Wednesday, 23 August 2023

Haarathi meerela ivvarey - Sampradaaya Mangala Haarathi


Pa) Haarathi meerela ivvarey - Ambaku mangala

haarathi meerela ivvarey

Haarathi meerela ivvarey jnaana vidyalakella prabalamu

Leelatho padiyaaru vannela melimi bangaaru thalliki


2) Paadamulaku pooja seyarey - Maa thallikipudu

Paarijaathapu haaramivvarey

Aanimuthyapu haaramulu - mola noolu gajjelu jodu andelu

Ravvala paapita bottu mungera samamugaa dhariyinchu thalliki


3) Intha paraakelananarey - Rudruni deviki

chenthanundi poojaseyarey

Chenthanundi pooja seyarey Sankari Omkaara roopiki

Kumkumaankitha alankaariki ponkamaina subhamkaariki


4) Laksha vatthula jyothi koorcharey - chelulaara meeru

Pacchala palleramu vaalcharey

Rakshithambugaanu eerey daakshirambuga haarathulanu

Raakshasa samhaarikipudu mucchatalaraga paadukonuchu


5) Mangala haarathineeyarey - Maa thalliki

Divya mangalaa deviki

Divya mangalaa devi - Deena jana kalpavalli

Sarvaloka janani yaina bangaaru thallikipudu


6) Vedamulaku andaraani mahimaa jyothi

Aadisakthi swaroopini - Amba 

Moodu sakthulakellanu taa ( moolamai velaguchundi

Moodu lokambulanu brochunatti maa bangaaru thalliki


ప) హారతి మీరేల ఇవ్వరే - అంబకు మంగళ 

హారతి మీరేల ఇవ్వరే 

హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము 

లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారుతల్లికి 


2) పాదములకు పూజసేయరే - మా తల్లికిపుడు 

పారిజాతపు హారమివ్వరే 

ఆణిముత్యపు హారములు - మొల నూలు గజ్జెలు జోడు అందెలు 

రవ్వల పాపిట బొట్టు ముంగెర సమముగా ధరియించు తల్లికి


3) ఇంత పరాకేలననరే - రుద్రుని దేవికి 

చెంతనుండి పూజాసేయరే 

చెంతనుండి పూజసేయరే శంకరి ఓంకార రూపికి 

కుంకుమాంకిత అలంకారికి పొంకమైన శుభంకారికి


4) లక్ష వత్తుల జ్యోతి కూర్చరే - చెలులారా మీరు 

పచ్చల పళ్లెరము వాల్చరే 

రక్షితంబుగాను ఈరే దాక్షిరంబుగ హారతులను

రాక్షస సంహారికిపుడు ముచ్చటలరగ పాడుకొనుచు


5) మంగళ హారతినీయరే - మా తల్లికి 

దివ్య మంగళాదేవికి 

దివ్య మంగళా దేవి - దీనజన కల్పవల్లి 

సర్వలోక జననియైన బంగారు తల్లికిపుడు


6) వేదములకు అందరాని మహిమా జ్యోతి 

ఆదిశక్తి స్వరూపిణి - అంబ 

మూడు శక్తులకెల్లను తా( మూలమై వెలగుచుండి

మూడు లోకంబులను బ్రోచునట్టి మా బంగారుతల్లికి 



No comments:

Post a Comment