Showing posts with label Pelli paatalu. Show all posts
Showing posts with label Pelli paatalu. Show all posts

Saturday, 20 April 2024

Emi Vindammaa - Pelli bhojanaala paata

 ఏమి విందమ్మా ఇది ఏమి తంతమ్మా


విస్తళ్ళని వియ్యాలవారు విరివిగాను ఆడిగితేను

విస్తళ్లేవని వియ్యపురాలు వీధి వీధి తిరిగిందంట


అల్పాహారమంటూ మేము ఎంతగానో ఆడిగితేను

అంతంతమాత్రంగా వడ్డించి ఖాళీ గిన్నెలు చూపించారు


పప్పు అని పెళ్ళివారు పలుమార్లు ఆడిగితేను

పప్పు లేదని వియ్యపురాలు పరుగు పరుగున పోయిందంట


కూరలు అని కుర్రవాళ్ళు కుదురుగాను ఆడిగితేను

కూరల్లేవని పెద్దత్తగారు కసిరికొట్టి పోయిందంట


పచ్చడి అని పెళ్ళివారు పలుమార్లు ఆడిగితేను

మిరపపళ్ల పచ్చడి వేసి మిక్కిలి సంతసించినారు


నెయ్యి అంటూ వియ్యాలవారు నెమ్మదిగాను ఆడిగితేను

నెయ్యి పుచ్చుకు వియ్యంకుడుగారు జాడి పట్టుకు జారిపోయే


ముక్కలు అంటూ పెళ్ళివారు మూసిముసిగాను ఆడిగితేను

ముక్కలు లేవని వియ్యపురాలు మూతిముడుచుకు పోయిందంట


పెరుగు అంటూ పెళ్ళివారు మర్యాదగాను ఆడిగితేను

మురుగు కంపు కొట్టేటువంటి మజ్జిగ పోసి పోయినారు


బూరెలు అని వియ్యాలవారు బుద్ధిగాను ఆడిగితేను

బూరెలు లేవని వియ్యపురాలు బుట్ట పట్టుకు వచ్చిందంట

Pellikoothuraa - Pellikoothuripai vyangyapu paata

 పెళ్లికూతురా పెంకితనమేలనే

పళ్ళు బయట పెట్టి ఫక్కున నవ్వుట తగునా


వన్నెలాడి గుడువా వయ్యారమేమందు

ఎన్నడూ చూడము మేటి జాణరో చాలా

Gowri/Seetha Kalyaana Vaibhogamey

 గౌరి కళ్యాణ వైభోగమే సీత కళ్యాణ సౌభాగ్యమే


దశరథ కౌసల్య వరపుత్రుడనగా, వర్ణించె జనకీవల్లభు చరిత


అరవిందనాభుని అలంకారము చేసి

జనకుని పుత్రికతో సరసముగా నేడు


చిలికించి చిరునవ్వు తళుకు ముఖమున

పలుమారు తెచ్చిన పరంధాముడితడు


అలకరే పొయ్యరే అరుగుల మీద

చిలకరే కస్తూరి చిత్రంబుగాను


ముత్యాల పగడల ముగ్గులుపెట్ట

అత్యుత్తమముగా పెండ్లి అరుగుదానమరే


అంబరము నుండి అమరులు చూడ

సంభ్రమముగా బంధు జనులెల్ల పొగడ

Nalugulaarinchudi - Nalugu paata

 నలుగు నారించుడి నారీ జానకికీ 

అలరుబోణిరో నల్లిద అబ్జనాథునికీ.


1) నవనీత దధి చోర రయమును రారా.

 కౌసల్య తనయ నీవురమమున రారా 

నలుగిడరావయ్య నారీమణితోని.


2) తిలకంబు మోమున దిద్దేర ఇపుడు 

చలమున దయతోడ సెలవీయవలదా


3) పన్నీరు గంధము అలదేరా ఇపుడు

 ఇందువదన నీదు కంధర మునకు


4) అరుదైన విరజాజి సరములు నీకికను

 సరసములో కూర్చుని ధరియించు మెడలో


5) పసుపున నలుగిడరే శ్రీపతిమోమునకు పడతిమోమున రామ పసుపున నల్గెడు


7) ఒప్పుతో తీర్చుద ఒక దృష్టి వెలసె

 ప్రాపుతో తీర్చురా పరదృష్టి లేకనే


8) అప్పుళ్ళు చప్పుళ్ళు అనుమానింప 

పప్పడాల చప్పుళ్ళు వరవీడనేమో.

Wednesday, 23 August 2023

Siggari Pendlikoothuraa - Annamacharya Keerthana



Raagam: Kaapi

Thaalam: Trisra jaathi Aadi Thaalam


Siggari pendlikoothuraa Seethamma

Daggari singaara bomma thala vanchakammaa


1) Allanaade Raaghavudu haruvillu virichenu

Elli nede pendlaadinidivo ninnu

Ellagaa Janakundu ninnicchinata veedey

Vellivirineemaata vinavammaa


2) Adey pendlithera etthi randaney Vasisthudundi

chadivi manthraalu sesa challenammaa

Modala Raamuni kantey munchi thalambraalu vosi

Sudathi aathani momu choodavammaa


3) Kankana daaraalu katti kaalu dokkithivi meeru

Ponkaana buvvamandaro potthulanammaa

Vunkuva vaavilipaati nundi Sri Venkatagiri

Thenkula ninnu goodi thiramaayenammaa


సిగ్గరి పెండ్లికూతురా సీతమ్మా

దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మా 


1) అల్లనాడే రాఘవుడు హరువిల్లు విరిచెను

ఎల్లి నేడే పెండ్లాడినిదివో నిన్ను

ఎల్లగా జనకుండు నిన్నిచ్చినట వీడే

వెల్లివిరినీమాట వినవమ్మా


2) అదె పెండ్లితెర ఎత్తి రండనే వశిష్ఠుడుండి

చదివి మంత్రాలు సేస చల్లేనమ్మా

మొదల రాముని కంటే ముంచి తలంబ్రాలువోసి

సుదతి ఆతని మోము చూడవమ్మా


3) కంకణ దారాలు కట్టి కాలు దొక్కితివి మీరు

పొంకాన బువ్వమందరో పొత్తులనమ్మా 

వుంకువ వావిలిపాటి నుండి శ్రీవేంకటగిరి

తెంకుల నిన్నుగూడి తిరమాయెనమ్మా


Thursday, 25 May 2023

Appaginchuchuntimi - Appaginthala Paata - Pelli Paata

Raagam: Sahana

Thaalam: Aadi

Lyricist: M. Manikyamba Gaaru

Music: Smt. Sobha Chaturvedula

ప) అప్పగించుచుంటిమి అపరంజిని - మా ఇంటి ఆనంద మంజరిని మీకు

1) మా కంటి పాప ఇది మమ్మంటి మసలేనె - వదిలుండుటన్నది ఏలాగునే మాకు

2) అత్తమామలికపై అమ్మనాన్నలే గాన - అందాల కాపురం ఆనంద నిలయమై

3) చిలకా గోరింకలై చిట్టితల్లి కాపురం - మాణిక్య శోభల దీవించ రారమ్మా

Wednesday, 24 May 2023

Poyi Raave Thalli - Appaginthala Paata - Pelli Paata

ప) పుట్టింటి సీతమ్మ అత్తింటికెళుతుంటే - మంచి మాటలు చెప్పు భూదేవి తల్లి

1) నీతి వాక్యములను నిర్మించి చెప్పెద - ఖ్యాతిలోనుంచుము నాతిరో నీవు

2) అత్తమామలతోడ హర్షంబు కలిగి - అణకువతో నీవు సంచరించవమ్మా

3) పతితోటి స్నేహముగా మాటలాడమ్మా - మతిమంతురాలవై మసలు మాయమ్మా

4) అంతరంగమునందు భీతి చెందకుమమ్మా - మా అందరికీ మంచి మాట తేవమ్మా

5) తల్లివలె అత్తను తండ్రివలె మామను - భావించి అతిబుద్ధి కలిగి ఉండమ్మా

6) పతి మాట నీ మాట ఒక్కటి కావాలి - అందమైన జంట మీది కావాలి

7) అమ్మరో నిన్ను పంపి ఎట్లుందుమమ్మా - మా గౌరవము నీవు బంగారు బొమ్మా

8) పోయిరావే పోయి రావమ్మా - వెయ్యేళ్ళు వర్ధిల్లు కనకంపు బొమ్మా

Monday, 22 May 2023

Kaburley gaanee kalividi erugani - Vinnapamula Swarajya Lakshmi



Lyricist: Smt. Vinnapamula Swarajya Lakshmi gaaru

Composer: Smt. Sobha Chaturvedula


Kaburley gaanee kalividi erugani

Kayyaala vaaru ee viyyaalavaariki

Vindu seyalemu memu meppu pondalemu

Abbabbaa veeri aagadamanthaa

cheppanalavi kaadu memu meppu pondalemu


Vantasaalalo vandina vantalu

Macchukainanu kanapadaledugaa

Uppu ledani udakaledani

Vankalakemi thakkuva ledugaa

Abbabbaa veeri aagadamanthaa

cheppanalavi kaadu memu meppu pondalemu


Muddumuddugaa muripaalenno

Mucchatagaanu cheddaamantey

Navvu mukhamu ledey vatti

chirruburruleney

Abbabbaa veeri aagadamanthaa

cheppanalavi kaadu memu meppu pondalemu


కబుర్లే గానీ కలివిడి ఎరుగని కయ్యాల వారీ వియ్యాలవారికి

విందుసేయలేము మేము మెప్పు పొందలేము

అబ్బబ్బ వీరి ఆగడమంతా

చెప్పనలవి కాదు మేము మెప్పు పొందలేము


వంటశాలలో వండిన వంటలు మచ్చుకైనను కనపడలేదుగా

ఉప్పు లేదని ఉడకలేదని వంకలలేమీ తక్కువ లేదుగా

అబ్బబ్బ వీరి ఆగడమంతా

చెప్పనలవి కాదు మేము మెప్పు పొందలేము


ముద్దుముద్దుగా మురిపాలెన్నో ముచ్చటగాను చేద్దామంటే

నవ్వు ముఖము లేదే వట్టి చిర్రుబుర్రులేనే

అబ్బబ్బ వీరి ఆగడమంతా

చెప్పనలవి కాదు మేము మెప్పు పొందలేము


Magapellivaarata - Pellikodukuni edipinchey paata - Pelli paata



Magapellivaarata <Gullapalli> vaarata

Pelliki tharali vacchinaarata

Veeru entho bhaagyavathulata


Coffeelu erugarata upmalu erugarata

Veeriki chaddannaalu ghanamaaye

Veeru entho bhaagyavathulata


Current deepaalerugarata gas lightlu erugarata

Veeriki kaagadaalu ghanamaaye

Veeru entho bhaagyavathulata


Pattucheeral erugarata addaala raikal erugarata

Veeriki chengaavi cheeralu ghanamaaye

Veeru entho bhaagyavathulata


మగపెళ్ళివారట <గుళ్ళపల్లి> వారట

పెళ్ళికి తరలి వచ్చినారట

వీరు ఎంతో భాగ్యవంతులట


కాఫీలు ఎరుగురట ఉప్మాలు ఎరుగరట

వీరికి చద్దన్నాలు ఘనమాయే

వీరు ఎంతో భాగ్యవంతులట


కరెంట్ దీపాలు ఎరుగరట గ్యాస్ లైట్లు ఎరుగరట

వీరికి కాగడలు ఘనమాయే

వీరు ఎంతో భాగ్యవంతులట


పట్టుచీరల్ ఎరుగరట అద్దాలరైకల్ ఎరుగరట

వీరికి చెంగావి చీరలు ఘనమాయే

వీరు ఎంతో భాగ్యవంతులట

Tharali velle - Pallaki paata - Pelli paata



Composition: Smt. Vinjamuri (Avasarala) Anasuya Devi


Tharali velle pellikumaaruni pallakiyaa

Pellikumaarithe savaariyaa

Ohom ohom ohom ohom ohom

Ohom ohom ohom ohom ohom


Atthintiki chanu kotthakodali savaariyaa

Putthadi poovula pohalinchina savaariyaa

Ohom ohom ohom ohom ohom

Ohom ohom ohom ohom ohom


Menaa savaari muthyaala pallaki saagavey

Boyila paatala haayiga theluchu saagavey

Ohom ohom ohom ohom ohom

Ohom ohom ohom ohom ohom

తరలి వెళ్ళే పెళ్లికుమారుని పల్లకియా

పెళ్లికుమారితె సవారియా

ఒం ఒహొంహొం ఒం ఒహొంహొం ఒహోం

ఒం ఒహొంహొం ఒం ఒహొంహొం ఒహోం


అత్తింటికి చను కొత్తకోడలి సవారియా

పుత్తడి పూవుల పోహళించిన సవారియా

ఒం ఒహొంహొం ఒం ఒహొంహొం ఒహోం

ఒం ఒహొంహొం ఒం ఒహొంహొం ఒహోం


మేనా సవారీ ముత్యాల పల్లకి సాగవే

బోయిల పాటల హాయిగ తేలుచు సాగవే

ఒం ఒహొంహొం ఒం ఒహొంహొం ఒహోం

ఒం ఒహొంహొం ఒం ఒహొంహొం ఒహోం



Kotnammula dancharey - Pasupu kottey paata - Pelli Paatalu



Composition: Smt. Vinjamuri (Avasarala) Anasuya Devi


 Kotnammula dancharey

Korikalosageti Gopaaluni eduta


Suralu munulu chuttaalu gumigoodi

Karuna goruchu paadagaa manasu theera


Parama paavanudaina baala Gopaaludu

Vara Rukmini thoda sarasamaaduchu unda


Kaanthalu suratilu gaikoni visaraga

Entho santhoshamuna kaantha janakudunda


Dharanu Tirumala soori thalachaga varamidu

Narahari pelli nedu aramaralelaney


కొట్నమ్ముల దంచరే 

కోరికలొసగేటి గోపాలుని ఎదుట


సురలు మునులు చుట్టాలు గుమిగూడి 

కరుణ గోరుచు పాడగా మనసు తీర


పరమ పావనుడైన బాల గోపాలుడు

వర రుక్మిణి తోడ సరసమాడుచు ఉండ 


కాంతలు సురటీలు గైకొని విసరగా 

ఎంతో సంతోషమున కాంత జనకుడుండ


ధరను తిరుమలసూరి తలచగా వరమిడు 

నరహరి పెళ్ళి నేడు అరమరలేలనే 

E desaannunchi vacchaarayyaa - Pellikodukuni edipinchey paata - Pelli paata



Composition: Smt. Vinjamuri (Avasarala) Anasuya Devi


E desaannunchi vacchaarayyaa maa desaaniki

Maa chakkaani sree raghu sundari makkuva theeraga


BA MA chadivaadani meevaaru cheppiri - intha

Onamaalu raanivaadani erakkapothimi


Cheeralu sommulu pedathaarani meevaaru cheppiri

Intha naara guddalu pedathaarani erakkapothimi


Medalu middelu kalavaarani meevaaru cheppiri - intha

godalu leni poorillani erakkapothimi


Ravvalu muthyaal thesthaarani meevaaru cheppiri

pusthe bonthulu isthaarani erakkapothimi


ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి 

మా చక్కాని శ్రీ రఘు సుందరి మక్కువ తీరగా


BA MA చదివాడని మీవారు చెప్పిరి - ఇంత 

ఓనమాలు రానివాడని ఎరక్కపోతిమి


చీరలు సొమ్ములు పెడతారని మీవారు చెప్పిరి

ఇంత నారగుడ్డలు పెడతారని ఎరక్కపోతిమి


మేడలు మిద్దెలు కలవారని మీవారు చెప్పిరి - ఇంత

గోడలు లేని పూరిళ్ళని ఎరక్కపోతిమి


రవ్వలు ముత్యాల్ తెస్తారిని మీవారు చెప్పిరి

పుస్తె బొంతులు ఇస్తారని ఎరక్కపోతిమి

Poola Banthulaadeney - Poola Chendlaata - Pelli Paata



 Poola Banthulaadeney baala Rukmini Krishnulu

Melaina bangaarapu meda lopala nedu


Chaala santhasamugaa neelavenulella chooda

Bheri mrudangamulu bhoruna mroyagaa


Parakaaminulella vacchi naatyamulu seya

Virajaajulu mallelu sarasija sumamulu


పూల బంతులాడెనే బాల రుక్మిణి కృష్ణులు

మేలైన బంగారపు మేడ లోపల నేడు


చాలా సంతసముగా నీలవేణులెల్ల చూడ

భేరీ మృదంగములు భోరున మ్రోయగా


పరకామినులెల్ల వచ్చి నాట్యములు సేయ

విరజాజులు మల్లెలు సరసిజ సుమములు 




Saturday, 20 May 2023

Choodanentha srungaaramu - Pelli bhojanaala paata - Pelli paata



Pa) Choodanentha srungaaramu sudathiro Seethaa

Raamachandrula buvvamu


1) Hecchaina arataakuley thecchi vesinaarata

Cheppa sakyamu kaadatey cheliyaro vinavey


2) Sannabiyyapu annamata - Vanne meera soopamata

enno enno kooralata - kannero vinavey


3) Vadalantey vadalata

Mandayaana vinavey


ప) చూడనెంతో శృంగారము సుదతిరో సీతా

రామచంద్రుల బువ్వము


1) హెచ్చైన అరటాకులే తెచ్చి వేసినారట

చెప్పశక్యము కాదటే చెలియరో వినవే


2) సన్నబియ్యపన్నమట - వన్నెమీర సూపమట

ఎన్నో ఎన్నో కూరలట - కన్నెరో వినవే


3) వడలంటె వడలట - కడలేని హోళీలట

నడుమ నడుమ మండియల్ - మందయాన వినవే


Tuesday, 16 May 2023

Vindu chesinaaru viyyaala vaarinta - Pelli bhojanaala paata - Pelli Paata



విందు చేసినారు వియ్యాల వారింట

విందు మాట చెబితే వింతగా తోచును


పప్పు ఉడకలేదు, పులుసు కాగలేదు

అరటికాయ కూర పోపే అంటలేదు ॥విందు॥


ఎలాగు భోంచేతుము ఈ విందు మేమెలాగు భోంచేతుము

ఈ విందు మేమెలాగు భోంచేతుము

చాలా పెళ్లిళ్ళాయె ఇలాంటి విందు లేదు


వియ్యపురాలొచ్చి నెయ్యి వడ్డించింది

నెయ్యి వేయకుండా చేయి తడవలేదు ॥విందు॥


విస్తళ్ళు వేశారు చారెడేసి వెడల్పు లేవండీ

హస్తంబు కలుపుటకు ఔరౌరా చోటు లేదు ॥ఎలాగు॥


గొప్పగా వారింట్లో అప్పడాలొత్తారు

ఒక్క అప్పడమైనా వడ్డించి ఎరుగరు

గుమ్మడి వడియాలు అసలే కనపడలేదు

గొప్ప చూడబోతే చెప్పనలవి కాదు ॥విందు॥


కూరే వంకాయ కూర దానిలోకి మార్చే పచ్చడి లేదు

కలహమ్ములతో తగవులు గుచ్చే తీరు ॥ఎలాగు॥


బూరెలొండినారు గంపకెత్తినారు

ఒక్క బూరె అయినా వడ్డించి ఎరుగరు ॥విందు॥


కొత్త బియ్యము వండిరి దానిలోకి ముద్దపప్పే వేసిరి

చెప్పుకుంటే సిగ్గవుతుంది - చెయ్యి కడిగిన సిగ్గే లేదు ॥ఎలాగు॥


లడ్డూ జిలేబీల పాకములో మడ్డి తేలిందంట

వడ్డించిన వదినగారి వడ్డాణము ఊడిపోయె ॥ఎలాగు॥


Vindu chesinaaru viyyaala vaarinta

Vindu maata chebithey vinthagaa thochunu


Pappu udakaledu, pulusu kaagaledu

Arati kaaya koora popey antaledu ||Vindu||


Elaagu bhonchethumu ee vindu memelaagu bhonchethumu

ee vindu memelaagu bhonchethumu

Chaalaa pellillaayey ilaati vindu ledu


Viyaapuraalocchi neyyi vaddinchindi

Neyyi veyakundaa cheyi thadavaledu ||Vindu||


Visthallu vesaaru chaaredesi vedalpu levandee

Hasthambu kaluputaku auraura chotu ledu ||Elaagu||


Goppagaa vaarintlo appadaalotthaaru

Okka appadamainaa vaddinchi erugaru

Gummadi vadiyaalu asaley kanpadaledu

Goppa choodabothey cheppanalavi kaadu ||Vindu||


Koorey vankaaya koora daaniloki maarchey pacchadi ledu

Kalahammulatho thagavulu gucchey theeru ||Elaagu||


Boorelondinaaru gampaketthinaaru

Okka boore ayinaa vaddinchi erugaru ||Vindu||


Kottha biyyamu vandiri daaniloki mudda pappey vesiri

Cheppukuntey siggavuthundi - Cheyyi kadigina siggey ledu ||Elaagu||


Laddoo jilebeela paakamulo maddi thelindanta

Vaddinchina vadinagaari vaddaanamu oodipoyey ||Elaagu||


Magapendlivaari inti - Magapellivaari gurinchi paata - Pelli paata

మగపెండ్లివారి ఇంటి వరుసలెన్న
వరుసలెన్న మాతో సరసమెన్న

విందుకి రమ్మని పిలచినగాని
విసుగుచున్నది వియ్యపురాలు

సుకుమారి చిన్నత్తగారి సూటి తెలిసెనుగా
సూటి తెలిసెనుగా వీరి గోటు తెలిసెనుగా

కట్టములు చాలవనుచు కఠినముగ వియ్యంకుడుగారు
పట్టుదలతో పెదమామగారు పట్టుపట్టిరి
పట్టుబట్టిరి గానీ పట్టు సాగదుగా

లాంఛనములు చాలవనుచు సద్దుచేసిరి ఆడపడుచులు
మాట్లాడరుగా పెండ్లికొడుకు మాటకైనా
మాతో వరసకైనా

Maga pendlivaari inti varusalenna
Varusalenna maatho sarasamenna

Vinduki rammani pilachinagaani
visuguchunnadi viyyapuraalu

Sukumaari chinnatthagaari sooti thelisenugaa
Sooti thelisenugaa veeri gotu thelisenugaa

Kattamulu chaalavanuchu kathinamuga viyyankudu gaaru
pattudalatho pedamaamagaaru pattu pattiri
pattubattiri gaani pattu saagadugaa

Laanchanamulu chaalavanuchu saddu chesiri aadapaduchulu
Maatlaadarugaa pendlikoduku maatakainaa
maatho varasakainaa

Kalyanamu Choothamu Raaramma - Pelli Paata



Aadi Thaalam:

Kalyaanamu choothamu raaramma Sri Seetha Ramula

Kalyaanamu choothamu raaramma


Misrachaapu Thaalam:

1) Hoyalu meeraga tharunulandaru

bayaluderiri haarathulatho

Disalu nindenu vaadya ravali

Minnu muttenu veda ghosha


2) Kusuma komali komma Janaki

Asamasaru sara pandepu bomma

Marati maarudey maa Sreeramudu

Eru pogadagalarintha vaibhavam


ఆదితాళం:

కళ్యాణము చూతము రారమ్మా శ్రీ సీతారాముల

కళ్యాణము చూతము రారమ్మా 


మిశ్రచాపు తాళం:

1) హొయలు మీరగ తరుణులందరు 

బయలుదేరిరి హారతులతో 

దిశలు నిండెను వాద్య రవళి 

మిన్ను ముట్టెను వేదఘోష 


2) కుసుమ కోమలి కొమ్మ జానకి 

అసమశరు శర పందెపు బొమ్మ

మరటి మారుడె మా శ్రీరాముడు

ఏరు పొగడగలరింత వైభవం 

Monday, 15 May 2023

Pasupu kumkuma pandlu - Eduru sannaahaala/ Edurukolla paata - Pelli paata



పసుపు కుంకుమ పండ్లు పడతులు పట్టిరి

పండుటాకుల మడుపు కాంతలు పట్టిరి

వేదగోష్ఠులతోను విప్రులు తరలిరి

పెండ్లివారు వచ్చిరని రాజుతో చెప్పిరి


శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము


పానకపు కావిళ్ళు పదునైదు పట్టుకువచ్చి

కౌసల్య సుమిత్ర రాజర్షి వచ్చె

గంధంబు పూసిరి గంధప్పొడి చల్లిరి

కట్నంబులిచ్చిరి వియ్యాలవారికి


శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము


కొబ్బరి చక్కెర కూర్మితోబెట్టిరి

విడిదిల్లు చూపించె విశ్రాంతి పొందుమని

నిద్రించు వియ్యాలవారు లేవండీ

ప్రొద్దునే లేవండి పొందికగా మీరు


శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము


మొగలిపూల వాసనలు ఈ బావి నీళ్ళు

ముఖాలు కడుక్కొనే వేళాయె లెండి

పొగడపూల వాసనలు మా బావి నీళ్ళు

ప్రాతః స్నానాలు చేయ వేళాయె లెండి


శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము


మల్లెపూల వాసనలు మా బావి నీళ్ళు

మాఘ స్నానాలు చేయ వేళాయె లెండి

కూరలు కాయలు గంపల్లో నింపి

శాకదానం చేయ వేళాయె లెండి


శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము


ఆవును లేగను స్తంభానికి కట్టి

గోదానము చేయ వేళాయె లెండి

మా చిన్న బాలను బుట్టలో పెట్టి

కన్యాదానము చేయ వేళాయె లెండి


శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము


పసుపు కుంకుమలంద పరుగున రండి

ఫలదానానికి వెలదిరో రండి

తాంబూల దానానికి తరలి రారమ్మా

కన్యాదానము చూడ కదలి రారమ్మా


శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము

తెలుగింటి పెండ్లి ఇది - శుభము శుభము


Pasupu kumkuma pandlu padathulu pattiri

Pandutaakula madupu kaanthalu pattiri

Vedaghoshthulathonu viprulu tharaliri

Pendlivaaru vacchirani raajutho cheppiri


Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu


Paanakapu kaavillu padunaidu pattukuvacchi

Kousalya Sumithra Raajarshiyu vacche

Gandhambu poosiri gandhappodi challiri

Katnambulicchiri viyyaalavaariki


Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu


Kobbari chakkera koormitho bettiri

Vididillu choopinche visraanthi pondumani

Nidrinchu viyyaalavaaru levandee

Proddunney levandi pondikagaa meeru


Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu


Mogalipoola vaasanalu ee baavi neellu

mukhaalu kadukkoni velaaye lendi

Pogadapoola vaasanalu maa baavi neellu

Praathah snaanaalu cheya velaaye lendi


Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu


Mallepoola vaasanalu maa baavi neellu

Maagha snaanaalu cheya velaaye lendi

Kooralu kaayalu gampallo nimpi

Saakadaanam cheya velaaye lendi


Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu


Avunu leganu sthambhaaniki katti

Godaanam cheya velaaye lendi

Maa chinna baalanu buttalo petti

Kanyaadaanamu cheya velaaye lendi


Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu


Pasupu kumkumalanda paruguna randi

Phaladaanaaniki veladiro randi

Thaamboola daanaaniki tharali raarammaa

Kanyaadaanamu chooda kadali raarammaa


Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu

Teluginti pendli idi - subhamu subhamu

Saturday, 13 May 2023

Aanandamaanandamaayeney - Pelli paata



Aanandamaanandamaayeney maa

Seethamma pellikoothuraayeney

Aanandamaanandamaayeney maa

Ramaiah pellikodukaayeney

Maa nomulannee nedu saphalamaayeney


1) Viyyaala vaarella vacchiri - vaaru

vididindlaki ethenchiri

Eduru sesalu challi enugulekki vacchinaaru


2) Pacchani pacchani pandillalonu

hecchaina Raamulavaaru vacchi koorchunnaaru


3) Janakundu Raama pooja chesiri - maa Jaanakiki koorchundabettiri

Jaanaki Raamula koorchobetti janulella murisinaaru


4) Jeelakarra bellamu Seethamma sirasunabetti

chakkaani Ramaiah chirunavvu navvinaaru


5) Rathnaala thaalibottu ramani kanthamuna kattaga

singaaraala Seethamma siggula moggai muriyanga


6) Thotalanta vellinaaru - mallepoolu thecchinaaru

Seethaa Raamulavaaru siridandalaadinaaru


ఆనందమానందమాయెనే మా

సీతమ్మ పెళ్లికూతురాయెనే

ఆనందమానందమాయెనే మా

రామయ్య పెళ్లికొడుకాయెనే

మా నోములన్నీ నేడు సఫలమాయెనే


1) వియ్యాల వారెల్ల వచ్చిరి - వారు విడిదిండ్లకి ఏతెంచిరి

ఎదురు సేసలు చల్లి ఏనుగులెక్కి వచ్చినారు


2) పచ్చని పచ్చని పందిళ్ళలోను

హెచ్చైన రాములవారు వచ్చి కూర్చున్నారు


3) జనకుండు రామ పూజ చేసిరి మా - జానకిని కూర్చుండబెట్టిరి

జానకిరాముల కూర్చోబెట్టి జనులెల్ల మురిసినారు


4) జీలకర్ర బెల్లము సీతమ్మ శిరసునబెట్టి

చక్కాని రామయ్య చిరునవ్వు నవ్వినారు


5) రత్నాల తాళిబొట్టు రమణి కంఠమున కట్టగ

సింగారాల సీతమ్మ సిగ్గుల మొగ్గై మురియంగ 


6) తోటలంట వెళ్లినారు - మల్లెపూలు తెచ్చినారు

సీతారాములవారు సిరిదండలాడినారు


Friday, 5 May 2023

Vivaramerugani viyyapuraaliki - Pelli paata (Vadina gaari paata)





Jalra settings used to record this song:

Count:4

Style: Basic 5

140 BPM

Pitch: B


Pa) Vivaramerugani viyyapuraaliki vididillu choopithimi

Vivaramerugani viyyapuraalu vididilo undadugaa


1) Agaru noone danthapu duvvena vididiki pampithimi

Thattathala gala viyyapuraalu thalaney duvvadugaa


2) Vendi chembulu paldomu pudakalu vididiki pampithimi

Paarapalla viyyapuraalu palley thomadugaa


3) Sannajaajulu malle moggalu vididiki pampithimi

Chinkiri thala gala viyyapuraalu pooley mudavadugaa


4) Banarasu cheera langee ravika vididiki pampithimi

Abbabbaa maaku alavaatu ledani vaapasu pampithiri


5) Manchi karpoorapu dandala mem vididiki pampithimi

Konga meda gala viyyapuraalu dandey veyadugaa


6) Thamalapaaku chekkalu memu vididiki pampithimi

Goggi palla viyyapuraalu aakey veyadugaa


ప) వివరమెరుగని వియ్యపురాలికి విడిదిల్లు చూపితిమి

వివరమెరుగని వియ్యపురాలు విడిదెను ఉండదుగా


1) అగరు నూనె దంతపు దువ్వెన విడిదికి పంపితిమి

తట్టతల గల వియ్యపురాలు తలనే దువ్వదుగా


2) వెండి చెంబులు పళ్దోము పుడకలు విడిదికి పంపితిమి

పారపళ్ళ వియ్యపురాలు పళ్ళే తోమదుగా


3) సన్నజాజులు మల్లెమొగ్గలు విడిదికి పంపితిమి

చింకిరి తలగల వియ్యపురాలు పూలే ముడవదుగా


4) బనరసు చీర లంగీ రవిక విడిదికి పంపితిమి

అబ్బబ్బా మాకలవాటు లేదని వాపసు పంపితిరి


5) మంచి కర్పూరపు దండల మేం విడిదికి పంపితిమి

కొంగ మెడగల వియ్యపురాలు దండే వేయదుగా


6) తమలపాకు చెక్కలు మేము విడిదికి పంపితిమి

గొగ్గిపళ్ళ వియ్యపురాలు ఆకే వేయదుగా