Friday, 12 January 2024

Characteristics of Saveri Raaga - సావేరి రాగ లక్షణములు

  • ఇది 15వ మేళకర్త అయిన మాయామాళవగౌళ రాగజన్యము.

    ఆరోహణ సరిమపదస.

    అవరోహణ స.నిదపమగరిస

    శృతులు: షడ్జము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము

    లక్షణములు: ఔడవసంపూర్ణ రాగము. వర్జ్యరాగము. గమకవరికరక్తిరాగము. రిషభ, మధ్యమ, దైవతములు రాగచ్ఛాయాస్వరములు. పదనిదపా - స.రి.గ.రి.సా. అను ప్రయోగములలో నిషాదమును, గాంధారమును ఒక శృతికి తక్కువ పలుకుచున్నవి. నినిదమగరి - దమగరిస అను పంచమ వర్జ్య ప్రయోగములు రక్తి ప్రయోగములు. సరిమపదా అనుచోట ఏకశృతి శుద్ధదైవతము పలుకుచున్నది. అన్నివేళల పాడదగు రాగము. కానీ ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటలవరకుగానీ రాత్రిగానీ పాడుటకు తగినది. పార్శ్వదేవుని సంగీతసమయసారములోను, నారదుని సంగీతమకరందములోను ఈ రాగము పేర్కొనబడినది. ఇది చాలా ప్రాచీనమైన రాగము. కరుణరసమును వెదజల్లు రాగము. అందుచేత సంగీతనాటకములందు, నృత్యనాటకములందు ఈ రాగం వాడబడుచున్నది. షడ్జ పంచమ దైవతములందు రచనలు ప్రారంభించబడుచున్నవి.

    రచనలు:

    వర్ణం: సరసుడా - ఆదితాళం - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

    వనజాక్షి - అటతాళం - పొన్నయ్యపిళ్ళై

    కృతులు:

    రామబాణ - ఆదితాళం - త్యాగరాజు

    పరాశక్తి - ఆదితాళం - త్యాగరాజు

    శంకరి శంకురు - త్రిశ్రగతి ఆదితాళం - శ్యామశాస్త్రి

    ఎంతనేర్చినా - ఆదితాళం - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్


  • Saveri is the Janya raagam of 15th Melakarta raga Mayamalavagowla. 
  • Moorchana of Saveri raagam:
    • S R₁ M₁ P D₁ 
    •  N₃ D₁ P M₁ G₃ R₁ S
  • The notes are
    • shuddha rishabham
    • shuddha madhyamam
    • shuddha dhaivatam in ascending scale and
    • kakali nishadam
    • shuddha dhaivatam
    • shuddha madhyamam
    • anthara gandharam and
    • shuddha rishabham in descent. 
    • This raga brings out karuna rasa, i.e. it brings mood of compassion.
    • The two swaras which give the raga such a characteristic are R (Rishabham) and D (Dhaivatham).
  • It is an Audava Sampoorna Upaanga raagam.
  • This is one of the ancient raagas.
  • It creates karuna rasa (the mood of pathos or pity).
  • This raga has a soothing effect on listeners.
  • There is an old Tamil saying "Kaveri is the most popular in theerthas and Saveri in ragas".
  • The most auspicious time to sing this raagam is morning (6 am to 10 am) and afternoon (12 pm to 3 pm).
  • The equivalent of Saveri in Hindustani music is Raga Jogiya.
  • Popular compositions in Saveri:
    • Janaka sutha - Geetham
    • Sarasuda Varnam composed by Kotavasal Venkatarama Iyer
    • Sankari Sankuru - Syama Sastri
    • Durusuga - Syama Sastri
    • Janani Natajana - Syama Sastri
    • Anjaneya Raghuraamam - Maharaja Swathi Thirunal
    • Paripahi Ganadhipa - Maharaja Swathi Thirunal
    • Pahimam Sripadmanabha - Maharaja Swathi Thirunal
    • Devi Pavane (Navarathri third day krithi) - Maharaja Swathi Thirunal
    • Rama Bana - Thyagaraja
    • Tulasi Jagajjanani - Thyagaraja
    • Daridapu Leka - Thyagaraja
    • Kari Kalabha Mukham - Muthuswamy Dikshitar
    • Sri Rajagopala - Muthuswamy Dikshitar
    • Etu Namminavo Manasa - Patnam Subramania Iyer


No comments:

Post a Comment