Wednesday 29 September 2021

Choodagalgenu Ramuni sundara roopamu - Thoomu Narasimha Dasu Keerthana



Raagam: Aananda Bhairavi

Thaalam: Tisra Aadi



ప) చూడగలిగెను రాముని సుందర రూపము

వేడుకలర శ్రీ భద్రాద్రి విభుని రాఘవ ప్రభుని నేడు


1) కరకు బంగారు మకుటము

మెరయు కస్తూరి తిలకము

సరసమైన బొమలు కరుణ

కురియు కందోయి గలుగువానిని


2) నీల నీరద దేహము

మేలి పసిడి చేలము

చాల భక్త జనుల బ్రోవ

జాలు పదములు గల్గు స్వామిని


3) ఇందు వదనమందు

మందహాసము మెరయగా

అందమైన వెడదయురము

నందు ముత్యపు సరులు గలవాని


4) రత్న మంటపమందు

సీతా రమణి వామాంకమందు

యత్నముగా మెరయ మమ్మేలు

ఇన కులాంబుధి సోముని రాముని


5) ఇరు గడల చామరములిడగ

వరుస ముత్యాల గొడుగులమర

నరసింహ దాసుడు సేయు

నాట్యమవధరించు స్వామిని


Pa) Choodagaligenu Raamuni sundara roopamu

Vedukalara Sree Bhadraadri vibhuni Raghava prabhuni nedu


1) Karaku bangaaru makutamu

Merayu kasthoori thilakamu

Sarasamaina bomalu karuna

kuriyu kandoyi galuguvaanini


2) Neela neerada dehamu

Meli pasidi chelamu

Chaala bhaktha janula brova

Jaalu padamulu galgu svaamini


3) Indu vadanamandu

mandahaasamu merayagaa

Andamaina vedadayuramu

nandu muthyapu sarulu galavaani


4) Rathna mantapamandu

Seethaa ramani vaamaankamandu

yathnamugaa meraya mammelu

ina kulaambudhi somuni Raamuni


5) Iru gadala chaamaramulidaga

Varusa muthyaala godugulamara

Narasimha daasudu seya

naatyamavadharinchu swamy ni

No comments:

Post a Comment