మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం ||
1) శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం
శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం ||
2) వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం
కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ||
3) బ్రహ్మచే పూజింపబడిన చరణ యుగళికి మంగళం
జగములన్నియు కన్నతండ్రను చక్కనయ్యకు మంగళం ||
4) గోపికా గణ సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం
రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ||
Pa) Mangalam jaya mangalam maa nallanayyaku mangalam
Mangalam jaya mangalam maa Krishna Swamyki mangalam
1) Siramunanduna merayuchundedi nemali pinchaku mangalam
Shyaamalaanguni karamulandali madhura muraliki mangalam
2) Vanajadammunu dhikkarinchedi vadana sobhaku mangalam
Karuna rasamunu chinduchundedi kannudoyiki mangalam
3) Brahmachey poojimpabadina charana yugaliki mangalam
Jagamulanniyu kannathandranu chakkanayyaku mangalam
4) Gopikaa gana sevithudu Sri Govindunaku mangalam
Raadhikaa pariveshtithundou raseswarunaku mangalam
No comments:
Post a Comment