Thursday, 2 June 2022

Sri Gayathri Stotram - Sri Bharatam Srimannarayana

Lyrics: Sri Bharatam Srimannarayana

Music: Anupama Yeluripati

Raagam: Raaga Maalika (Hamsadhwani, Reethigowla, Mohana, Hindolam, Bilahari, Madhyamavathi)

Thaalam: Chuthurasra gathi Eka Thaalam, Khanda gathi Eka Thaalam





1) ఉదయాస్త మయాచల మధ్య చరత్

కమనీయ శరీర సుకాన్తిమతి!

కరుణా వరుణాలయ దివ్యకళే!

పరిపాలయ లోక మహో జనని!


ఉదయాస్తమయ పర్వతముల నడుమ గల భువనములందు విస్తరించియున్న శరీరకాంతులు కల్గినదానా! కరుణాసింధూ! ఓ గాయత్రీమాతా! నీ లోకములను నిత్యము రక్షించుకొనుము.


2) శుభ మేమి భవత్ పద మార్జనయా

సుఖమేమి భవత్ కర లాలనయా।

యశ ఏమి భవద్గుణ కీర్తనయా

ఋతమేమి భవన్మను చింతనయా॥


నీ పాదములను కడుగుట వలన శుభమును, నీ కరయుగ్మలాలనముచే సుఖమును, నీ గుణగానముచే కీర్తిని, నీ మంత్రజపముచే సత్యప్రవృత్తిని పొందుదునుగాక.


3) అధరీకృత కామగవీ చరితే!

ఉరరీకృత సాధు సుభక్తనుతే!

విదళీకృత దానవ దుష్ట గతే!

విశదీకృత మౌని మనః ప్రకృతే!


కామధేను చరిత్రను మించిన చరిత్ర నీది. భక్తుల నమస్కారములను అంగీకరించు శీలము నీది. దానవుల దుష్టతను తొలగించు ప్రవృత్తి నీది. మౌనుల మనఃప్రవృత్తులను తీర్చి దిద్దు కరుణ నీదే.


4) భవబంధన మోచన కేళి రతే

కరుణామృత సేచన భవ్యగతే

గతి ధిక్కృత గంధగజాధిపతే

శ్రుతి కీర్తిత దివ్య గుణ ప్రతతే


సంసార బంధమును తొలగించి, కరుణారసమును చిలికించి, గమనముచే గజాధిపతిని నిర్జించి శ్రుతులచే పొగడబడిన గుణసంపద గల తల్లీ నీకు ప్రణతులు.


5) సుజనీకృత సర్వ విరోధిపతే!

స్వజనీకృత నిశ్చల భక్త తతే!

ధ్వజినీకృత సర్వసతీ నివహే!

విజనీకృత సన్నుత కేళి గృహే!


నీ సర్వ విరోధులను సుజనులుగా మార్చుకొను నేర్పుగలదానవు. భక్తులను నీ స్వజనముగా స్వీకరించు ఔదార్యము కలదానవు. సతీవర్గమును నీకు సైనికవర్గముగా చేసికొనే సౌశీల్యము గలదానవు. నీ కేళి గృహమున మాత్రమెవ్వరికిని (నీ పతికి తక్క) స్థానము నీయని పతివ్రతవు.


6) తనుతాం తనుతాం మమ పాపశతమ్

భజతాం భజతాం విరతిం దురితమ్!

అయతామయతాం జన దుశ్చరితం

త్వసతా మసతాం నికృతం సుకృతమ్॥


నా పాపశతము క్షయమునందునుగాక! నీ భక్తుల పాపము శమించుగాక! జనుల దుష్కృత్యములు శుభకృత్యములగుగాక! దుర్జనుల చరితము నీ దయ వలన సుచరితమగుగాక!


7) వివిధాని వచాంసి వదేత్ జనతా

తవ నామ న కించిదపి స్మరతి

క్షమయా కృపయా పరిపాలయ తాం

జననీ యది కుప్యతి కః శరణమ్?


జనములలో చాలామంది ఏవేవో ప్రలాపములు చేయుదురే గానీ, నీ నామమును ఉచ్చరించువారెవ్వరును లేరు. వారి అజ్ఞానమును క్షమింపుము. తల్లియే కోపించిన బిడ్డలకిక దిక్కెవ్వరు?

8) హరి రుద్ర విరించి దివస్పతయో

గతయోగతయోపగతిమ్ దధతే।

యదినోపదిశేస్తదవశ్య విధీన్

జగతాం గతిరేతి తమః పటలమ్॥


త్రిమూర్తులు, ఇంద్రుడు యోగమార్గమున నిన్నే ధ్యానింతురు. వారి వారి కర్తవ్యములను ఎప్పటికప్పుడు తెలుపకపోయినచో లోకములన్నియు చీకటి మయమైపోవా?


9) వినా వేదమాత్రా, న ధాతా న విష్ణుః

న రుద్రో నచేంద్రో న సూర్యో నచన్ద్రః।

న తారా న లోకా న కాలా న వేదా

న శాస్త్రం న విద్యా న మంత్రో న తంత్రమ్॥


వేదమాత గాయత్రిని విడిచి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, లోకములు, కాలములు, వేదములు, శాస్త్ర-విద్యలు, మంత్ర-తంత్రములు వీని ఉనికియే లేదు.


10) బిభేత్యేవ వాయుస్త్వదగ్రే ప్రవాతుం

తపత్యేవ సూర్యో భయాత్ త్వత్సకాశే।

భియా చేంద్ర వహ్నీ త్వదాజ్ఞాం వహేతే

ప్రధావ త్యహో దూర దేశం స మృత్యుః॥


ఓ గాయత్రీ! నీ భయము వలననే వాయువు వీచుచున్నాడు. నీ భయము వలననే సూర్యుడు లోకములకు వెలుగునిచ్చుచున్నాడు. నీకు భయపడియే ఇంద్రుడు, అగ్ని, లోకపాలకత్వమును వహించుచున్నారు.


11) వృథా దేహదార్ఢ్యం వృథా వస్తు వృద్ధిః

వృథా పుత్ర పౌత్రాది చాయుర్వృథైవ।

వృథా తస్య జన్మాపి యస్త్వాం వివర్జ్య

యథేచ్ఛం ప్రవర్తేత విప్రోSపి భూత్వా॥


విప్రుడైయుండియు ఎవడు నిన్ను విడిచి యథేచ్ఛముగా లోకయాత్ర సాగించునో, వాని దేహసంపద, వస్తుసంపద, దారాపుత్రాది సంపద, ఆయుస్సంపద - చివరకు వాని జన్మము కూడ వ్యర్థములే.


12) స్త్రియా మన్త్ర పాఠాధికారో న చేత్ స్యాత్,

భవన్నిత్య పూజాధికారోSస్తి తంత్రాత్।

తథా శూద్ర జాతి స్తథై వాన్త్యజా వా,

భవత్ పూజనార్హాశ్చ తాన్ రక్ష మాతః॥


స్త్రీలకు, శూద్రులకు నీ మంత్రపాఠము విషయమున అధికారము లేకున్నను, తంత్ర విధానముచే నీ పూజాదికములు నిర్వర్తించు అధికారమున్నది. వారి పూజను స్వీకరించి, వారిని కూడా విప్రులవలెనే కాపాడుచుందువుగాక!


1) Udayaasthamayaachala madhya charath

Kamaneeya sareera sukaanthimathi!

Karunaa varunaalaya madhyakaley!

Paripaalaya loka mahojanani!


O light that bathes the earth between sunrises and sunsets, O ocean of love, O mother Gayatri, please protect your worlds.


2) Subhamemi bhavath pada maarjanayaa

Sukhamemi bhavath kara laalanayaa|

Yasa emi bhavadguna keerthanayaa

Rithamemi bhavanmanu chinthanayaa||


May those who wash your feet and hands get good fortune and happiness. May those who sing your virtues get glory, and may those who chant your mantra lead a righteous life.


3) Adhareekritha kaamagavee charithey!

Urareekritha saadhu subhakthanuthey!

Vidaleekritha daanava dushta gathey!

Visadeekritha mouni manah prakrithey!


As a giver, your fame is larger than Kamadhenu’s. You readily accept your devotees’ respect and love. Cleansing the evil in demons is your second nature. It is your grace that blesses ascetics to overcome fickleness of the mind.


4) Bhava bandhna mochana keli rathey

Karunaamritha sechana bhavyagathey

Gathi dhikkritha gandhagajaadhipathey

Sruthi keerthitha divya guna prathathey


You remove the shackles of samsara and the ill-effects of Gajadhipati, the sacred texts so glorify your virtues. I bow to you O mother.


5) Sujaneekritha sarva virodhipathey!

Swajaneekritha nischala bhaktha thathey!

Dhwajineekritha sarva sathee nivahey!

Vijineekritha sannutha keli grihey!


You turn every foe into a friend. You accept everyone as your own and they in turn shall willingly join your army if need be. You are a pativrata.


6) Thanuthaam thanuthaam mama paapasatham

Bhajathaam bhajathaam virathim duritham!

Ayathaam ayathaam jana duscharitham

Thwasathaam asathaam nikrithi sukritham||


May your devotees' sins wane. By your grace, may misdeeds become virtuous deeds and ignoble reputations become noble.


7) Vividhaani vachaamsi vadeth janathaa

Thava naama na kinchidapi smarathi

Kshamayaa kripayaa paripaalaya thaam

Jananee yadi kupyathi kah saranam?


Please countenance those who ignore to chant your name with devotion. Forgive their ignorance as a mother would.


8) Hari Rudra Virinchi divaspathayo

Gathayo gathayo pagathim dadhathey|

Yadinopadisesthadavasya vidheen

Jagathaam gathirethi thamah patalam||


The Trinity and Lord Indra pray to you through the path of Yoga and get guidance from you. Without that the worlds will fall into darkness.


9) Vinaa veda maathraa, na Dhaathaa na Vishnuh

Na Rudro na chendro na Suryo na Chandrah|

Na thaaraa na lokaa na kaalaa na vedaa

Na saasthram na vidyaa na manthro na thantham||


Without you O mother Gayatri, Brahma, Vishnu, Rudra, Indra, Surya, Chandra, the stars, the worlds, time, the vedas, knowledge, and mantra-tantra don’t exist.


10) Bibhethyeva vaayusthwadagrey pravaathum

Thapathyeva Suryo bhayaath thwathsakaasey|

Bhiyaa chendra vahnee thwadaajnyaam vahethey

Pradhaava thyaho doora desam sa mrithyuh||


O Gayatri, it is the fear of you that makes Vayu give air and Surya give light. It is the fear of you that makes Indra and Agni fulfil their responsibilities as rulers of the world.


11) Vrithaa dehadaardhyam vrithaa vasthu vriddhih

Vrithaa puthra pouthraadi chaayurvrithaiva|

Vrithaa thasya janmaapi yasthwaam vivarjya

Yatheccham pravarthetha vipropi bhoothwaa||


A person of knowledge who turns a blind eye to you, such a person's riches like good health, wealth, family, longevity, including the very birth itself, are in vain.


12) Sthriyaa manthra paathaadhikaaro na cheth syaath,

Bhavannithya poojaadhikaarosthi thanthraath|

Thathaa soodra jaathi sthaivaanthyajaa vaa,

Bhavath poojanaarhaascha thaan raksha maathah||


Although women and shoodras cannot pray to you in the mantra form, they can worship you in the tantra method through rituals. Please accept their prayers and protect them too.

No comments:

Post a Comment