Monday, 4 October 2021

Doravale kooruchunnaadu - Thoomu Narasimha Dasu Keerthana



Raagam: Mukhari

Thaalam: Aadi

ప) దొరవలె కూరుచున్నాడు - భద్ర

గిరి నాధుడితడేమో చూడు


1) మెరుపైన చామంతి విరుల దండలు చాల

మురియుచు ధరియించి ముదిత సీతను గూడి


2) ఉరు మంచి ముత్యాల సరులు కెంపులు తాళి

మెరయుచునుండగ చిరునవ్వు మోముతో


3) కాంచన చేలము కనక కిరీటము

లాంచనములు గల లక్ష్మణాగ్రజుడిపుడు


4) విరుల చప్పరమున పరమ భక్తులు గొలువ

నరసింహదాసుని అరసి బ్రోచుటకిపుడు


Pa) Dora vale kooruchunnaadu - Bhadra

Giri naadhudithademo choodu


1) Merupaina chaamanthi virula dandalu chaala

Muriyuchu dhariyinchi muditha Seethanu goodi


2) Uru manchi muthyaala sarulu kempulu thaali

Merayuchunundaga chirunavvu momutho


3) Kaanchana chelamu kanaka kireetamu

Laanchanamulu gala Lakshmanaagrajudipudu


4) Virula chapparamuna parama bhakthulu goluva

Narasimha daasuni arasi brochutakipudu





No comments:

Post a Comment