Count: 3
Style: Basic 4
150 BPM
Pitch: B
Pa) Chesi gelichiramma kaaryamu - viyyaalavaaru
Thunchi vesiramma bhakshyamu
1) Maaru annamadigithenu maamagaaru vacchinaaru
Maaru annamu ledani maaya maatalu cheppinaaru
2) Appadaalu adigithenu andamaina pedda vadina
Appadaalu levani kuppiganthulu veyasaagey
3) Vadiyaalu adigithenu vagalamaari chinna vadina
Vadiyaalu levani kadiyaalu thippasaagey
4) Ksheeraannam adigithenu chimpiri thala chinna vadina
Ksheeraannamu ledani cheekaaku padasaagey
5) Thaamboolam adigithenu thagavumaari pedda baava
Thamalapaakulu levani thaithakkalaadasaagey
6) Pappu untey neyyi undadu, neyyi untey pappu undadu
Inthoti vindu choosi murisi murisipoyinaaru
7) Anthaloney maamagaaru intha kharchu choodaleka
gundelu gundelu baadukuntoo mondigodalu dunkasaagey
ప) చేసి గెలిచిరమ్మ కార్యము - వియ్యాలవారు
తుంచి వేసిరమ్మ భక్ష్యము
1) మారు అన్నమడిగితేను మామగారు వచ్చినారు
మారు అన్నము లేదని మాయమాటలు చెప్పినారు
2) అప్పడాలు అడిగితేను అందమైన పెద్ద వదిన
అప్పడాలు లేవని కుప్పిగంతులు వేయసాగె
3) వడియాలు అడిగితేను వగలమారి చిన్న వదిన
వడియాలు లేవని కడియాలు తిప్పసాగె
4) క్షీరాన్నమడిగితేను చింపిరి తల చిన్నవదిన
క్షీరాన్నము లేదని చీకాకు పడసాగె
5) తాంబూలమడిగితేను తగవుమారి పెద్ద బావ
తమలపాకులు లేవని తైతక్కలాడసాగె
6) పప్పు ఉంటే నెయ్యి ఉండదు, నెయ్యి ఉంటే పప్పు ఉండదు
ఇంతోటి విందు చూసి మురిసి మురిసిపోయినారు
7) అంతలోనే మామగారు ఇంత ఖర్చు చూడలేక
గుండెలు గుండెలు బాదుకుంటూ మొండిగోడలు దుంకసాగె
No comments:
Post a Comment