Showing posts with label Mukhaari. Show all posts
Showing posts with label Mukhaari. Show all posts

Thursday, 28 December 2023

Thallee Mahaa Tripura Sundari - Kocherlakota Ramaraju Swarajathi

 



Pa) Thallee Mahaa Tripura Sundari

Nee thanayuda nanu ganumika


1) Mullokamulu golachiyunna jananiro

moraalakinchi raave kanikaramuna


2) Chalamikela ika niluva jagadamba

Sadaa Sivuni hrudayeswari sukhakari

Jalaja nethri biraana varaalosagi

Sthiramuga nanu krupaganuma girithanaya


3) Andamaina mrudupaada kamalamulu

anavarathamu madi nilipi golichithini

chandraanana Himagirisutha saraguna

kshamimpu sumi Umaa vinuma nirupama


4) Ikanevaree mahilo varaalosagi

veruvakumani devathavani vini vini

prakatithambuga needu charithamulanu

bahuvidhamula pogadinaanu nijamuga


5) Saarasa lochani krupanu

jaalaga joodumu sadayaro

raakendu mukhi Ramaraja nutha

jananivamma Sivuni komma sthiramuga


ప) తల్లీ మహా త్రిపురసుందరి

నీ తనయుడ నను గనుమిక


1) ముల్లోకములు గొలచియున్న జననిరో

మొరాలకించి రావే కనికరమున


2) చలమికేల ఇక నిలువ జగదాంబ

సదా శివుని హృదయేశ్వరి సుఖకరి

జలజ నేత్రి బిరాన వరాలొసగి 

స్థిరముగ నను కృపగనుమ గిరితనయ


3) అందమైన మృదుపాద కమలములు

అనవరతము మది నిలిపి గొలిచితిని 

చంద్రానన హిమగిరిసుత సరగున

క్షమింపు సుమి ఉమా వినుమ నిరుపమ


4) ఇకనెవరీ మహిలో వరాలొసగి

వెరువకుమని దేవతవని విని విని

ప్రకటితంబుగ నీదు చరితములను

బహువిధముల పొగడినాను నిజముగ


5) సారస లోచని కృపను

జాలగ జూడుము సదయరో

రాకేందుముఖి రామరాజనుత

జననివమ్మ శివుని కొమ్మ స్థిరముగ



Wednesday, 3 May 2023

Ramula nammina vaaramu - Mannemkonda Hanumaddasu Keerthana

Lyrics: Sri Mannemkonda Hanumaddasu

Raagam: Mukhaari

Thaalam: Trisra Aadi


Raamula nammina vaaramu - memu

Rama Ramayanu vaaramu


1) Hari bhakthi guricheyuvaaramu - bhaktha

varula sangathinonduvaaraamu

Mukthi theravu gaanchedivaari vaaramu - memu

maruvamu Hari naama smaranamu



2) Nidra kshudbaadhala goodamu - Rama

Bhadruni naamamu veedamu - peti

kshudra maanavulanu vedamu - Aathma

bhadramau guri vidanaadamu


3) Panchabhootha bhrama sokkamu - pra

pancha vaasanalo chikkamu - memu

konchepu narulaku mrokkamu - divya

pancha samskaarulam nikkamu


4) Bhaasura Bhadraadri vaaramu - moksha

padavee maargamu chendagoremu - Sri

Bhoosutha sahithunivaaramu - Hanumath

daasa hrudbhaanunivaaramu

రాముల నమ్మినవారము - మేము

రామ రామాయనువారము


1) హరిభక్తి గురిచేయువారము - భక్త

వరుల సంగతినొందువారము

ముక్తి తెరవు గాంచెడివారివారము - మేము

మరువము హరినామ స్మరణము


2) నిద్ర క్షుద్బాధల గూడము - రామ

భద్రుని నామము వీడము - పేటి

క్షుద్ర మానవులను వేడము - ఆత్మ

భద్రమౌ గురి విడనాడము 


3) పంచభూత భ్రమ సొక్కము - ప్ర

పంచ వాసనలో చిక్కము - మేము

కొంచెపు నరులకు మ్రొక్కము - దివ్య

పంచ సంస్కారులం నిక్కము 


4) భాసుర భద్రాద్రి వారము - మోక్ష

పదవీ మార్గము చెందగోరేము - శ్రీ

భూసుత సహితునివారము - హనుమత్

దాస హృదభానునివారము

Monday, 4 October 2021

Doravale kooruchunnaadu - Thoomu Narasimha Dasu Keerthana



Raagam: Mukhari

Thaalam: Aadi

ప) దొరవలె కూరుచున్నాడు - భద్ర

గిరి నాధుడితడేమో చూడు


1) మెరుపైన చామంతి విరుల దండలు చాల

మురియుచు ధరియించి ముదిత సీతను గూడి


2) ఉరు మంచి ముత్యాల సరులు కెంపులు తాళి

మెరయుచునుండగ చిరునవ్వు మోముతో


3) కాంచన చేలము కనక కిరీటము

లాంచనములు గల లక్ష్మణాగ్రజుడిపుడు


4) విరుల చప్పరమున పరమ భక్తులు గొలువ

నరసింహదాసుని అరసి బ్రోచుటకిపుడు


Pa) Dora vale kooruchunnaadu - Bhadra

Giri naadhudithademo choodu


1) Merupaina chaamanthi virula dandalu chaala

Muriyuchu dhariyinchi muditha Seethanu goodi


2) Uru manchi muthyaala sarulu kempulu thaali

Merayuchunundaga chirunavvu momutho


3) Kaanchana chelamu kanaka kireetamu

Laanchanamulu gala Lakshmanaagrajudipudu


4) Virula chapparamuna parama bhakthulu goluva

Narasimha daasuni arasi brochutakipudu