Showing posts with label Mohana. Show all posts
Showing posts with label Mohana. Show all posts

Thursday, 23 October 2025

Mohana Raaga Raagini - Light Music Song - Dr. Boyi Bheemanna



Jalra settings used to record this song:
Count: 3
Style: Basic 3
Speed: 70 BPM
Pitch: B

Lyrics: Dr. Boyi Bheemanna
Music: Dr. M.Chittaranjan

Raagam: Mohana
Thaalam: Roopaka

Pa) Mohana raaga raagini Moha vaahini snehamohini

1) Kusuma saruni saramulu naa - gunde naati viriseney
Virisina poodotagaa nee - charana seema cherithiney

2) Poovulenni unnagaani - neevu leka vasanthamaa
Nee mohanaloni mohiniki naa-kintha dooramaa

3) Davvulalo nee ruchulu - kavvinchunu kshanamu kshanamu
kshanamey yugamayye niree-kshanamey brathukayye gadey

ప) మోహన రాగరాగిణి - మోహవాహిని స్నేహమోహిని

1) కుసుమశరుని శరములు నా - గుండె నాటి విరిసెనే
విరిసిన పూదోటగా నీ - చరణసీమ చేరితినే

2) పూవులెన్ని యున్నగాని - నీవులేక వసంతమా
నీ మోహనలోని మోహినికి - నాకింత దూరమా

3) దవ్వులలో నీ రుచులు - కవ్వించును క్షణము క్షణము
క్షణమే యుగమయ్యే నిరీక్షణమే బ్రతుకయ్యెగదే


Monday, 20 October 2025

Desamunu Preminchumannaa - Patriotic Song - Sri Gurazada Apparao



Raagam: Mohana
Thaalam: Triputa

Lyrics: Sri Gurazada Apparao
Music: Traditional

Pa) Desamunu preminchumannaa
Manchiyannadi penchumannaa
Vatti maatalu kattipettoy
Gatti mel thalapettavoy

1) Paadipantalu pongiporley
Daarilo nuvu paatupadavoy
Thindi kaligithey kanda kaladoy
Kanda kalavaadenu manushoy

2) Sontha laabham kontha maanuku
poruguvaariki thodu padavoy
Desamantey matti kaadoy
Desamantey manushuloy

3) Chettapattaal pattukoni de-
sasthulanthaa naduvavalenoy
Annadammula valenu jaathulu
mathamulannee melagavalenoy


ప) దేశమును ప్రేమించుమన్నా - మంచియన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్ - గట్టి మేల్ తలపెట్టవోయ్

1) పాడిపంటలు పొంగిపొర్లే - దారిలో నువు పాటుపడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్

2) సొంత లాభం కొంత మానుకు - పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుషులోయ్

3) చెట్టపట్టాల్ పట్టుకొని దే-శస్తులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు - మతములన్నీ మెలగవలెనోయ్


Wednesday, 5 March 2025

Evaruraa - Thyagaraja Krithi





ప) ఎవరురా నిను వినా గతి మాకు

అను) సవన రక్షక నిత్యోత్సవ సీతాపతి

చ) రాజా బిగువు నీకేలరా త్యాగరాజార్చిత పాద

తాళజాలరా రామ ఈ జాలముసేయ

రాజా బ్రోవ సంకోచమా సురభూజమా మాకు


Pa) Evaruraa ninu vinaa gathi maaku

Anu) Savana rakshaka nithyothsava Seethapathi

Cha) Raajaa biguvu neekelaraa

Thyagaraajaarchitha paada

Thaalajaalaraa Rama ee jaalamuseya

Raajaa brova sankochamaa

Sura bhoojamaa maaku
 

Thursday, 20 February 2025

Thene vanti bhaasha okka Teluge Teluge - Telugu Light Music Song



Raagam: Raagamalika (Kalyani, Abheri, Mohana, Desh)

Thaalam: Aadi Thaalam (Trisra Gathi)


Jalra settings used to record this song:

Count: 3

Style: Basic 3, Basic 4, Basic 5

Speed: 130 BPM

Pitch: D#


Pa) Thene vanti bhaasha okka Teluge Teluge

Idi thelisina Telugu brathuku malagani veluge


1) RaanMahendra Godavari rasa tharangamula theli

Rayalu mosina bangaru pallakipai ooregi

Maatalalo viri thenela theneloluku Teluguvaani

Jnaanapeetha bahumaanamulandinadi Mahaandhravaani


2) Arava nota Telugu paata palikinchenu Thyagayya

Kannada Saivulakaandhramu nerpinchenu Somayya

Amaraavathi nagaramlo silpamgaa poochi

Narayanadasu lona Harikathagaa thochi


3) Dwaram kara padmamulo vaayuleenamuga saagi

Sangameswaruni chengata veeniyagaa mrogi

Kuchipudi naatyamlo kulukulupacharinchi

Eda edalo venuvulai anuvanuvuna veeniyalai


4) Kalaa Bharathi noopura ghalanghanalu maarmrogaga

Avani rasaananda vivasayai Andhrini keerthinchenu


ప) తేనెవంటి భాష ఒక్క తెలుగే తెలుగే

ఇది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే


1) రాణ్మహేంద్ర గోదావరి రస తరంగముల తేలి

రాయలు మోసిన బంగరు పల్లకిపై ఊరేగి

మాటలలో విరితేనెల తేనెలొలుకు తెలుగువాణి

జ్ఞానపీఠ బహుమానములందినది మహాంధ్రవాణి


2) అరవ నోట తెలుగు పాట పలికించెను త్యాగయ్య

కన్నడ శైవులకాంధ్రము నేర్పించెను సోమయ్య

అమరావతి నగరంలో శిల్పంగా పూచి

నారాయణదాసులోన హరికథగా తోచి


3) ద్వారం కరపద్మములో వాయులీనముగా సాగి

సంగమేశ్వరుని చెంగట వీణియగా మ్రోగి

కూచిపూడి నాట్యంలో కులుకులుపచరించి

ఎద ఎదలో వేణువులై అణువణువున వీణియలై


4) కళాభారతి నూపుర ఘలంఘనలు మార్మ్రోగగ

అవని రసానంద వివశయై ఆంధ్రిని కీర్తించెను


Friday, 12 January 2024

Characteristics of Mohana Raaga - మోహన రాగ లక్షణములు

  • ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగజన్యము.

    ఆరోహణ సరిగపదస.

    అవరోహణ స.దపగరిస


    శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, పంచమము, చతుశృతి దైవతము

    లక్షణములు: డవ రాగము. ఉపాంగ రాగము. వర్జ్య రాగము. ఆరోహణ, అవరోహణములలో మధ్యమ నిషాదములు వర్జ్య స్వరములు. సర్వస్వర గమకవరిక రక్తిరాగము.

    గగపపదదస.స. అను జంటలు, గగరిసదప, గరిసదప, గదపగరి, రిపగరిస అను దాటువులు ప్రసిద్ధ అలంకారములు. ప్రసిద్ధమైన రాగము. వ్యాప్తి చెందిన రాగము. వీరరసము కలిగిన రాగము. అన్ని రకములైన రచనలూ ఈ రాగమునందు రచింపబడినవి. అన్ని వేళలా పాడదగిన రాగము. కానీ రాత్రి పాడుట సమంజసము. శ్లోకములు, పద్యములు పాడదగిన రాగము. హిందుస్తానీ సంగీతంలో ఈ రాగమునకు “భూప్” అని పేరు.

    రచనలు:

    గీతము: వరవీణ - రూపకతాళం - అప్పయ్య దీక్షితార్

    వర్ణములు: నిన్నుకోరి - ఆదితాళం - రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్

    సరసిజాక్షి - అటతాళం - వీణ కుప్పయ్యర్

    కృతులు: భవనుత, ననుపాలింప - ఆదితాళం - త్యాగరాజు

    ఎవరురా - మిశ్రచాపు - త్యాగరాజు


  • Mohanam is a Janya Raagam of Hari Kambhoji which is the 28th Melakartha raagam.
  • Another school pf thought claims that it is the Janya raagam of Kalyani which is the 68th Melakartha raagam.
  • It is an Audava Audava Upaanga Raagam (It has a pentatonic scale).
  • Moorchana of Mohanam is
    • S R₂ G₃ P D₂ 
    •  D₂ P G₃ R₂ S
  • The swara sthaanas in Mohanam are
    • shadjam
    • chathusruthi rishabham
    • anthara gaandhaaram
    • panchamam
    • chathusruthi dhaivatham
  • It is a Varjya raagam (Madhyamam and Nishaadam are absent).

  • Its Hindustani equivalent is Bhoop (or Bhopali)/ Dheshkar.
  • It is one of the most common pentatonic scales across the world and is very popular in East Asian and Southeast Asian music, including China and Japan.
  • It is the National Raaga of China. Most of the Chinese songs are based on this raaga.
  • It has good scope for neravalu, sanchaaram and aalaapana.
  • The main rasa evoked by this raga are shourya, upahuthi (challenge), shringara and karunya.
  • Mohanam raagam lends itself to extensive elaboration and exploration and has many classical music and film music compositions.
  • The most auspicious time to sing Mohanam is in the night, but it can be sung at all times.
  • Popular compositions in Mohanam are:
    • Varaveena mridupani - Geetham
    • Ninnukori composed by Poochi Srinivasa Iyengar is a popular Varnam in this scale.
    • Cheri Yasodaku Sisuvithadu -  Annamacharya
    • Podagantimayya -  Annamacharya
    • Nannu palimpa - Thyagaraja
    • Dayarani - Thyagaraja
    • Rama ninnu nammina - Thyagaraja
    • Evarura ninnuvina - Thyagaraja
    • Bhavanutha - Thyagaraja
    • Kshemam Kuru - Narayana Theertha
    • Swagatham Krishna - Oottukkadu Venkata Kavi

Thursday, 19 January 2023

Achyutashtakam - Sri Aadi Sankaracharya



Raagam: Mohana

Thaalam: Eka


1) Achyutham Kesavam Raama Naaraayanam

Krishna Daamodaram Vaasudevam Harim

Sreedharam Maadhavam Gopikaa vallabham

Jaanakee Naayakam Raamachandram bhajey


2) Achyutham Kesavam Sathyabhaamaadhavam

Maadhavam Sreedharam Raadhikaaraadhitham

Indiraa mandiram chethasaa sundaram

Devakee nandanam Nandajam sandadhey


3) Vishnavey Jishnavey Sankhiney Chakriney

Rukminee raaginey Jaanakee jaanayey

Vallavee vallabhaayaarchithaayaathmaney

Kamsa vidhvamsiney Vamsiney they namah


4) Krishna Govinda hey Raama Naaraayana

Sreepathey Vaasudevaajitha Sreenidhey

Achyuthaananda hey Maadhavaadhokshaja

Dwaarakaanaayaka Draupadee rakshaka


5) Raakshasa kshobhithaha Seethayaa sobhitho

Dandakaaranya bhoopunyathaakaaranam

Lakshmanenaanvitho vaanaraissevitho

-gasthya sampoojitho Raaghavah paathumaam


6) DhenukaarishtakonishtakRdhveshinaam

Kesihaa Kamsa hRdwamsikaavaadakah

Poothanaa kopakah soorajaa khelano

Baala Gopaalakah paathumaam sarvadaa


7) Vidyududyothavath prasphuradvaasasam

praavRdambhodavath prollasadvigraham

vanyayaa maalayaa sobhithorastthalam

lohithaanghridvayam Vaarijaaksham bhajey


8) Kunchithaih kunthalairbhraajamaanaananam

rathnamoulim lasathkundalam gandayoh

haara keyoorakam kankanaprojjvalam

kinkinee manjulam shyaamalam tham bhajey


9) Achyuthasyaashtakam yah pathedishtadam

premathah prathyaham poorushah saspRham

vRtthathassundaram vedya viswambharam

thasya vasyo harirjaayathey sathvaram


1) అచ్యుతం కేశవం రామ నారాయణం

కృష్ణ దామోదరం వాసుదేవం హరిం

శ్రీధరం మాధవం గోపికావల్లభం

జానకీనాయకం రామచంద్రం భజే


2) అచ్యుతం కేశవం సత్యభామాధవం

మాధవం శ్రీధరం రాధికారాధితం

ఇందిరామందిరం చేతసా సుందరం

దేవకీనందనం నందజం సందధే


3) విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే

రుక్మిణీ రాగిణే జానకీ జానయే

వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే

కంస విధ్వంసినే వంశినే తే నమః


4) కృష్ణ గోవింద హే రామ నారాయణ

శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే

అచ్యుతానంద హే మాధవాధోక్షజ

ద్వారకానాయక ద్రౌపదీరక్షక


5) రాక్షస క్షోభితః సీతయా శోభితో

దండకారణ్య భూపుణ్యతాకారణం

లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితో

-గస్త్య సంపూజితో రాఘవః పాతుమాం


6) ధేనుకారిష్టకోనిష్టకృధ్వేషిణాం

కేశిహా కంసహృద్వంశికావాదకః

పూతనాకోపకః సూరజాఖేలనో

బాలగోపాలకః పాతు మాం సర్వదా


7) విద్యుదుద్యోతవత్ ప్రస్ఫురద్వాససం

ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహం

వన్యయా మాలయా శోభితోరస్స్థలం

లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే


8) కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం

రత్నమౌళిం లసత్కుండలం గండయోః

హార కేయూరకం కంకణప్రోజ్జ్వలం

కింకిణీ మంజులం శ్యామలం తం భజే


9) అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం

ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్

వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం

తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్


Monday, 14 November 2022

Varaveena Mrudupaani - Sanchaari Geetham Appaiah Deekshitar

Raagam: Mohana

Thaalam: Roopaka





Varaveena mrudupaani
Vanaruha lochanu raani
Suruchira bambhara veni
Suranutha kalyaani
Nirupama subha guna lola
Niratha jayaprada seela
Varada Priya Ranganaayaki
Vaanchitha phaladaayaki
Sarasijaasanu janani
Jaya jaya jaya Srivani (Pradaseela)

వరవీణ మృదుపాణి 
వనరుహ లోచను రాణి 
సురుచిర బంభరవేణి
సురనుత కళ్యాణి
నిరుపమ శుభ గుణ లోల 
నిరత జయప్రద శీల 
వరద ప్రియ రంగనాయకి 
వాంచిత ఫలదాయకి 
సరసిజాసను జనని
జయ జయ జయ శ్రీవాణి (ప్రదశీల)





Friday, 9 September 2022

Jaya jaya Bhaaratha jatheeya - Patriotic Song



Pa) Jaya jaya Bhaaratha jaatheeyaabhyudayaanandothsava subha samayam

Priyathama Bhaaratha janayithree chiradaasya vimochana navodayam


1) Proddu podiche levandoy - Nidra vidachi raarandoyi

Digdiganthamulu daddarillagaa nisvaanamu cheyandoyi


2) Hindu Muslim Kraisthava Parsee - eka vedikani nilavandi

Jaathulennaina desamokkatani loka sannidhini chaatandi


ప) జయ జయ భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభసమయం

ప్రియతమ భారత జనయిత్రీ చిరదాస్య విమోచన నవోదయం


1) ప్రొద్దు పొడిచె లేవండోయి - నిద్ర విడచి రారండోయి

దిగ్దిగంతములు దద్దరిల్లగా నిస్వానము చేయండోయి


2) హిందూ ముస్లిం క్రైస్తవ పార్శీ - ఏక వేదికను నిలవండి

జాతులెన్నైన దేశమొక్కటని లోక సన్నిధిని చాటండి

Thursday, 2 June 2022

Sri Gayathri Stotram - Sri Bharatam Srimannarayana

Lyrics: Sri Bharatam Srimannarayana

Music: Anupama Yeluripati

Raagam: Raaga Maalika (Hamsadhwani, Reethigowla, Mohana, Hindolam, Bilahari, Madhyamavathi)

Thaalam: Chuthurasra gathi Eka Thaalam, Khanda gathi Eka Thaalam





1) ఉదయాస్త మయాచల మధ్య చరత్

కమనీయ శరీర సుకాన్తిమతి!

కరుణా వరుణాలయ దివ్యకళే!

పరిపాలయ లోక మహో జనని!


ఉదయాస్తమయ పర్వతముల నడుమ గల భువనములందు విస్తరించియున్న శరీరకాంతులు కల్గినదానా! కరుణాసింధూ! ఓ గాయత్రీమాతా! నీ లోకములను నిత్యము రక్షించుకొనుము.


2) శుభ మేమి భవత్ పద మార్జనయా

సుఖమేమి భవత్ కర లాలనయా।

యశ ఏమి భవద్గుణ కీర్తనయా

ఋతమేమి భవన్మను చింతనయా॥


నీ పాదములను కడుగుట వలన శుభమును, నీ కరయుగ్మలాలనముచే సుఖమును, నీ గుణగానముచే కీర్తిని, నీ మంత్రజపముచే సత్యప్రవృత్తిని పొందుదునుగాక.


3) అధరీకృత కామగవీ చరితే!

ఉరరీకృత సాధు సుభక్తనుతే!

విదళీకృత దానవ దుష్ట గతే!

విశదీకృత మౌని మనః ప్రకృతే!


కామధేను చరిత్రను మించిన చరిత్ర నీది. భక్తుల నమస్కారములను అంగీకరించు శీలము నీది. దానవుల దుష్టతను తొలగించు ప్రవృత్తి నీది. మౌనుల మనఃప్రవృత్తులను తీర్చి దిద్దు కరుణ నీదే.


4) భవబంధన మోచన కేళి రతే

కరుణామృత సేచన భవ్యగతే

గతి ధిక్కృత గంధగజాధిపతే

శ్రుతి కీర్తిత దివ్య గుణ ప్రతతే


సంసార బంధమును తొలగించి, కరుణారసమును చిలికించి, గమనముచే గజాధిపతిని నిర్జించి శ్రుతులచే పొగడబడిన గుణసంపద గల తల్లీ నీకు ప్రణతులు.


5) సుజనీకృత సర్వ విరోధిపతే!

స్వజనీకృత నిశ్చల భక్త తతే!

ధ్వజినీకృత సర్వసతీ నివహే!

విజనీకృత సన్నుత కేళి గృహే!


నీ సర్వ విరోధులను సుజనులుగా మార్చుకొను నేర్పుగలదానవు. భక్తులను నీ స్వజనముగా స్వీకరించు ఔదార్యము కలదానవు. సతీవర్గమును నీకు సైనికవర్గముగా చేసికొనే సౌశీల్యము గలదానవు. నీ కేళి గృహమున మాత్రమెవ్వరికిని (నీ పతికి తక్క) స్థానము నీయని పతివ్రతవు.


6) తనుతాం తనుతాం మమ పాపశతమ్

భజతాం భజతాం విరతిం దురితమ్!

అయతామయతాం జన దుశ్చరితం

త్వసతా మసతాం నికృతం సుకృతమ్॥


నా పాపశతము క్షయమునందునుగాక! నీ భక్తుల పాపము శమించుగాక! జనుల దుష్కృత్యములు శుభకృత్యములగుగాక! దుర్జనుల చరితము నీ దయ వలన సుచరితమగుగాక!


7) వివిధాని వచాంసి వదేత్ జనతా

తవ నామ న కించిదపి స్మరతి

క్షమయా కృపయా పరిపాలయ తాం

జననీ యది కుప్యతి కః శరణమ్?


జనములలో చాలామంది ఏవేవో ప్రలాపములు చేయుదురే గానీ, నీ నామమును ఉచ్చరించువారెవ్వరును లేరు. వారి అజ్ఞానమును క్షమింపుము. తల్లియే కోపించిన బిడ్డలకిక దిక్కెవ్వరు?

8) హరి రుద్ర విరించి దివస్పతయో

గతయోగతయోపగతిమ్ దధతే।

యదినోపదిశేస్తదవశ్య విధీన్

జగతాం గతిరేతి తమః పటలమ్॥


త్రిమూర్తులు, ఇంద్రుడు యోగమార్గమున నిన్నే ధ్యానింతురు. వారి వారి కర్తవ్యములను ఎప్పటికప్పుడు తెలుపకపోయినచో లోకములన్నియు చీకటి మయమైపోవా?


9) వినా వేదమాత్రా, న ధాతా న విష్ణుః

న రుద్రో నచేంద్రో న సూర్యో నచన్ద్రః।

న తారా న లోకా న కాలా న వేదా

న శాస్త్రం న విద్యా న మంత్రో న తంత్రమ్॥


వేదమాత గాయత్రిని విడిచి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, లోకములు, కాలములు, వేదములు, శాస్త్ర-విద్యలు, మంత్ర-తంత్రములు వీని ఉనికియే లేదు.


10) బిభేత్యేవ వాయుస్త్వదగ్రే ప్రవాతుం

తపత్యేవ సూర్యో భయాత్ త్వత్సకాశే।

భియా చేంద్ర వహ్నీ త్వదాజ్ఞాం వహేతే

ప్రధావ త్యహో దూర దేశం స మృత్యుః॥


ఓ గాయత్రీ! నీ భయము వలననే వాయువు వీచుచున్నాడు. నీ భయము వలననే సూర్యుడు లోకములకు వెలుగునిచ్చుచున్నాడు. నీకు భయపడియే ఇంద్రుడు, అగ్ని, లోకపాలకత్వమును వహించుచున్నారు.


11) వృథా దేహదార్ఢ్యం వృథా వస్తు వృద్ధిః

వృథా పుత్ర పౌత్రాది చాయుర్వృథైవ।

వృథా తస్య జన్మాపి యస్త్వాం వివర్జ్య

యథేచ్ఛం ప్రవర్తేత విప్రోSపి భూత్వా॥


విప్రుడైయుండియు ఎవడు నిన్ను విడిచి యథేచ్ఛముగా లోకయాత్ర సాగించునో, వాని దేహసంపద, వస్తుసంపద, దారాపుత్రాది సంపద, ఆయుస్సంపద - చివరకు వాని జన్మము కూడ వ్యర్థములే.


12) స్త్రియా మన్త్ర పాఠాధికారో న చేత్ స్యాత్,

భవన్నిత్య పూజాధికారోSస్తి తంత్రాత్।

తథా శూద్ర జాతి స్తథై వాన్త్యజా వా,

భవత్ పూజనార్హాశ్చ తాన్ రక్ష మాతః॥


స్త్రీలకు, శూద్రులకు నీ మంత్రపాఠము విషయమున అధికారము లేకున్నను, తంత్ర విధానముచే నీ పూజాదికములు నిర్వర్తించు అధికారమున్నది. వారి పూజను స్వీకరించి, వారిని కూడా విప్రులవలెనే కాపాడుచుందువుగాక!


1) Udayaasthamayaachala madhya charath

Kamaneeya sareera sukaanthimathi!

Karunaa varunaalaya madhyakaley!

Paripaalaya loka mahojanani!


O light that bathes the earth between sunrises and sunsets, O ocean of love, O mother Gayatri, please protect your worlds.


2) Subhamemi bhavath pada maarjanayaa

Sukhamemi bhavath kara laalanayaa|

Yasa emi bhavadguna keerthanayaa

Rithamemi bhavanmanu chinthanayaa||


May those who wash your feet and hands get good fortune and happiness. May those who sing your virtues get glory, and may those who chant your mantra lead a righteous life.


3) Adhareekritha kaamagavee charithey!

Urareekritha saadhu subhakthanuthey!

Vidaleekritha daanava dushta gathey!

Visadeekritha mouni manah prakrithey!


As a giver, your fame is larger than Kamadhenu’s. You readily accept your devotees’ respect and love. Cleansing the evil in demons is your second nature. It is your grace that blesses ascetics to overcome fickleness of the mind.


4) Bhava bandhna mochana keli rathey

Karunaamritha sechana bhavyagathey

Gathi dhikkritha gandhagajaadhipathey

Sruthi keerthitha divya guna prathathey


You remove the shackles of samsara and the ill-effects of Gajadhipati, the sacred texts so glorify your virtues. I bow to you O mother.


5) Sujaneekritha sarva virodhipathey!

Swajaneekritha nischala bhaktha thathey!

Dhwajineekritha sarva sathee nivahey!

Vijineekritha sannutha keli grihey!


You turn every foe into a friend. You accept everyone as your own and they in turn shall willingly join your army if need be. You are a pativrata.


6) Thanuthaam thanuthaam mama paapasatham

Bhajathaam bhajathaam virathim duritham!

Ayathaam ayathaam jana duscharitham

Thwasathaam asathaam nikrithi sukritham||


May your devotees' sins wane. By your grace, may misdeeds become virtuous deeds and ignoble reputations become noble.


7) Vividhaani vachaamsi vadeth janathaa

Thava naama na kinchidapi smarathi

Kshamayaa kripayaa paripaalaya thaam

Jananee yadi kupyathi kah saranam?


Please countenance those who ignore to chant your name with devotion. Forgive their ignorance as a mother would.


8) Hari Rudra Virinchi divaspathayo

Gathayo gathayo pagathim dadhathey|

Yadinopadisesthadavasya vidheen

Jagathaam gathirethi thamah patalam||


The Trinity and Lord Indra pray to you through the path of Yoga and get guidance from you. Without that the worlds will fall into darkness.


9) Vinaa veda maathraa, na Dhaathaa na Vishnuh

Na Rudro na chendro na Suryo na Chandrah|

Na thaaraa na lokaa na kaalaa na vedaa

Na saasthram na vidyaa na manthro na thantham||


Without you O mother Gayatri, Brahma, Vishnu, Rudra, Indra, Surya, Chandra, the stars, the worlds, time, the vedas, knowledge, and mantra-tantra don’t exist.


10) Bibhethyeva vaayusthwadagrey pravaathum

Thapathyeva Suryo bhayaath thwathsakaasey|

Bhiyaa chendra vahnee thwadaajnyaam vahethey

Pradhaava thyaho doora desam sa mrithyuh||


O Gayatri, it is the fear of you that makes Vayu give air and Surya give light. It is the fear of you that makes Indra and Agni fulfil their responsibilities as rulers of the world.


11) Vrithaa dehadaardhyam vrithaa vasthu vriddhih

Vrithaa puthra pouthraadi chaayurvrithaiva|

Vrithaa thasya janmaapi yasthwaam vivarjya

Yatheccham pravarthetha vipropi bhoothwaa||


A person of knowledge who turns a blind eye to you, such a person's riches like good health, wealth, family, longevity, including the very birth itself, are in vain.


12) Sthriyaa manthra paathaadhikaaro na cheth syaath,

Bhavannithya poojaadhikaarosthi thanthraath|

Thathaa soodra jaathi sthaivaanthyajaa vaa,

Bhavath poojanaarhaascha thaan raksha maathah||


Although women and shoodras cannot pray to you in the mantra form, they can worship you in the tantra method through rituals. Please accept their prayers and protect them too.