Sunday, 21 January 2024

Rama Kodanda Rama - Thyagaraja Uthsava Sampradaya Krithi




Raagam: Bhairavi

Thaalam: Aadi


Pa) Rama Kodanda Rama - Rama Kalyana Rama

Rama Pattaabhi Rama - Rama Ramaiah Rama


1) Rama Seethapathi - Rama neevey gathi

Rama neeku mrokkithi - Rama nee chejikkithi


2) Rama neekevaru jodu - Rama kreeganta choodu

Rama nenu neevaadu - Rama naatho maataadu


3) Rama naamamey melu - Rama chinthaney chaalu

Rama neevu nannelu - Rama raayadey chaalu


4) Rama needokka maata - Rama naakoka moota

Rama nee paatey paata - Rama nee baatey baata


5) Rama nenendainanu - Rama verenchalenu

Rama ennadainanu - Rama baayakalenu


6) Rama viraaja Raja - Rama mukhajitha Raja

Rama bhaktha samaaja - Rakshitha Thyagaraja

ప) రామ కోదండరామ - రామ కళ్యాణరామ 

రామ పట్టాభిరామ - రామ రామయ్య రామ 


1) రామ సీతాపతి - రామ నీవే గతి 

రామ నీకు మ్రొక్కితి - రామ నీ చేజిక్కితి 


2) రామ నీకెవరు జోడు - రామ క్రీగంట చూడు 

రామ నేను నీవాడు - రామ నాతో మాటాడు 


3) రామ నామమే మేలు - రామ చింతనే చాలు

రామ నీవు నన్నేలు - రామ రాయడే చాలు


4) రామ నీదొక్క మాట - రామ నాకొక మూట 

రామ నీ పాటే పాట - రామ నీ బాటే బాట


5) రామ నేనెందైనను - రామ వేరెంచలేను 

రామ ఎన్నడైనను - రామ బాయకలేను


6) రామ విరాజ రాజ - రామ ముఖజిత రాజ 

రామ భక్తసమాజ - రక్షిత త్యాగరాజ

No comments:

Post a Comment