Wednesday, 3 May 2023

Ramula nammina vaaramu - Mannemkonda Hanumaddasu Keerthana

Lyrics: Sri Mannemkonda Hanumaddasu

Raagam: Mukhaari

Thaalam: Trisra Aadi


Raamula nammina vaaramu - memu

Rama Ramayanu vaaramu


1) Hari bhakthi guricheyuvaaramu - bhaktha

varula sangathinonduvaaraamu

Mukthi theravu gaanchedivaari vaaramu - memu

maruvamu Hari naama smaranamu



2) Nidra kshudbaadhala goodamu - Rama

Bhadruni naamamu veedamu - peti

kshudra maanavulanu vedamu - Aathma

bhadramau guri vidanaadamu


3) Panchabhootha bhrama sokkamu - pra

pancha vaasanalo chikkamu - memu

konchepu narulaku mrokkamu - divya

pancha samskaarulam nikkamu


4) Bhaasura Bhadraadri vaaramu - moksha

padavee maargamu chendagoremu - Sri

Bhoosutha sahithunivaaramu - Hanumath

daasa hrudbhaanunivaaramu

రాముల నమ్మినవారము - మేము

రామ రామాయనువారము


1) హరిభక్తి గురిచేయువారము - భక్త

వరుల సంగతినొందువారము

ముక్తి తెరవు గాంచెడివారివారము - మేము

మరువము హరినామ స్మరణము


2) నిద్ర క్షుద్బాధల గూడము - రామ

భద్రుని నామము వీడము - పేటి

క్షుద్ర మానవులను వేడము - ఆత్మ

భద్రమౌ గురి విడనాడము 


3) పంచభూత భ్రమ సొక్కము - ప్ర

పంచ వాసనలో చిక్కము - మేము

కొంచెపు నరులకు మ్రొక్కము - దివ్య

పంచ సంస్కారులం నిక్కము 


4) భాసుర భద్రాద్రి వారము - మోక్ష

పదవీ మార్గము చెందగోరేము - శ్రీ

భూసుత సహితునివారము - హనుమత్

దాస హృదభానునివారము

No comments:

Post a Comment