పసుపు కుంకుమ పండ్లు పడతులు పట్టిరి
పండుటాకుల మడుపు కాంతలు పట్టిరి
వేదగోష్ఠులతోను విప్రులు తరలిరి
పెండ్లివారు వచ్చిరని రాజుతో చెప్పిరి
శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము
పానకపు కావిళ్ళు పదునైదు పట్టుకువచ్చి
కౌసల్య సుమిత్ర రాజర్షి వచ్చె
గంధంబు పూసిరి గంధప్పొడి చల్లిరి
కట్నంబులిచ్చిరి వియ్యాలవారికి
శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము
కొబ్బరి చక్కెర కూర్మితోబెట్టిరి
విడిదిల్లు చూపించె విశ్రాంతి పొందుమని
నిద్రించు వియ్యాలవారు లేవండీ
ప్రొద్దునే లేవండి పొందికగా మీరు
శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము
మొగలిపూల వాసనలు ఈ బావి నీళ్ళు
ముఖాలు కడుక్కొనే వేళాయె లెండి
పొగడపూల వాసనలు మా బావి నీళ్ళు
ప్రాతః స్నానాలు చేయ వేళాయె లెండి
శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము
మల్లెపూల వాసనలు మా బావి నీళ్ళు
మాఘ స్నానాలు చేయ వేళాయె లెండి
కూరలు కాయలు గంపల్లో నింపి
శాకదానం చేయ వేళాయె లెండి
శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము
ఆవును లేగను స్తంభానికి కట్టి
గోదానము చేయ వేళాయె లెండి
మా చిన్న బాలను బుట్టలో పెట్టి
కన్యాదానము చేయ వేళాయె లెండి
శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము
పసుపు కుంకుమలంద పరుగున రండి
ఫలదానానికి వెలదిరో రండి
తాంబూల దానానికి తరలి రారమ్మా
కన్యాదానము చూడ కదలి రారమ్మా
శుభము శుభము - నిండైన పెండ్లి ఇది - శుభము శుభము
తెలుగింటి పెండ్లి ఇది - శుభము శుభము
Pasupu kumkuma pandlu padathulu pattiri
Pandutaakula madupu kaanthalu pattiri
Vedaghoshthulathonu viprulu tharaliri
Pendlivaaru vacchirani raajutho cheppiri
Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu
Paanakapu kaavillu padunaidu pattukuvacchi
Kousalya Sumithra Raajarshiyu vacche
Gandhambu poosiri gandhappodi challiri
Katnambulicchiri viyyaalavaariki
Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu
Kobbari chakkera koormitho bettiri
Vididillu choopinche visraanthi pondumani
Nidrinchu viyyaalavaaru levandee
Proddunney levandi pondikagaa meeru
Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu
Mogalipoola vaasanalu ee baavi neellu
mukhaalu kadukkoni velaaye lendi
Pogadapoola vaasanalu maa baavi neellu
Praathah snaanaalu cheya velaaye lendi
Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu
Mallepoola vaasanalu maa baavi neellu
Maagha snaanaalu cheya velaaye lendi
Kooralu kaayalu gampallo nimpi
Saakadaanam cheya velaaye lendi
Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu
Avunu leganu sthambhaaniki katti
Godaanam cheya velaaye lendi
Maa chinna baalanu buttalo petti
Kanyaadaanamu cheya velaaye lendi
Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu
Pasupu kumkumalanda paruguna randi
Phaladaanaaniki veladiro randi
Thaamboola daanaaniki tharali raarammaa
Kanyaadaanamu chooda kadali raarammaa
Subhamu subhamu - nindaina pendli idi - subhamu subhamu
Teluginti pendli idi - subhamu subhamu
No comments:
Post a Comment