Raagam: Janjhooti
Thaalam: Khandachaapu
Pa) Saranu saranu Surendra sannutha - Saranu Sri sathi vallabhaa
Saranu rakshasa garva samhara - Saranu Venkata naayaka
1) Kamala dharudunu kamala mithrudu - Kamala sathrudu puthrudu
Kramamutho mee koluvukippudu - Kaachinaareccharikayaa
2) Animishendrulu munulu dikpathulamara kinnera siddhulu
Ghanathatho Rambhaadi kaanthalu - Kaachinaareccharikayaa
3) Ennagala Prahlaada mukhyulu - ninnu koluvaga vacchiri
Vinnapamu vinavayya Tirupathi Venkataachala naayaka
ప) శరణు శరణు సురేంద్ర సన్నుత - శరణు శ్రీసతి వల్లభ
శరణు రాక్షస గర్వసంహర - శరణు వేంకట నాయక
1) కమలధరడును కమలమిత్రుడు - కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీ కొలువుకిప్పుడు - కాచినారెచ్చరికయా
2) అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నెర సిద్ధులు
ఘనతతో రంభాది కాంతలు - కాచినారెచ్చరికయా
3) ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు - నిన్ను కొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచాల నాయక
No comments:
Post a Comment