- ఇతడు క్రీ.శ. 1845 - 1902 కాలమునాటివాడు. అష్టసహస్ర బ్రాహ్మణుడు. ఆంధ్రతమిళభాషలలోను, సంగీతములోను గొప్ప పండితుడు.
- మానంబుచావడి వెంకటసుబ్బయ్యగారి శిష్యుడు.
- ఈయన గాత్రము మొదట అతికఠినముగా ఉండుటచే విపరీతమైన సాధన చేసి, తన గాత్రమును మాధుర్యమైనదిగా చేసుకొనగలిగిన సంకల్పసిద్ధుడు.
- ఇతను త్యాగరాజ రచనలను అనుసరించి, “వేంకటేశ” ముద్రతో అనేక కృతులను, వర్ణములను, తిల్లానాలను, జావళీలను రచించిన సమర్ధుడు.
- బేగడ రాగాలాపనలో ఈయనకుగల ప్రత్యేక నైపుణ్యమునకుగాను “బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్” అని పిలువబడును.
- అష్టోత్తర శత తాళములలో ఒకటైన 128 అక్షరకాలములుగల “సింహనందిని” తాళములో ఒక గొప్ప పల్లవి రచించి అత్యద్భుతంగా గానముచేసి, సభాసదులను ఆనందపరవశులుగా చేయగల ఏకైక సంగీతవిద్వాంసుడు.
- ఇతడు మొదట తిరువత్తియూర్ లోను, తదుపరి చెన్నపట్టణంలోను నివసించుటచే పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అని కూడా పిలువబడెను.
- ఇతని రచనలకుగానీ, గానమునకుగానీ, రాగభావమే ప్రత్యేకత అగును.
- ఈయన రచనలలో
- “ఇంతకంటె” (కానడ),
- “రఘువంశసుధాంబుధిచంద్రశ్రీ” (కదనకుతూహలం),
- “మనసున నెర నమ్మితిని” (బేగడ),
- “నిన్నుజూసి ధన్యుడనైతి” (సౌరాష్ట్ర)
- వంటి కృతులు మిగుల ప్రసిద్ధములు.
- శ్రీ రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ ఈయనకు శిష్యుడు.
Carnatic Music, the classical music form of South India, has originated from Saama Vedam. It is acclaimed to have soothing effect on not only humans but also animals. "Sisurvetthi Pasurvetthi Vetthi Gaanarasam Phanih". This website is maintained by a music school 'Sriman Sangeetha Nilayam', named after Sri Bharatam Srimannarayana, a famous multifaceted scholar from Tadepalligudem, AP. Story behind the emblem of SSN... https://www.youtube.com/watch?v=tdWGZJibzZU&t=95s
Showing posts with label Patnam Subramanya Iyer. Show all posts
Showing posts with label Patnam Subramanya Iyer. Show all posts
Monday, 18 May 2026
Life History of Sri Patnam Subramanya Iyer - జీవితచరిత్ర - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
Wednesday, 5 November 2025
Subscribe to:
Posts (Atom)

