Showing posts with label Aananda Bhairavi. Show all posts
Showing posts with label Aananda Bhairavi. Show all posts

Tuesday, 4 March 2025

Vanitharo Ee Vannelelane - Sri Dasu Sriramulu Jaavali

Raagam: Aananda Bhairavi

Thaalam: Roopaka



Pa) Vanitharo ee vannelelane eevela naaku


Cha) Aakulela pokalela agarela gandhamela

Maganiki daya leka menu sagamai unnatti vela

Bhaasuraangi paatalela aatalela maatalela

Daasurama paalubaasi maataludigiyunnavela


ప) వనితరో ఈ వన్నెలేలనే ఈవేళ నాకు


చ) ఆకులేల పోకలేల అగరేల గంధమేల

మగనికి దయ లేక మేను సంగమైయున్నట్టివేళ

భాసురాంగి పాటలేల ఆటలేల మాటలేల

దాసురామ పాలుబాసి మాటలుడిగియున్నవేళ 



Thursday, 6 February 2025

Ksheera Saagara Vihara - Thyagaraja Divyanaama Keerthana

Raagam: Aananda Bhairavi

Thaalam: Khandachaapu


Pa) Ksheera saagara vihaara aparimitha

ghora paathaka vidaara

kroora jana gana vidoora nigama

sanchaara sundara sareera


1) Sathamakhaahitha vibhanga Sri Rama

Samana ripu sannuthaanga

Sritha maanavaantharanga janakaja

SRngaara jalaja bhRunga

 

2) Rajaadhi raaja vesha Sri Rama

ramaneeyakara subhoosha

raajanutha lalitha bhaasha Sri Thyaaga-

raajaadi bhakthaposha


ప. క్షీర సాగర విహార అపరిమిత

ఘోర పాతక విదార

క్రూర జన గణ విదూర నిగమ

సంచార సుందర శరీర


1. శతమఖాహిత విభంగ శ్రీ రామ

శమన రిపు సన్నుతాంగ

శ్రిత మానవాంతరంగ జనకజా

శృంగార జలజ భృంగ


2. రాజాధి రాజ వేష శ్రీ రామ

రమణీయ కర సు-భూష

రాజ నుత లలిత భాష శ్రీ త్యాగ-

రాజాది భక్త పోష

Friday, 11 October 2024

Mahishasuramardini Jaya Mangalamide - Sampradaya Mangala Harathi



Raagam: Aananda Bhairavi

Thaalam: Eka

 

Pa) Mahishasuramardini jaya

mangalamide janani - hey Lalithe


1) Agha sanga naasini - Aasritha poshini

Jana soukhya daayini - Vanajaatha lochani


2) Taruni - mrudupaani - Sukavaani - Sarvani - Sankaru raani

Ali neelaveniro - palukavela naatho

Aluka elanammaa Aadisakthe Lalithe


ప) మహిషాసురమర్దిని - జయ

మంగళమిదే జననీ - హే లలితే


1) అఘ సంగ నాశిని - ఆశ్రిత పోషిణి

జన సౌఖ్యదాయిని - వనజాత లోచని


2) తరుణి - మృదుపాణి - శుకవాణి - శర్వాణి - శంకరు రాణి

అలి నీలవేణిరో - పలుకవేల నాతో

అలుక ఏలనమ్మా ఆదిశక్తి లలితే

Tuesday, 8 October 2024

Kamakshi Kalyani - Devotional Song



ప) కామాక్షి కళ్యాణి కాదంబరి

కాత్యాయని గౌరి కనకాంబరి

అంబ పాహి - జగదంబ మాం పాహి


1) భవేశ్వరి విద్యేశ్వరి పంచాక్షరి

వామేశ్వరి వాగేశ్వరి పరమేశ్వరి

అంబ పాహి - జగదంబ మాం పాహి


2) మహాదేవి మాం పాహి మహేశ్వరి

మహావిద్యా మహాకాళీ రాజేశ్వరి

అంబ పాహి - జగదంబ మాం పాహి



Pa) Kamakshi Kalyani kadambari

Kaatyaayani Gowri kanakambari

Amba paahi - Jagadamba maam paahi

 

1) Bhaveswari Vidyeswari Panchakshari

Vaameswari Vaageswari Parameshwari

Amba paahi - Jagadamba maam paahi


2) Mahadevi maam paahi Maheshwari

Mahavidyaa Mahakali Rajeswari

Amba paahi - Jagadamba maam paahi


Thursday, 21 March 2024

Enduku Krupa Raadu - Bhadrachala Ramadasu Keerthana

 



Raagam: Aananda Bhairavi

Thaalam: Trisra Gathi Eka Thaalam


Pa) Enduku krupa raadu Sri Rama

Nenemi chesithinayyaa Sri Rama


1) Gathi neeveyanukonti Sri Rama - naa

vetha maanpagalavayyaa Sri Rama


2) Ayyayyo naa neramemi Sri Rama - naa

kuyyaalimpavayya Sri Rama


3) Inka nee daya raakunte Sri Rama - naa

sankatametu theeru Sri Rama


4) Vaasiyou Bhadraadrivaasa Sri Rama - Rama

dasuni viduvaku Sri Rama

ప) ఎందుకు కృప రాదు శ్రీరామ - నేనేమి చేసితినయ్యా శ్రీరామ


1) గతి నీవేయనుకొంటి శ్రీరామ నా - వెత మాన్పగలవయ్యా శ్రీరామ

2) అయ్యయ్యో నా నేరమేమి శ్రీరామ నా - కుయ్యాలింపవయ్యా శ్రీరామ

3) ఇంక నీ దయ రాకుంటే శ్రీరామ నా - సంకటమెటు దీరు శ్రీరామ

4) వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ రామ-దాసుని విడువకు శ్రీరామ


Tuesday, 30 January 2024

Rama Rama neevaaramu - Thyagaraja Divyanaama Krithi




Raagam: Aananda Bhairavi
Thaalam: Aadi


Pa) Rama Rama neevaaramu gaamaa Rama Seetha
Rama Rama saadhu jana prema raaraa

1) Merugu chelamu gattuka mella raaraa Rama
Karaku bangaru sommulu kadala raaraa

2) Varamainatti bhakthaabheeshta varada raaraa Rama
Marugujesukonunatti mahima raaraa

3) Mendaina Kodanda kaanthi meraya raaraa Rama
panduvaga yundu uddanda raaraa

4) Chirunavvu gala momunu joopa raaraa Rama
Karunatho nannellappudu kaava raaraa

5) Kandarpa sundaraananda kanda raaraa neeku
vandanamu jeseda Govinda raaraa

6) Aadyantha rahitha vedavedya raaraa bhava
vedya ney neevaadanaithi vega raaraa

7) Suprasanna sathya roopa suguna raaraa Rama
Aprameya Thyagarajunela raaraa

ప) రామ రామ నీవారము గామా రామా సీతా
రామ రామ సాధుజన ప్రేమ రారా

1) మెరుగు చేలము గట్టుక మెల్ల రారా రామ
కరకు బంగరు సొమ్ములు కదలరారా

2) వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మరుగుజేసుకొనునట్టి మహిమ రారా

3) మెండైన కోదండ కాంతి మెరయ రారా రామ
పండువగయుండు ఉద్దండ రారా

4) చిరునవ్వు గల మోమును జూపరారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా

5) కందర్ప సుందరానంద కంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా

6) ఆద్యంతరహిత వేదవేద్య రారా భవ
వేద్య నే నీవాడనైతిని వేగ రారా

7) సుప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేల రారా

Wednesday, 23 August 2023

Mangalam Jaya Mangalam - Sampradaaya Mangala Haarathi



మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం

మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం ||


1) శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం

శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం ||


2) వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం

కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ||


3) బ్రహ్మచే పూజింపబడిన చరణ యుగళికి మంగళం

జగములన్నియు కన్నతండ్రను చక్కనయ్యకు మంగళం ||


4) గోపికా గణ సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం

రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ||


Pa) Mangalam jaya mangalam maa nallanayyaku mangalam

Mangalam jaya mangalam maa Krishna Swamyki mangalam


1) Siramunanduna merayuchundedi nemali pinchaku mangalam

Shyaamalaanguni karamulandali madhura muraliki mangalam


2) Vanajadammunu dhikkarinchedi vadana sobhaku mangalam

Karuna rasamunu chinduchundedi kannudoyiki mangalam


3) Brahmachey poojimpabadina charana yugaliki mangalam

Jagamulanniyu kannathandranu chakkanayyaku mangalam


4) Gopikaa gana sevithudu Sri Govindunaku mangalam

Raadhikaa pariveshtithundou raseswarunaku mangalam

Haarathi meerela ivvarey - Sampradaaya Mangala Haarathi


Pa) Haarathi meerela ivvarey - Ambaku mangala

haarathi meerela ivvarey

Haarathi meerela ivvarey jnaana vidyalakella prabalamu

Leelatho padiyaaru vannela melimi bangaaru thalliki


2) Paadamulaku pooja seyarey - Maa thallikipudu

Paarijaathapu haaramivvarey

Aanimuthyapu haaramulu - mola noolu gajjelu jodu andelu

Ravvala paapita bottu mungera samamugaa dhariyinchu thalliki


3) Intha paraakelananarey - Rudruni deviki

chenthanundi poojaseyarey

Chenthanundi pooja seyarey Sankari Omkaara roopiki

Kumkumaankitha alankaariki ponkamaina subhamkaariki


4) Laksha vatthula jyothi koorcharey - chelulaara meeru

Pacchala palleramu vaalcharey

Rakshithambugaanu eerey daakshirambuga haarathulanu

Raakshasa samhaarikipudu mucchatalaraga paadukonuchu


5) Mangala haarathineeyarey - Maa thalliki

Divya mangalaa deviki

Divya mangalaa devi - Deena jana kalpavalli

Sarvaloka janani yaina bangaaru thallikipudu


6) Vedamulaku andaraani mahimaa jyothi

Aadisakthi swaroopini - Amba 

Moodu sakthulakellanu taa ( moolamai velaguchundi

Moodu lokambulanu brochunatti maa bangaaru thalliki


ప) హారతి మీరేల ఇవ్వరే - అంబకు మంగళ 

హారతి మీరేల ఇవ్వరే 

హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము 

లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారుతల్లికి 


2) పాదములకు పూజసేయరే - మా తల్లికిపుడు 

పారిజాతపు హారమివ్వరే 

ఆణిముత్యపు హారములు - మొల నూలు గజ్జెలు జోడు అందెలు 

రవ్వల పాపిట బొట్టు ముంగెర సమముగా ధరియించు తల్లికి


3) ఇంత పరాకేలననరే - రుద్రుని దేవికి 

చెంతనుండి పూజాసేయరే 

చెంతనుండి పూజసేయరే శంకరి ఓంకార రూపికి 

కుంకుమాంకిత అలంకారికి పొంకమైన శుభంకారికి


4) లక్ష వత్తుల జ్యోతి కూర్చరే - చెలులారా మీరు 

పచ్చల పళ్లెరము వాల్చరే 

రక్షితంబుగాను ఈరే దాక్షిరంబుగ హారతులను

రాక్షస సంహారికిపుడు ముచ్చటలరగ పాడుకొనుచు


5) మంగళ హారతినీయరే - మా తల్లికి 

దివ్య మంగళాదేవికి 

దివ్య మంగళా దేవి - దీనజన కల్పవల్లి 

సర్వలోక జననియైన బంగారు తల్లికిపుడు


6) వేదములకు అందరాని మహిమా జ్యోతి 

ఆదిశక్తి స్వరూపిణి - అంబ 

మూడు శక్తులకెల్లను తా( మూలమై వెలగుచుండి

మూడు లోకంబులను బ్రోచునట్టి మా బంగారుతల్లికి 



Wednesday, 27 January 2016

Itti muddulaadi - Annamacharya keerthana


Raagam: Aananda Bhairavi
Thaalam: Aadi


ఇట్టి ముద్దులాడి బాలుడేడ వాడు - వాని
పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు వోయరే

కామిడై పారిదెంచి కాగెడి వెన్నల లోన
సేమపు కడియాల చేయి పెట్టి
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార
వేమరు వాపోవు వాని వెడ్డు వెట్టరే

ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి
అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ పట్టి వాని తలకెత్తరే

iTTi muddulADi bAluDEDa vADu - vAni
paTTi tecci poTTa ninDa pAlu vOyarE

kAmiDai pAridenci kAgeDi vennala lOna
sEmapu kaDiyAla cEyi peTTi
cIma kuTTenani tana cekkiTa kannIru jAra
vEmaru vApOvu vAni veDDu veTTarE

eppuDu vaccenO mA illu cocci peTTelOni
cepparAni ungarAla cEyi peTTi
appaDaina venkaTAdri asavAlakuDu gAna
tappakunDa paTTi vAni talakettarE

Itti muddulaadi baaludaeda vaadu - vaani
patti thecchi potta ninda paalu voyarey

kaamidai paaridenchi kaagedi vennala lona
saemapu kadiyaala cheyi petti
cheema kuttenani thana chekkita kanneeru jaara
vaemaru vaapovu vaani veddu vettarey

eppudu vaccheno maa illu chocchi petteloni
chepparaani ungaraala cheyi petti
appadaina venkataadri asavaalakudu gaana
thappakunda patti vaani thalakettharey

Image result for butter krishna