Showing posts with label Vinnapamula Samrajya Lakshmi. Show all posts
Showing posts with label Vinnapamula Samrajya Lakshmi. Show all posts

Monday, 22 May 2023

Kaburley gaanee kalividi erugani - Vinnapamula Swarajya Lakshmi



Lyricist: Smt. Vinnapamula Swarajya Lakshmi gaaru

Composer: Smt. Sobha Chaturvedula


Kaburley gaanee kalividi erugani

Kayyaala vaaru ee viyyaalavaariki

Vindu seyalemu memu meppu pondalemu

Abbabbaa veeri aagadamanthaa

cheppanalavi kaadu memu meppu pondalemu


Vantasaalalo vandina vantalu

Macchukainanu kanapadaledugaa

Uppu ledani udakaledani

Vankalakemi thakkuva ledugaa

Abbabbaa veeri aagadamanthaa

cheppanalavi kaadu memu meppu pondalemu


Muddumuddugaa muripaalenno

Mucchatagaanu cheddaamantey

Navvu mukhamu ledey vatti

chirruburruleney

Abbabbaa veeri aagadamanthaa

cheppanalavi kaadu memu meppu pondalemu


కబుర్లే గానీ కలివిడి ఎరుగని కయ్యాల వారీ వియ్యాలవారికి

విందుసేయలేము మేము మెప్పు పొందలేము

అబ్బబ్బ వీరి ఆగడమంతా

చెప్పనలవి కాదు మేము మెప్పు పొందలేము


వంటశాలలో వండిన వంటలు మచ్చుకైనను కనపడలేదుగా

ఉప్పు లేదని ఉడకలేదని వంకలలేమీ తక్కువ లేదుగా

అబ్బబ్బ వీరి ఆగడమంతా

చెప్పనలవి కాదు మేము మెప్పు పొందలేము


ముద్దుముద్దుగా మురిపాలెన్నో ముచ్చటగాను చేద్దామంటే

నవ్వు ముఖము లేదే వట్టి చిర్రుబుర్రులేనే

అబ్బబ్బ వీరి ఆగడమంతా

చెప్పనలవి కాదు మేము మెప్పు పొందలేము


Wednesday, 3 May 2023

Marachiponi vindu chesiri - Pelli paata (Pelli bhojanaala daggara paata)



Lyrics: Smt. Vinnapamula Samrajya Lakshmi

Pa) Marachiponi vindu chesiri aha viyyaalavaaru

Maruvaleni vindu chesiri


1) Vinayamentho choopinaaru

Vinjaamara veechinaaru

Bidda paapalu aakali antey

Vanta kaaledantoo garitelu thippaaru


2) Appadaala shape-u

Aha India map-u

Uppu leni pappu mari

Udiki udakani kooralu


3) Mudda koora adigithenu

Muddaraalu vadinagaaru

Muddakoora ledantoo

Moothi vankara thippinaaru


4) Vaddana entho chesinaaru

Vadiyaalanu vesinaaru

Vadiyaalatho paatu

Gundraallanu icchinaaru


ప) మరచిపోని విందు చేసిరి ఆహా వియ్యాలవారు

మరువలేని విందు చేసిరి 


1) వినయమెంతో చూపినారు - వింజామర వీచినారు 

బిడ్డా పాపలు ఆకలి అంటే - వంట కాలేదంటూ గరిటెలు తిప్పారు 


2) అప్పడాల షేపు - ఆహా ఇండియా మ్యాపు

ఉప్పు లేని పప్పు మరి - ఉడికి ఉడకని కూరలు 


3) ముద్ద కూర అడిగితేను - ముద్దరాలు వదినగారు 

ముద్దకూర లేదంటూ - మూతి వంకర తిప్పినారు 


4) వడ్డన ఎంతో చేసినారు - వడియాలను వేసినారు 

వడియాలతో పాటు - గుండ్రాళ్ళను ఇచ్చినారు 

Saturday, 8 April 2023

Sri Mahalakshmikini - Pelli paata - Light Music Song - Smt. V. S. Lakshmi gaaru - Pelli paata

Lyrics and music: Smt. Vinnapamula Samrajya Lakshmi

Raagam: Madhyamavathi

Thaalam: Khanda gathi Eka Thaalam


ప) శ్రీ మహాలక్ష్మికిని శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగము

నేడు పెండ్లి శుభ ముహూర్తము


1) ముత్యాల పందిరై గగనమే నిలిచేను

నవరత్న పీఠమై భూదేవి నిలిచేను

నిత్యకళ్యాణమై పచ్చ తోరణమై

కళ్యాణమంటపము కమనీయము


2) పెండ్లి కొమరుని బంధుబలగమేదనుచు

గగనరాజు నిలిచె స్వాగతము పలుక

పద్మభవుడు వాణి శివపార్వతులతో

ఇంద్రాది దేవతలు తరలివచ్చేరు


3) ఎదురుకోలు నిలిపి వరపూజలు సేయ

పెండ్లివారిని స్వాగతించేరు

పునుగు జవ్వాది చందన గంధములు

పన్నీరు జల్లులతో మురిపించేరు


4) మంగళవాద్యములు మారుమ్రోగంగ

వీనులవిందుగా వేదమంత్రములు

అందాల మా తల్లి అలమేలుమంగకు

మాంగళ్యధారణ మహనీయముగ జరిగె


5) పచ్చని తలంబ్రాలు ఝల్లులై కురియ

కెంపులు నీలాలు జాలువారంగ

శ్రీవాణి శ్రీగౌరి హారతులు పట్టి

మంగళగీతములు మధురముగ పాడె


Pa) Sri Mahalakshmikini Sri Srinivaasunaku kalyaana vaibhogamu

Nedu pendli subha muhoorthamu


1) Muthyaala pandirai gaganamey nilichenu

Navarathna peethamai Bhoodevi nilichenu

Nithya kalyaanamai paccha thoranamai

Kalyaana mantapamu kamaneeyamu


2) Pendli komaruni bandhu balagamedanuchu

Gaganaraju niliche swaagathamu paluka

Padmabhavudu Vani Siva Parvathulatho

Indraadi devathalu tharali vaccheru


3) Edurukolu nilipi varapoojalu seya

pendlivaarini swaagathincheru

Punugu javvaadi chandana gandhamulu

panneeru jallulatho muripincheru


4) Mangala vaadyamulu maarumroganga

veenula vindugaa veda manthramulu

Andaala maa thalli Alamelu Mangaku

Maangalyadhaarana mahaneeyamuga jarige


5) Pacchanu thalambraalu jallulai kuriya

kempulu neelaalu jaaluvaaranga

Srivani Sri Gowri haarathulu patti

mangala geethamulu madhuramuga paadey