Raagam: Madhyamavathi
Thaalam: (Khanda gathi) Aadi
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో
1. ఇందిరా హృదయారవిందాధిరూఢ
సుందరాకార ఆనంద రామప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో
2. బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్శితానంద రామప్రభో
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో
3. నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో
4. శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారెకును వింతగా చదువు రామప్రభో
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో
5. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో
6. పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్ర శైల రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
Paahi Ramaprabho paahi Ramaprabho
Paahi Bhadraadri Vaidehi Raamaprabho
Paahi Ramaprabho
1. Indiraa hrudayaaravindaadhiroodha
Sundaraakaara Aananda Ramaprabho
Endu ney chooda mee sundaraanandamu
kanduno kannulimponda Shyaamaprabho
2. Brundaarakaadi brundaarchitha padaara-
vindamula sandarsithaananda Raamaprabho
Thallivi neevey maa thandrivi neevey
Maa daathavu neevey maa bhraatha Ramaprabho
3. Needu baanambulanu naadu shathrula batti
baadhinpakunnaavademi Ramaprabho
Aadi madhyaantha bahirantharaathmundanuchu
Vaadinthuney Jagannaatha Ramaprabho
4. Sri Raama raamethi sreshtha manthramu saare
saarekunu vinthagaa chaduvu Ramaprabho
Sri Raama nee naama chinthanaamrutha paana
saaramey naadu madi goru Ramaprabho
5. Kaliki roopamu daalchi kali yugambuna neevu
velasithivi Bhadraadri nilaya Ramaprabho
Avyayudavaina ee avathaaramula valana
Divyulainaaru munulayya Ramaprabho
6. Paahi Srirama nee paada padmaasrayula
Paalimpumaa Bhadrasaila Ramaprabho
Paahi Ramaprabho Paahi Ramaprabho
Paahi Bhadraadri Vaidehi Ramaprabho
No comments:
Post a Comment