ప) పలుకు తేనెల తల్లి పవళించెను
కలికితనమున విభుని కలసినది కాన
1) నిగనిగని మోముపై నెఱులు గెలకుల చెదర
పగలైనదాక చెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారిన దాక
జగదేకపతి మనసు జట్టి కొనెగాన
2) కొంగు జారిన మెరుగు గుబ్బలోలయగ తరుణి
బంగారు మేడపై పవళించెను
చెంగలువ కనుగొనల సింగారముల దొలక
అంగజగురునితోడనలసినదిగాన
3) మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున తరుణి పవళించెను
తిరు వేంకటాచలాధిపుని కౌగిట కలసి
అరవిరై నును చెమట అంటినది గాన
Pa) Paluku thenela thalli pavalinchenu
Kalikithanamuna vibhuni kalasinadi kaana
1) Niganigani momupai nerulu gelakula cedara
pagalainadaaka cheli pavalinchenu
Thegani parinathulatho thellavaarina daaka
Jagadekapathi manasu jatti konegaana
2) Kongu jaarina merugu gubbalolayaga tharuni
bangaaru medapai pavalinchenu
Chengaluva kanugonala singaaramula dolaka
Angaja gurunithoda nalasinadigaana
3) Muripempu natanatho muthyaala malagupai
paravasambuna tharuni pavalinchenu
Thiru Venkataachalaadhipuni kougita kalasi
Aravirai nunu chemata antinadigaana
No comments:
Post a Comment