ఈ రాగము అగ్ని అను 3వ చక్రములోని 3వ రాగము. 15వ మేళకర్త రాగము.
ఆరోహణ సరిగమపదనిస.
అవరోహణ సనిదపమగరిస
శృతులు: షడ్జము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము
లక్షణములు: సంపూర్ణ రాగము, సప్తస్వర గమక వరిక రక్తి రాగము. అనురాగ గుణమును, హాయినిచ్చు రాగము. ఉత్తమోత్తమ రాగము. సంగీతకళకు పునాది రాగము. అన్నివేళల పాడదగిన రాగము. కర్ణాటక సంగీతము నేర్చుకొనువారు ముందుగా ఈ రాగములో సరళీ, జంట, అలంకారములు నేర్చుకుందురు. గాంధార పంచమములు విశ్రాంతి స్వరములు. దోషరహిత రాగము.
షడ్జ, గాంధార, నిషాద, దైవతములపై రచనలు ప్రారంభించబడును. సంగీతరత్నాకరమునందు పేర్కొనబడిన రాగము. హిందుస్థానీ సంగీతంలో ఈ రాగమును పోలిన రాగము “భైరవ్” రాగము. పూర్వము దీనికి “మాళవగౌళ” అని పేరు. 15వ మేళకర్తగా చేయుటకు ఈ పేరునకు ముందు “మాయా” అన్న పదము చేర్చిరి. అచల స్వరములు, కంపిత స్వరములు కలిగిన రాగము. నెమ్మదిగాను, తీవ్రముగాను కూడా జంట, దాటు స్వరములు పాడవచ్చును. షడ్జమునకు రిషభము, గాంధారమునకు మధ్యమము, పంచమమునకు దైవతము, నిషాదమునకు తారషడ్జమును దాసిన స్వరములు (అనుసరించిన) కావున సరళీస్వరములు ఈ రాగములో సాధన చేయుటకు అనువైన రాగము. ఈ రాగమునందు అన్ని స్వరములు గమకంతో పాడినను పూర్ణకంపితమునకు ఇచ్చట అవకాశం లేదు. మధ్యమమున ఎక్కువగా న్యాసము (ముగింపు) మనోధర్మముచేత కనిపించుటకు తగిన జంట, దాటు, ఆహత, ప్రత్యాహత ప్రయోగములన్నింటికి వీలైన రాగము.
త్రిస్థాయి రాగము: అన్ని స్వరములు జీవస్వరములని చెప్పినప్పటికినీ, రిషభ దైవతములు ముఖ్య జీవస్వరములు. కేవలము స్వరప్రస్థాన రాగము. ఈ రాగమును ఆలపించుటకు వీలైనను భావము సంగ్రహముగా కనిపించుచున్నది. శుభప్రదమైన రాగము. కానీ, మధ్యమకాలములో పాడినా మిక్కిలి రంజకముగా ఉండును. ఈ రాగము ద్విస్వర మూర్ఛనాకారక మేళము. రిషభమును గ్రహభేదము చేసినచో, మధ్యమము వచ్చును. నాదనామక్రియ, లలిత, ఫరజు, సావేరి, మలహరి మున్నగునవి ఈ రాగ జన్యములు.
సంచారము: దపమపదప - పమగ - మగరిస - సరిమప - గమపదనిస. - స.నిగ.రి.స.నిదా - స.రి.నీ - స.నిదపమా - గమపదపమగా - పమగరీ - మగరిసా
రచనలు:
సరళీస్వరములు, జంటస్వరములు, దాటుస్వరములు, అలంకారములు
వీటిని రచించినవారు పురంధరదాసు
కృతులు: మాయాతీత స్వరూపిణి - రూపకతాళం - పున్నయ్యపిళ్ళై
తులసీదళములచే - ఆదితాళం - త్యాగరాజస్వామి
త్రినాథాది - రూపకతాళం - ముత్తుస్వామి దీక్షితార్
మేరుసమాన - ఆదితాళం - త్యాగరాజస్వామి
- ఈ రాగము అగ్ని అను 3వ చక్రములోని 3వ రాగము. 15వ మేళకర్త రాగము.
ఆరోహణ సరిగమపదనిస.
అవరోహణ స.నిదపమగరిస
- శృతులు: షడ్జము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము
- లక్షణములు:
- సంపూర్ణ రాగము, సప్తస్వర గమక వరిక రక్తి రాగము.
- అనురాగ గుణమును, హాయినిచ్చు రాగము. ఉత్తమోత్తమ రాగము.
- సంగీతకళకు పునాది రాగము. కర్ణాటక సంగీతము నేర్చుకొనువారు ముందుగా ఈ రాగములో సరళీ, జంట, అలంకారములు నేర్చుకుందురు.
- అన్నివేళల పాడదగిన రాగము.
- గాంధార పంచమములు విశ్రాంతి స్వరములు.
- దోషరహిత రాగము.
- షడ్జ, గాంధార, నిషాద, దైవతములపై రచనలు ప్రారంభించబడును.
- సంగీతరత్నాకరమునందు పేర్కొనబడిన రాగము.
- హిందుస్థానీ సంగీతంలో ఈ రాగమును పోలిన రాగము “భైరవ్” రాగము.
- పూర్వము దీనికి “మాళవగౌళ” అని పేరు. 15వ మేళకర్తగా చేయుటకు ఈ పేరునకు ముందు “మాయా” అన్న పదము చేర్చిరి.
- అచల స్వరములు, కంపిత స్వరములు కలిగిన రాగము.
- నెమ్మదిగాను, తీవ్రముగాను కూడా జంట, దాటు స్వరములు పాడవచ్చును.
- షడ్జమునకు రిషభము, గాంధారమునకు మధ్యమము, పంచమమునకు దైవతము, నిషాదమునకు తారషడ్జమును దాసిన స్వరములు (అనుసరించిన) కావున సరళీస్వరములు ఈ రాగములో సాధన చేయుటకు అనువైన రాగము.
- ఈ రాగమునందు అన్ని స్వరములు గమకంతో పాడినను పూర్ణకంపితమునకు ఇచ్చట అవకాశం లేదు.
- మధ్యమమున ఎక్కువగా న్యాసము (ముగింపు) మనోధర్మముచేత కనిపించుటకు తగిన రాగము.
- జంట, దాటు, ఆహత, ప్రత్యాహత ప్రయోగములన్నింటికి వీలైన రాగము.
- త్రిస్థాయి రాగము.
- అన్ని స్వరములు జీవస్వరములని చెప్పినప్పటికినీ, రిషభ దైవతములు ముఖ్య జీవస్వరములు.
- శుభప్రదమైన రాగము.
- మధ్యమకాలములో పాడినా మిక్కిలి రంజకముగా ఉండును.
- ఈ రాగము ద్విస్వర మూర్ఛనాకారక మేళము.
- రిషభమును గ్రహభేదము చేసినచో, మధ్యమము వచ్చును.
- నాదనామక్రియ, లలిత, ఫరజు, సావేరి, మలహరి మున్నగునవి ఈ రాగ జన్యములు.
- సంచారము: దపమపదప - పమగ - మగరిస - సరిమప - గమపదనిస. - స.నిగ.రి.స.నిదా - స.రి.నీ - స.నిదపమా - గమపదపమగా - పమగరీ - మగరిసా
- రచనలు:
- సరళీస్వరములు, జంటస్వరములు, దాటుస్వరములు, అలంకారములు - పురంధరదాసు
- కృతులు:
- మాయాతీత స్వరూపిణి - రూపకతాళం - పున్నయ్యపిళ్ళై
- తులసీదళములచే - ఆదితాళం - త్యాగరాజస్వామి
- త్రినాథాది - రూపకతాళం - ముత్తుస్వామి దీక్షితార్
- మేరుసమాన - ఆదితాళం - త్యాగరాజస్వామి
- This raga is the 3rd raga in the 3rd chakra called Agni. It is the 15th Melakarta raga.
Aarohana: Sa Ri Ga Ma Pa Da Ni Sa.
Avarohana: Sa. Ni Da Pa Ma Ga Ri Sa
- Sruthis: Shadjam, Shuddha Rishabham, Antara Gandharam, Shuddha Madhyamam, Panchamam, Shuddha Daivatam, Kakali Nishadham
- Characteristics:
- A sampoorna raaga, It's called a Saptha swara gamaka varika rakthi raaga.
- It embellishes hearts. An excellent raaga.
- This raaga is the foundation of music. Those who learn Carnatic music first learn the basic exercises, Sarali Swaras, Janta Swaras and Alankaras in this raaga.
- A raaga that can be sung at all times.
- Gandhara and Panchama are resting notes.
- A flawless raga.
- Compositions in this raaga begin with Shadja, Gandhara, Nishada, and Daivata.
- This raaga has been mentioned in Sangeetha Rathnakaram.
- Hindustani counterpart to this raaga is 'Bhairav'.
- This raga was previously called 'Malavagowla'. 'Maya' was added as prefix in order to fit it into Melakartha chart.
- This raaga has achala swaras and kampitha swaras.
- Janta swaras and Daatu Swaras can be sung slowly as well as fiercely.
- Rishabham follows Shadjam, Madhyamam follows Gandharam, Daivatham follows Panchamam, Thara Shadjam follows Nishadam. So it is an ideal raaga to practice Sarali Swaras.
- All swaras in this raaga are sung with gamakam, yet there is no scope for poorna kampitham.
- Conclusion of Manodharmam can be done mostly at Madhyamam.
- A raaga that has chance for Janta, Daatu, Aahatha, Prathyaahatha exercises.
- A Thristhaayi raaga.
- All swaras are said to be Jeeva Swaras, but Rishabham and Daivatham are the main jeeva swaras.
- An auspicious raaga.
- It is enjoyable even when sung at medium speed.
- It is a two-note moorchana mela raaga.
- On doing grahabhedam, Rishabham can become Madhyamam.
- Nadanamakriya, Lalitha, Faraju, Saveri, Malahari, etc. are derivatives of this raaga.
- Sancharam: DPMPDP - PMG - MGRS - SRMP - GMPDNS. - S.NG.R.S.ND, - S.R.N, - S.NDPM, - GMPDPMG, - PMGR, - MGRS,
- Compositions:
- Sarali Swaras, Janta Swaras, Daatu Swaras, Alankarams - Purandharadasa
- Kruthis:
- Mayatheetha Swaroopini - Roopaka Thaalam - Punnaiah Pillai
- Tulasi Dalamulachey - Aadi Thaalam - Thyagaraja
- Trinathaadi - Roopaka Thaalam - Muthuswamy Dikshitar
- Meru samaana - Aadi Thaalam - Thyagaraja
No comments:
Post a Comment