Lyrics and music: Smt. Vinnapamula Samrajya Lakshmi
Raagam: Madhyamavathi
Thaalam: Khanda gathi Eka Thaalam
ప) శ్రీ మహాలక్ష్మికిని శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగము
నేడు పెండ్లి శుభ ముహూర్తము
1) ముత్యాల పందిరై గగనమే నిలిచేను
నవరత్న పీఠమై భూదేవి నిలిచేను
నిత్యకళ్యాణమై పచ్చ తోరణమై
కళ్యాణమంటపము కమనీయము
2) పెండ్లి కొమరుని బంధుబలగమేదనుచు
గగనరాజు నిలిచె స్వాగతము పలుక
పద్మభవుడు వాణి శివపార్వతులతో
ఇంద్రాది దేవతలు తరలివచ్చేరు
3) ఎదురుకోలు నిలిపి వరపూజలు సేయ
పెండ్లివారిని స్వాగతించేరు
పునుగు జవ్వాది చందన గంధములు
పన్నీరు జల్లులతో మురిపించేరు
4) మంగళవాద్యములు మారుమ్రోగంగ
వీనులవిందుగా వేదమంత్రములు
అందాల మా తల్లి అలమేలుమంగకు
మాంగళ్యధారణ మహనీయముగ జరిగె
5) పచ్చని తలంబ్రాలు ఝల్లులై కురియ
కెంపులు నీలాలు జాలువారంగ
శ్రీవాణి శ్రీగౌరి హారతులు పట్టి
మంగళగీతములు మధురముగ పాడె
Pa) Sri Mahalakshmikini Sri Srinivaasunaku kalyaana vaibhogamu
Nedu pendli subha muhoorthamu
1) Muthyaala pandirai gaganamey nilichenu
Navarathna peethamai Bhoodevi nilichenu
Nithya kalyaanamai paccha thoranamai
Kalyaana mantapamu kamaneeyamu
2) Pendli komaruni bandhu balagamedanuchu
Gaganaraju niliche swaagathamu paluka
Padmabhavudu Vani Siva Parvathulatho
Indraadi devathalu tharali vaccheru
3) Edurukolu nilipi varapoojalu seya
pendlivaarini swaagathincheru
Punugu javvaadi chandana gandhamulu
panneeru jallulatho muripincheru
4) Mangala vaadyamulu maarumroganga
veenula vindugaa veda manthramulu
Andaala maa thalli Alamelu Mangaku
Maangalyadhaarana mahaneeyamuga jarige
5) Pacchanu thalambraalu jallulai kuriya
kempulu neelaalu jaaluvaaranga
Srivani Sri Gowri haarathulu patti
mangala geethamulu madhuramuga paadey
No comments:
Post a Comment