Thaalam: Triputa
Lyrics: Sri Gurazada Apparao
Music: Traditional
Pa) Desamunu preminchumannaa
Manchiyannadi penchumannaa
Vatti maatalu kattipettoy
Gatti mel thalapettavoy
1) Paadipantalu pongiporley
Daarilo nuvu paatupadavoy
Thindi kaligithey kanda kaladoy
Kanda kalavaadenu manushoy
2) Sontha laabham kontha maanuku
poruguvaariki thodu padavoy
Desamantey matti kaadoy
Desamantey manushuloy
3) Chettapattaal pattukoni de-
sasthulanthaa naduvavalenoy
Annadammula valenu jaathulu
mathamulannee melagavalenoy
ప) దేశమును ప్రేమించుమన్నా - మంచియన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్ - గట్టి మేల్ తలపెట్టవోయ్
1) పాడిపంటలు పొంగిపొర్లే - దారిలో నువు పాటుపడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్
2) సొంత లాభం కొంత మానుకు - పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుషులోయ్
3) చెట్టపట్టాల్ పట్టుకొని దే-శస్తులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు - మతములన్నీ మెలగవలెనోయ్
 
 
No comments:
Post a Comment