Jalra settings used to record this song:
Count: 4
Style: Basic 5
60 BPM
Pitch: G#
Raagam: Yadukula Kambhoji
Thaalam: Aadi
Pa) Paahimaam Sri Rama antey palakavaithivi - nee
sneham ettidani ney cheppanohohohohohohoho
1) Ibbandinondi aakari bobba pettinanthaloney
Gobbuna gaachithivata jabbuseyaka
Nibbaramugaa nenentho kabbamicchi vedukonna
Thabbibbu chesedavu Rama abbabbabbabbabbabbabbaa
2) Sannuthinchinavaarinella munnu dayatho brochithivani
Pannagasaayini kani vinnavinchithi
Vinnapamu vinakayentho kannada chesedavu Raama
Ennatikee nammaraadurannannannannannannannaa
3) Chayyena Bhadradri nilaya swamivani nammi nenu
Vemaru vidhamula vinuthi cheya saagithi
Iyyada Raamadaasuni kuyyaalinchi brovakunna
Vayyaaramemanavacchu ayyayyayyayyayyayyayyo
ప) పాహిమాం శ్రీరామ అంటే పలకవైతివి - నీ
స్నేహమెట్టిదని నే చెప్పనోహోహోహోహోహోహోహో
1) ఇబ్బందినొంది ఆఖరి బొబ్బ పెట్టినంతలోనే
గొబ్బున గాచితివట జబ్బుసేయక
నిబ్బరముగా నేనెంతో కబ్బమిచ్చి వేడుకొన్న
తబ్బిబ్బు చేసెదవు రామ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
2) సన్నుతించినవారినెల్ల మున్ను దయతో బ్రోచితివని
పన్నగశాయిని కని విన్నవించితి
విన్నపము వినక ఎంతో కన్నడ చేసెదవు రామ
ఎన్నటికీ నమ్మరాదురన్నన్నన్నన్నన్నన్నన్నా
3) చయ్యెన భద్రాద్రినిలయ స్వామివని నమ్మి నేను
వేమారు విధముల వినుతి చేయ సాగితి
ఇయ్యడ రామదాసుని కుయ్యాలించి బ్రోవకున్న
వయ్యారమేమనవచ్చు అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
No comments:
Post a Comment