ఏమి విందమ్మా ఇది ఏమి తంతమ్మా
విస్తళ్ళని వియ్యాలవారు విరివిగాను ఆడిగితేను
విస్తళ్లేవని వియ్యపురాలు వీధి వీధి తిరిగిందంట
అల్పాహారమంటూ మేము ఎంతగానో ఆడిగితేను
అంతంతమాత్రంగా వడ్డించి ఖాళీ గిన్నెలు చూపించారు
పప్పు అని పెళ్ళివారు పలుమార్లు ఆడిగితేను
పప్పు లేదని వియ్యపురాలు పరుగు పరుగున పోయిందంట
కూరలు అని కుర్రవాళ్ళు కుదురుగాను ఆడిగితేను
కూరల్లేవని పెద్దత్తగారు కసిరికొట్టి పోయిందంట
పచ్చడి అని పెళ్ళివారు పలుమార్లు ఆడిగితేను
మిరపపళ్ల పచ్చడి వేసి మిక్కిలి సంతసించినారు
నెయ్యి అంటూ వియ్యాలవారు నెమ్మదిగాను ఆడిగితేను
నెయ్యి పుచ్చుకు వియ్యంకుడుగారు జాడి పట్టుకు జారిపోయే
ముక్కలు అంటూ పెళ్ళివారు మూసిముసిగాను ఆడిగితేను
ముక్కలు లేవని వియ్యపురాలు మూతిముడుచుకు పోయిందంట
పెరుగు అంటూ పెళ్ళివారు మర్యాదగాను ఆడిగితేను
మురుగు కంపు కొట్టేటువంటి మజ్జిగ పోసి పోయినారు
బూరెలు అని వియ్యాలవారు బుద్ధిగాను ఆడిగితేను
బూరెలు లేవని వియ్యపురాలు బుట్ట పట్టుకు వచ్చిందంట
No comments:
Post a Comment