Raagam: Souraashtra
Thaalam: Aadi
ప) తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనెయుండగ
1) మ్రుచ్చుసోమకుని మునుజంపినయా - మత్స్యమూర్తి మన పక్షమునుండగ
2) సురుల కొరకు మందరగిరి మోసిన - కూర్మావతారుని కృప మనకుండగ
3) దురాత్మకుని హిరణ్యాక్షు ద్రుంచిన - వరాహుండు మనవాడై యుండగ
4) హిరణ్యకసిపుని ఇరు చెక్కలుగా - పరచిన నరహరి ప్రక్కనెయుండగ
5) భూమి స్వర్గమును పొందుగ గొలిచిన - వామనుండు మనవాడై యుండగ
6) ధరలో క్షత్రియుల దండించినయా - పరశురాముడు మన దరినుండగ
7) దశగ్రీవు మును దండించినయా - దశరథరాముని దయ మనకుండగ
8) ఇలలో యదుకులమందుదయించిన - బలరాముడు మన బలమైయుండగ
9) దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగ
10) కలియుగాంతమున కలిగెడి దైవము - కలికి మనలను కావగనుండగ
11) రామదాసునిల రక్షించెదనని - ప్రేమతో పలికిన ప్రభువిటనుండగ
Pa) Thakkuvemi manaku Raamundokkadundu varaku
Pakka thodugaa Bhagavanthudu mana Chakradhaariyai chenthaneyundaga
1) Mrucchusomakuni munujampinayaa
Mathsya moorthi mana pakshamunundaga
2) Surala koraku Mandaragiri mosina
Koormaavathaaruni krupa manakundaga
3) Duraathmakuni Hiranyaakshu drunchina
Varaahundu manavaadai yundaga
4) Hiranyakasipuni iru chekkalugaa
parachina Narahari prakkaneyundaga
5) Bhoomi swargamunu ponduga golichina
Vaamanundu manavaadai yundaga
6) Dharalo kshathriyula dandinchinayaa
Parasu Raamudu mana darinundaga
7) Dasagreevu munu dandinchinayaa
Dasaratha Raamuni daya manakundaga
8) Ilalo Yadukulamandudayinchina
Balaraamudu mana balamai yundaga
9) Dushta Kamsuni drunchinatti Sri
Krishnudu manapai krupathonundaga
10) Kaliyugaanthamuna kaligedi daivamu
Kaliki manalanu kaavaganundaga
11) Raamdaasunila rakshinchedanani
prematho palikina prabhuvitanundaga
No comments:
Post a Comment