Monday, 27 December 2021

Kolani dopariki gobbillo - Annamacharya Keerthana



Raagam: Yadukula Kambhoji

Thaalam: Aadi Thaalam


ప|| కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు

కుల స్వామికిని గొబ్బిళ్ళో ||



1|| కొండ గొడుగుగా గోవుల గాచిన

కొండొక శిశువుకు గొబ్బిళ్ళో

దండగంపు దైత్యుల కెల్లను తల

గుండు గండనికి గొబ్బిళ్ళో

2|| పాప విధుల శిశుపాలుని తిట్టుల

కోపగానికిని గొబ్బిళ్ళో

యేపున కంసుని యిడుమల బెట్టిన

గోప బాలునికి గొబ్బిళ్ళో



3|| దండివైరులను తరిమిన దనుజుల

గుండె దిగులునకు గొబ్బిళ్ళో

వెండిపైడి యగు వేంకట గిరిపై

కొండలయ్యకును గొబ్బిళ్ళో


Kolani dopariki gobbillo -Yadu

Kula swamikini gobbillo


1) Konda godugugaa govulu kaachina

Kondoka sisuvuku gobbillo

Dandagampu daithyulakellanu thala

Gundu gandanikigobbillo


2) Paapa vidhula Sisupaluni thittula

Kopagaanikini gobbillo

Yepuna Kamsuni idumala bettina

Gopabaaluniki gobbillo


3) Dandi vairulanu tharimina danujula

Gunde digulunaku gobbillo

Vendi paidiyagu Venkatagiripai

Kondalayyakunu gobbillo



No comments:

Post a Comment