Raagam: Bhairavi
Thaalam: Misrachapu
Carnatic Music, the classical music form of South India, has originated from Saama Vedam. It is acclaimed to have soothing effect on not only humans but also animals. "Sisurvetthi Pasurvetthi Vetthi Gaanarasam Phanih". This website is maintained by a music school 'Sriman Sangeetha Nilayam', named after Sri Bharatam Srimannarayana, a famous multifaceted scholar from Tadepalligudem, AP. Story behind the emblem of SSN... https://www.youtube.com/watch?v=tdWGZJibzZU&t=95s
Composer: Sri Purandhara Dasa
Raagam: Naata
Thaalam: Misrachaapu
ప) శరణు సిద్ధివినాయక శరణు విద్యా ప్రదాయక
శరణు పార్వతీతనయ మూర్తి శరణు మూషికవాహన
1) నిటిల నేత్రన దేవి సుతనే నాగ భూషణ ప్రియనే
తటిలతాంకిత కోమలాంగనే కర్ణకుండల ధారణే
2) బట్టముత్తిన పదకహారనే బాహుహస్త చతుష్టనే
ఇట్టతొడుగెయ హేమకంకణ పాశ అంకుశ ధారణే
3) కుక్షి మహా లంబోదరనే ఇక్షు చాపన గెలిదనే
పక్షివాహన సిరి పురందర విఠలన నిజదాసనే
Pa) Saranu Siddhi Vinayaka Saranu vidyaa pradaayaka
Saranu Parvathi thanaya moorthi saranu mooshika vaahana
1) Nitila nethrana devi suthaney Nagabhooshana priyane
Thatilathaanthika komalaanganey karna kundala dhaaraney
2) Batta mutthina padakahaaraney baahu hastha chathushtaney
Itta thodugeya Hema kankana paasa ankusa dhaaraney
3) Kukshi mahaa lambodaraney ikshu chaapana gelidaney
Pakshi vaahana siri Purandhara Vithalana niha daasaney
అను) సవన రక్షక నిత్యోత్సవ సీతాపతి
చ) రాజా బిగువు నీకేలరా త్యాగరాజార్చిత పాద
తాళజాలరా రామ ఈ జాలముసేయ
రాజా బ్రోవ సంకోచమా సురభూజమా మాకు
Pa) Evaruraa ninu vinaa gathi maaku
Anu) Savana rakshaka nithyothsava Seethapathi
Cha) Raajaa biguvu neekelaraa
Thyagaraajaarchitha paada
Thaalajaalaraa Rama ee jaalamuseya
Raajaa brova sankochamaa
Sura bhoojamaa maaku
Raagam: Reethigowla
Thaalam: Misrachaapu
Pa) Seethaa Naayaka srithajana poshaka
Sri Raghukula thilaka O Rama
1) Nirupeda bhakthula karikotha padaleka
giripainekkukontivo
2) Angalaarpu joochi Rangapuramuna
chelanguchu pandithivo
3) Kaachina bhakthula joochi yaa Baliney
yaachincha vedalithivo
4) Aasa minchi ninnaasu jerenani
keesula jerithivo
5) Jaalitho vacchu Kucheluni gani Gopee
chelamuletthithivo
6) Ingithmerigi upponguchu brochu
bangaaru doravaithivo
7) Nee gunamula guttu baaguga thelisenu
Thyagaraja vinutha
ప) సీతానాయక శ్రితజనపోషక - శ్రీరఘుకుల తిలక ఓ రామ
1) నిరుపేద భక్తుల కరికోత పడలేక - గిరిపైనెక్కుకొంటివో
2) అంగలార్పుజూచి రంగపురమున - చెలంగుచు పండితివో
3) కాచిన భక్తులజూచియా బలినే - యాచించ వెడలితివో
4) ఆశ మించి నిన్నాశు జేరెనని - కీశుల జేరితివో
5) జాలితో వచ్చు కుచేలుని గని గోపీ - చేలములెత్తితివో
6) ఇంగితమెరిగి ఉప్పొంగుచును బ్రోచు - బంగారు దొరవైతివో
7) నీ గుణముల గుట్టు బాగుగ తెలిసెను - త్యాగరాజ వినుత
Jalra settings used to record this song:
Count: 7
Style: Basic 3
Speed: 200 BPM
Pitch: A
Pa) Amba neekidey haarathi Sri Raja Rajeswari
1) Parama bhakthulu ninnu bhajiyinchuchunnaaru
paripaalinchi brovavey Sri Jagadeeswari
2) Nee paadamulu nammi ninu kolachuchunnaaru
kaapaadi rakshinchavey kanikaramulatho
3) Muggurammalakunu moolammu neevenammaa
Eggulennaku maayandu erani vaaramu
ప) అంబా నీకిదే హారతి శ్రీ రాజరాజేశ్వరి
1) పరమ భక్తులు నిన్ను భజియించుచున్నారు
పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి
2) నీ పాదములు నమ్మి నిను కొలచుచున్నారు
కాపాడి రక్షించవే కనికరములతో
3) ముగ్గురమ్మలకును మూలమ్ము నీవెనమ్మా
ఎగ్గులెన్నకు మాయందు ఏరనివారము
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం ||
1) శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం
శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం ||
2) వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం
కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ||
3) బ్రహ్మచే పూజింపబడిన చరణ యుగళికి మంగళం
జగములన్నియు కన్నతండ్రను చక్కనయ్యకు మంగళం ||
4) గోపికా గణ సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం
రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ||
Pa) Mangalam jaya mangalam maa nallanayyaku mangalam
Mangalam jaya mangalam maa Krishna Swamyki mangalam
1) Siramunanduna merayuchundedi nemali pinchaku mangalam
Shyaamalaanguni karamulandali madhura muraliki mangalam
2) Vanajadammunu dhikkarinchedi vadana sobhaku mangalam
Karuna rasamunu chinduchundedi kannudoyiki mangalam
3) Brahmachey poojimpabadina charana yugaliki mangalam
Jagamulanniyu kannathandranu chakkanayyaku mangalam
4) Gopikaa gana sevithudu Sri Govindunaku mangalam
Raadhikaa pariveshtithundou raseswarunaku mangalam
haarathi meerela ivvarey
Haarathi meerela ivvarey jnaana vidyalakella prabalamu
Leelatho padiyaaru vannela melimi bangaaru thalliki
2) Paadamulaku pooja seyarey - Maa thallikipudu
Paarijaathapu haaramivvarey
Aanimuthyapu haaramulu - mola noolu gajjelu jodu andelu
Ravvala paapita bottu mungera samamugaa dhariyinchu thalliki
3) Intha paraakelananarey - Rudruni deviki
chenthanundi poojaseyarey
Chenthanundi pooja seyarey Sankari Omkaara roopiki
Kumkumaankitha alankaariki ponkamaina subhamkaariki
4) Laksha vatthula jyothi koorcharey - chelulaara meeru
Pacchala palleramu vaalcharey
Rakshithambugaanu eerey daakshirambuga haarathulanu
Raakshasa samhaarikipudu mucchatalaraga paadukonuchu
5) Mangala haarathineeyarey - Maa thalliki
Divya mangalaa deviki
Divya mangalaa devi - Deena jana kalpavalli
Sarvaloka janani yaina bangaaru thallikipudu
6) Vedamulaku andaraani mahimaa jyothi
Aadisakthi swaroopini - Amba
Moodu sakthulakellanu taa ( moolamai velaguchundi
Moodu lokambulanu brochunatti maa bangaaru thalliki
ప) హారతి మీరేల ఇవ్వరే - అంబకు మంగళ
హారతి మీరేల ఇవ్వరే
హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము
లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారుతల్లికి
2) పాదములకు పూజసేయరే - మా తల్లికిపుడు
పారిజాతపు హారమివ్వరే
ఆణిముత్యపు హారములు - మొల నూలు గజ్జెలు జోడు అందెలు
రవ్వల పాపిట బొట్టు ముంగెర సమముగా ధరియించు తల్లికి
3) ఇంత పరాకేలననరే - రుద్రుని దేవికి
చెంతనుండి పూజాసేయరే
చెంతనుండి పూజసేయరే శంకరి ఓంకార రూపికి
కుంకుమాంకిత అలంకారికి పొంకమైన శుభంకారికి
4) లక్ష వత్తుల జ్యోతి కూర్చరే - చెలులారా మీరు
పచ్చల పళ్లెరము వాల్చరే
రక్షితంబుగాను ఈరే దాక్షిరంబుగ హారతులను
రాక్షస సంహారికిపుడు ముచ్చటలరగ పాడుకొనుచు
5) మంగళ హారతినీయరే - మా తల్లికి
దివ్య మంగళాదేవికి
దివ్య మంగళా దేవి - దీనజన కల్పవల్లి
సర్వలోక జననియైన బంగారు తల్లికిపుడు
6) వేదములకు అందరాని మహిమా జ్యోతి
ఆదిశక్తి స్వరూపిణి - అంబ
మూడు శక్తులకెల్లను తా( మూలమై వెలగుచుండి
మూడు లోకంబులను బ్రోచునట్టి మా బంగారుతల్లికి
Aadi Thaalam:
Kalyaanamu choothamu raaramma Sri Seetha Ramula
Kalyaanamu choothamu raaramma
Misrachaapu Thaalam:
1) Hoyalu meeraga tharunulandaru
bayaluderiri haarathulatho
Disalu nindenu vaadya ravali
Minnu muttenu veda ghosha
2) Kusuma komali komma Janaki
Asamasaru sara pandepu bomma
Marati maarudey maa Sreeramudu
Eru pogadagalarintha vaibhavam
ఆదితాళం:
కళ్యాణము చూతము రారమ్మా శ్రీ సీతారాముల
కళ్యాణము చూతము రారమ్మా
మిశ్రచాపు తాళం:
1) హొయలు మీరగ తరుణులందరు
బయలుదేరిరి హారతులతో
దిశలు నిండెను వాద్య రవళి
మిన్ను ముట్టెను వేదఘోష
2) కుసుమ కోమలి కొమ్మ జానకి
అసమశరు శర పందెపు బొమ్మ
మరటి మారుడె మా శ్రీరాముడు
ఏరు పొగడగలరింత వైభవం
Raagam: Neelambari-based
Thaalam: Misrachaapu
Lyricist: Arudra
Music director: Pendyala Nageswara Rao
Singer: P. Leela
Jalra settings used to record this song:
Count:7
Style: Basic 1
190 BPM
Pitch: B
Pa) Evaru kannaarevaru penchaaru
Navaneetha choruni Gopala baaluni
Evaru kannaarevaru penchaaru
1) Nomu nochi nelalu mosi
neela megha shyaamu gannadi Devaki
Laalaposi paalu patti
Jola paadey kalimi kalige Yashodaki
2) Thadava thadavaku kadupu sokamu
thaalajaalaka penchanicchenu Devaki
Thaanu kanakaye thalli ayyenu
Thanayudaayenu devude Yashodaki
3) Evaru kaninaa evaru penchina
chivarikathadaanandamicchinadevariki
Avanilo thana paina enno
aasalunchinavaariki
thananaasrayinchinavaariki
ప) ఎవరు కన్నారెవరు పెంచారు
నవనీత చోరుని గోపాల బాలుని
ఎవరు కన్నారెవరు పెంచారు
1) నోము నోచి నెలలు మోసి నీలమేఘ శ్యాము గన్నది దేవకి
లాలపోసి పాలు పట్టి జోలపాడే కలిమి కలిగే యశోదకి
2) తడవతడవకు కడుపు శోకము తాళజాలక పెంచనిచ్చెను దేవకి
తాను కనకయే తల్లి అయ్యెను తనయుడాయెను దేవుడే యశోదకి
3) ఎవరు కనినా ఎవరు పెంచినా చివరికతడానందమిచ్చినదెవరికి
అవనిలో తనపైన ఎన్నో ఆశలుంచినవారికి
తననాశ్రయించినవారికి
Raagam: Saraswathi-based
Thaalam: Misrachaapu
ప) శ్వేత సుందర కుముద విలసిత భారతీ
సప్త స్వరముల గతిని వెలసిన భారతీ
గంగ యమునల హొయల నిలచిన భారతీ
సకల జనులకు సుఫలదాయిని భారతీ
1) సుధలు చిలికెడు పసిడి నగవుల సదయ వరనిధి భారతీ
సకల సుతులకు జ్ఞాన సంపదనొసగు మాతవు భారతీ
సుజనతోషిణి భారతీ
మధురభాషిణి భారతీ
సుజనతోషిణి మధురభాషిణి విమలరూపిణి భారతీ
2) మధుర ఫలముల సుతులకొసగెడు
అమృతమూర్తివి భారతీ
మధుర పదముల కవుల నుతిగొను
లలితరూపిణి భారతీ
సస్య శ్యామల భారతీ
నిత్య నిర్మల భారతీ
సస్య శ్యామల నిత్య నిర్మల శాంతి దాత్రివి భారతీ
Pa) Swetha sundara kumuda vilasitha Bharathi
Saptha swaramula gathini velasina Bharathi
Ganga Yamuna hoyala nilachina Bharathi
Sakala janulaku suphala daayini Bharathi
1) Sudhalu chilikedu pasidi nagavula sadaya varanidhi Bharathi
Sakala suthulaku jnaana sampadanosagu maathavu Bharathi
Sujana thoshini Bharathi
Madhura bhaashini Bharathi
Sujana thoshini madhura thoshini vimala roopini Bharathi
2) Madhura phalamula suthulakosagedu
amRtha moorthivi Bharathi
Madhura padamula kavula kavula nuthigonu
lalitha roopini Bharathi
Sasya shyaamala Bharathi
Nithya nirmala Bharathi
Sasya shyaamala Nithya nirmala saanthi daathrivi Bharathi
Raagam: Janjhooti
Thaalam: Khandachaapu
Pa) Saranu saranu Surendra sannutha - Saranu Sri sathi vallabhaa
Saranu rakshasa garva samhara - Saranu Venkata naayaka
1) Kamala dharudunu kamala mithrudu - Kamala sathrudu puthrudu
Kramamutho mee koluvukippudu - Kaachinaareccharikayaa
2) Animishendrulu munulu dikpathulamara kinnera siddhulu
Ghanathatho Rambhaadi kaanthalu - Kaachinaareccharikayaa
3) Ennagala Prahlaada mukhyulu - ninnu koluvaga vacchiri
Vinnapamu vinavayya Tirupathi Venkataachala naayaka
ప) శరణు శరణు సురేంద్ర సన్నుత - శరణు శ్రీసతి వల్లభ
శరణు రాక్షస గర్వసంహర - శరణు వేంకట నాయక
1) కమలధరడును కమలమిత్రుడు - కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీ కొలువుకిప్పుడు - కాచినారెచ్చరికయా
2) అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నెర సిద్ధులు
ఘనతతో రంభాది కాంతలు - కాచినారెచ్చరికయా
3) ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు - నిన్ను కొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచాల నాయక