లోక సమాజే అంబ - మదన గోపాలక సత్యే