Raagam: Kharaharapriya
Thaalam: Aadi
ప) శ్రీరామ నీ నామమేమి రుచిరా
ఓ రామ నీ నామమెంత రుచిరా
1)
మధురసముల కంటె దధి ఘృతముల కంటె అతిరసమగు నామమేమి రుచిరా
2)
నవరస పరమాన్న నవనీతముల కంటెనధికమౌ నీ నామమెంత రుచిరా
3)
అంజనా తనయ హృత్కంజ దళములందు రంజిల్లు నీ నామమేమి రుచిరా
4)
సదాశివుడు మది సదా భజించెడి సదానంద నామమెంత రుచిరా
5)
సారము లేని సంసారమునకు సంతారకమగు నామమేమి రుచిరా
6)
శరణన్న జనముల సరగున రక్షించు బిరుదు కల్గిన నామమెంత రుచిరా
7)
కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణుల గాచిన నీ నామమేమి రుచిరా
8)
కదలీ ఖర్జూరాది ఫల రసముల కంటె పతిత పావన నామమెంత రుచిరా
9)
తుంబురు నారదులు డంబు మీరగ గానంబు జేసెడి నామమేమి రుచిరా
10)
అరయ భద్రాచల వర రామదాసుని ప్రేమనేలిన నామమెంత రుచిరా
Pa) Sree Rama
nee naamamemi ruchiraa
O
Rama nee naamamentha ruchiraa
1)
Madhu rasamula
kante dadhi ghruthamula kante athirasamagu naamamemi ruchiraa
2)
Navarasa
paramaanna navaneethamula kante nadhikamau nee naamamentha ruchiraa
3)
Anjanaa thanaya
hruthkanja dalamunandu ranjillu nee naamamemi ruchiraa
4)
Sadaa Sivudu madi
sadaa bhajinchedi sadaananda naamamentha ruchiraa
5)
Saaramu leni
samsaaramunaku santhaarakamagu naamamemi ruchiraa
6)
Sarananna janamula
saraguna rakshinchu birudu kalgina naamamentha ruchiraa
7)
Kariraja Prahlada
Dharanija Vibheeshanula gaachina nee naamamemi ruchiraa
8)
Kadalee
karjooraadi phala rasamula kante pathitha paavana naamamentha ruchiraa
9)
Thumburu Naaradulu
dambu meeraga gaanambu chesedi naamamemi ruchiraa
10) Araya Bharachala Vara Raama daasuni premanelina
naamamentha ruchiraa
No comments:
Post a Comment