Showing posts with label Yadukula Kambhoji. Show all posts
Showing posts with label Yadukula Kambhoji. Show all posts

Thursday, 19 October 2023

Amba Neekidey Haarathi - Sampradaaya Mangala Haarthi



Jalra settings used to record this song:

Count: 7

Style: Basic 3

Speed: 200 BPM

Pitch: A

 

Pa) Amba neekidey haarathi Sri Raja Rajeswari


1) Parama bhakthulu ninnu bhajiyinchuchunnaaru

paripaalinchi brovavey Sri Jagadeeswari


2) Nee paadamulu nammi ninu kolachuchunnaaru

kaapaadi rakshinchavey kanikaramulatho


3) Muggurammalakunu moolammu neevenammaa

Eggulennaku maayandu erani vaaramu


ప) అంబా నీకిదే హారతి శ్రీ రాజరాజేశ్వరి


1) పరమ భక్తులు నిన్ను భజియించుచున్నారు 

పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి 


2) నీ పాదములు నమ్మి నిను కొలచుచున్నారు 

కాపాడి రక్షించవే కనికరములతో


3) ముగ్గురమ్మలకును మూలమ్ము నీవెనమ్మా 

ఎగ్గులెన్నకు మాయందు ఏరనివారము 

Saturday, 8 April 2023

Pahimam Sri Rama antey - Bhadrachala Ramadasu Keerthana




Jalra settings used to record this song:

Count: 4

Style: Basic 5

60 BPM

Pitch: G#


Raagam: Yadukula Kambhoji

Thaalam: Aadi


Pa) Paahimaam Sri Rama antey palakavaithivi - nee

sneham ettidani ney cheppanohohohohohohoho


1) Ibbandinondi aakari bobba pettinanthaloney

Gobbuna gaachithivata jabbuseyaka

Nibbaramugaa nenentho kabbamicchi vedukonna

Thabbibbu chesedavu Rama abbabbabbabbabbabbabbaa


2) Sannuthinchinavaarinella munnu dayatho brochithivani

Pannagasaayini kani vinnavinchithi

Vinnapamu vinakayentho kannada chesedavu Raama

Ennatikee nammaraadurannannannannannannannaa


3) Chayyena Bhadradri nilaya swamivani nammi nenu

Vemaru vidhamula vinuthi cheya saagithi

Iyyada Raamadaasuni kuyyaalinchi brovakunna

Vayyaaramemanavacchu ayyayyayyayyayyayyayyo


ప) పాహిమాం శ్రీరామ అంటే పలకవైతివి - నీ 

స్నేహమెట్టిదని నే చెప్పనోహోహోహోహోహోహోహో 


1) ఇబ్బందినొంది ఆఖరి బొబ్బ పెట్టినంతలోనే

గొబ్బున గాచితివట జబ్బుసేయక

నిబ్బరముగా నేనెంతో కబ్బమిచ్చి వేడుకొన్న

తబ్బిబ్బు చేసెదవు రామ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా


2) సన్నుతించినవారినెల్ల మున్ను దయతో బ్రోచితివని

పన్నగశాయిని కని విన్నవించితి

విన్నపము వినక ఎంతో కన్నడ చేసెదవు రామ

ఎన్నటికీ నమ్మరాదురన్నన్నన్నన్నన్నన్నన్నా


3) చయ్యెన భద్రాద్రినిలయ స్వామివని నమ్మి నేను

వేమారు విధముల వినుతి చేయ సాగితి

ఇయ్యడ రామదాసుని కుయ్యాలించి బ్రోవకున్న 

వయ్యారమేమనవచ్చు అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో


Monday, 27 December 2021

Kolani dopariki gobbillo - Annamacharya Keerthana



Raagam: Yadukula Kambhoji

Thaalam: Aadi Thaalam


ప|| కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు

కుల స్వామికిని గొబ్బిళ్ళో ||



1|| కొండ గొడుగుగా గోవుల గాచిన

కొండొక శిశువుకు గొబ్బిళ్ళో

దండగంపు దైత్యుల కెల్లను తల

గుండు గండనికి గొబ్బిళ్ళో

2|| పాప విధుల శిశుపాలుని తిట్టుల

కోపగానికిని గొబ్బిళ్ళో

యేపున కంసుని యిడుమల బెట్టిన

గోప బాలునికి గొబ్బిళ్ళో



3|| దండివైరులను తరిమిన దనుజుల

గుండె దిగులునకు గొబ్బిళ్ళో

వెండిపైడి యగు వేంకట గిరిపై

కొండలయ్యకును గొబ్బిళ్ళో


Kolani dopariki gobbillo -Yadu

Kula swamikini gobbillo


1) Konda godugugaa govulu kaachina

Kondoka sisuvuku gobbillo

Dandagampu daithyulakellanu thala

Gundu gandanikigobbillo


2) Paapa vidhula Sisupaluni thittula

Kopagaanikini gobbillo

Yepuna Kamsuni idumala bettina

Gopabaaluniki gobbillo


3) Dandi vairulanu tharimina danujula

Gunde digulunaku gobbillo

Vendi paidiyagu Venkatagiripai

Kondalayyakunu gobbillo



Thursday, 26 November 2020

Pettani Kotindariki - Annamacharya Keerthana - Yadukula Kambhoji - Aadi



Pettani kotindariki pendlikoduku - bomma

Pettenasurulakella pendlikoduku


1) Pellaginchi boometthi pendlikoduku - vaadey

pillagrovi raagaala pendlikoduku

pellaina eevula pendlikoduku - vaadey

pilladeepu vennuddi pendlikoduku


2) Pinchapu sirasu paagaa pendlikoduku - gum

pinchina kopaginchey pendlikoduku

Penchakappudey perigey pendlikoduku - vala

pinchey chakkaani siri pendlikoduku


3) Penta perugula donga pendlikoduku - bhoomi

benti pothula goorichey pendlikoduku

Gentu leni Venkatagiri meedanu vaadey

Penta vettukunnavaadu pendlikoduku


పెట్టని కోటిందరికి పెండ్లికొడుకు- బొమ్మ

బెట్టేనసురులకెల్ల పెండ్లికొడుకు


1) పెల్లగించి భూమెత్తీ పెండ్లికొడుకు - వాడే

పిల్లగోవి రాగాల పెండ్లికొడుకు

పెల్లైన యీపుల పెండ్లికొడుకు - వాడే

పిల్లదీపు పెన్నుద్ది పెండ్లికొడుకు


2) పింఛపు శిరసు పాగా పెండ్లికొడుకు - గుం

పించిన కోపగించీ పెండ్లికొడుకు

పెంచకప్పుడే పెరిగె పెండ్లికొడుకు - వల

పించె జక్కాని సిరి పెండ్లికొడుకు


3) పెంట పెరుగుల దొంగ పెండ్లికొడుకు - భూమి

బెంటి పోతుల గూరిచె పెండ్లికొడుకు

గెంటు లేని వేంకటగిరి మీదను వాడె

పెంట వెట్టుకున్నవాడు పెండ్లికొడుకు