Raagam: Janjhooti
Thaalam: Roopaka Thaalam
రామ సీతారామ రఘు రామా జయ రామా
రామా నా మనవి విని ఏమంటివి రామా
అపరాధిని నెపమెన్నక గృప జూడుము రామా
జపతపము జేసి గతి నెపమెరుగను రామా
పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామా
యేపారజ పెనుభూతము నాబాయను రామా
ఇలసౌఖ్యము అధికంబని యెంచితిరా రామా
కలకాలంబొక రీతిని గడువదు గద రామా
సుర వందిత భద్రాచల వరనిలయుడ రామా
కరుణ గలిగి రామదాసుని కరుణించవే రామా
Rama Seetharama Raghurama Jayarama
Rama naa manavi vini emantivi Rama
Aparaadhini nepamennaka krupa joodumu Rama
Japa thapamu jesi gathi nepameruganu Rama
Papathmuda bahu baadhala paalaithini Rama
Epaayaja penubhoothamu naa baayanu Rama
Ila soukhyamu adhikambani enchithiraa Rama
Kalakaalamboka reethini gaduvadu gada Rama
Sura vanditha Bhadrachala vara nilayuda Rama
Karuna galigi Ramadaasuni karuninchave Rama
Jalra settings: Pitch A#
Style - Basic 5
Count 3
No comments:
Post a Comment