Raagam: Janjhooti
Thaalam: Roopaka
రాముడుద్భవించినాడు రఘు కులంబున శ్రీ
తామసులను దునిమి దివిజ
స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ
1) తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందున
సరస కర్కాటక లగ్న
మరయగ సురవరులెల్ల విని కురియింపగ విరుల వాన
2) దశరధుండు భూసురులకు ధనమొసంగగా
విసరే మలయ మారుతములు
దశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప
3) కలువలను మించి కనుల కాంతి వెల్గగా
పలువరుసల మిలమిలలును
కనులుమెరయ కళలొలుకగ కిలకిలమని నవ్వుచు శ్రీ ||రాముడు ||
4) ధరను గుడిమెళ్ళంక పురమునరపి బ్రోవగా
కరుణతో శ్రీ రంగ దాసు మొరలిడగను
కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ ||రాముడు ||
sthomambula kshemamukai komali Kousalyaku Sree
No comments:
Post a Comment