Pa) Endukayaa Sambasivaa evaru neeku chepperayaa
Ee allari chethalu ee boodida poothalu
1) Alala thoti Gamga patti thalapaagaa chutti
Nelavankanu mallepoovu kaliki thuraayiga petti
2) Tholu patti patakaagaa kaalaagnini kutti
Kela Trisoolamu patti phaalamandu keelabetti
3) Rudrudavo Karunya samudrudavo Hara Hara Hara
Endukayaa ee daasunikandavayaa dayaamayaa
ప) ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయా
ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
1) అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
2) తోలు పట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీలబెట్టి
3) రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా
No comments:
Post a Comment