Thursday, 30 November 2023

Basic Concepts of Carnatic Music - Theory - Part 1

Sangeetham:

”samyak geetham sangeetham”

sam + geetham = sangeetham (a melodious song)

“Raaga swarascha taalascha tribhi hi sangeetamucchathe”, as mentioned in Sangeetha Ratnaakaram.

Sangeetam is a symphony of raaga, swara and taala.

When presented with systematic rules, it is a discipline. It is called “Sasthreeya Sangeetha” (classical music).

"Sadayah Phalanthu Sangeetham"

Music offers all good results like moksha when practiced with devotion.

సంగీతము:

”సమ్యక్ గీతమ్ సంగీతమ్”

సం + గీతం = సంగీతం (మధురమైన గీతం)

“రాగస్వరశ్చ తాళశ్చ త్రిభిః సంగీతముచ్చతే” అని సంగీత రత్నాకరంలో చెప్పబడింది.

రాగ, స్వర, తాళముల చేరికయే సంగీతం అని పూర్వీకులు పేర్కొన్నారు.

భక్తిగా నియమాలతో సాధన చేస్తే అదే 'శాస్త్రీయ సంగీతం'.

"సద్యః ఫలంతు సంగీతం"

భక్తితో సాధన చేస్తే మోక్షాది ఉత్తమమైన ఫలాలను ఇస్తుంది.



Sruthi (Pitch):

“Srooyanthi iti srutayaha”

श्रूयन्ति इति शृतयः

Sruthi is a special musical note of sound which attracts the attention of human ear. 

There are Dwaavimsathi (22) sruthis each, originating from heart, vocal cords and head of humans.

The 22 sruthis originating from the heart are 'mandra sruthis'.

The 22 sruthis originating from the vocal cords are 'madhyama sruthis'.

The 22 sruthis originating from the head are 'thaaraa sruthis'.

Thus, at every sthaayi, there are 22 sruthis.

Some theories say that there are 24 sruthis and some say that there are innumerable sruthis (Anaahatha).

Bharatha is the foremost musicologist who mentioned in Natya Sasthra that there are 22 sruthis.

Chathushchathushchathushchaiva

shadja madhyama panchamaaha |

dvedve nishaada gaandhaarou

thristhreershibhadhaivathou ||


 चतुश्चतुश्चतुश्चैव षड्जमध्यमपञ्चमाः ।

द्वे द्वे निषादगान्धारौत्रिस्त्रीर्षिभधैवतौ ॥

So in an octave, in the order of aarohana, the number of sruthis is

4 + 3 + 2 + 4 + 4 + 3 + 2 = 22 sruthis

Aadhaara Sruthi: In which sruthi we can sing comfortabley from Madhyamam of Mandra Sthaayi to Panchamam of Thaaraa Sthaayi, we should pick that as our Aadhaara Sruthi.


శ్రుతి (Pitch):

“Srooyanthi iti srutayaha”

श्रूयन्ति इति शृतयः

శ్రవణేంద్రియములకు వినపడు ధ్వనినే శృతి అంటారు.

హృదయము, కంఠము, శిరముల నుండి ఒకొక్కదాని నుండి ద్వావింశతి (22) శృతులు వెలువడతాయి.

హృదయము నుండి ఏర్పడు 22 శృతులు "మంద్ర శృతులు'.

కంఠము నుండి ఏర్పడు 22 శృతులు 'మధ్యమ శృతులు'.

శిరము నుండి ఏర్పడు 22 శృతులు 'తారా శృతులు'.

కనుక మొత్తం 66 శృతులు. ఒకొక్క స్థాయి నుండి 22 శృతులు ఉద్భవిస్తాయని చెప్పవచ్చు.

అనాహత నాదములను కూడా లెక్కలోకి తీసుకుంటే లెక్కలేనన్ని శృతులు ఉన్నాయని కొందరు అంటారు.

మొట్టమొదటగా ఈ 22 శృతులగురించి ప్రస్తావించినవారిలో ఒకరు భరతముని. ఆయన నాట్య శాస్త్రమునందు ఇలా ప్రస్తావించారు.

చతుశ్చతుశ్చతుశ్చైవ షడ్జమధ్యమ పంచమాః ।

ద్వేద్వే నిషాద గాంధారౌ త్రిస్త్రీర్షిభధైవతౌ ॥


 चतुश्चतुश्चतुश्चैव षड्जमध्यमपञ्चमाः ।

द्वे द्वे निषादगान्धारौत्रिस्त्रीर्षिभधैवतौ ॥

ఒక స్థాయిలోని స్వరాల్లో, వరుసగా ఏర్పడే శృతుల సంఖ్య:

4 + 3 + 2 + 4 + 4 + 3 + 2 = 22 శృతులు అన్నమాట.

ఆధార శృతి : ఏ శృతిలో అయితే మంద్రస్థాయి మధ్యమం నుంచి తారాస్థాయి పంచమం వరకు సులువుగా పాడగలుగుతున్నామో దానిని మనకి ఆధార శృతిగా ఎంచుకోవాలి.


Naadam:

Musical sound that is pleasant to hear is called “Naadam”. It is generated by the combination of “Praana” (nakaaram) and “Agni” (dakaaram). Continuous practice of Naadam is called “Naadopaasana”.

Naadam is produced in Brahma granthi (the region of life force), which passes through naabhi (naval region), hridaya (heart), kantha (voice), shira (head) and vaadana (mouth).

There are 2 types of naadas, Aahatha and Anaahatha naadam.

Aahatha Naadam is produced by the effort of man. Man articulates and produces the sound with his genius effort. Entire music of present day is deemed as “Aahatha Naadam”.

Anaahatha Naadam is produced by yogis without effort. This kind of yogic practice is called ‘Bhramari’. The sound will be in the form of Pranava or Omkara produced by sages during penance.

Types of Aahatha Naadam:

1) Sareeraja naadam: It originates from human body. (Singing, humming)

2) Nakhaja naadam: It originates from touching something with nails. (Ex: Veena, Sitar)

3) Vaayuja naadam: It originates from blowing air. (Ex: Shahnai, Sannayi, Flute)

4) Charmaja naadam: It originates from the touch or friction of skin. (Ex: Mridangam, Tabla, Dolu, Dholak)

5) Dhanurja naadam: It originates from the touch of a bow. (Ex: Violin, viola, Sarangi)


6) Lohaja naadam: It originates from the touch of metals. (Joudara, Brahma Thaalam)

నాదం:

వినటానికి హాయిగా ఉండే ధ్వనిని "నాదం" అంటారు. ఇది ప్రాణాగ్నుల సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది. నాదాన్ని శ్రద్ధగా అభ్యసించటాన్ని "నాదోపాసన" అంటారు.

నాదం బ్రహ్మగ్రంధిలో పుట్టి, నాభి, హృదయం, కంఠం, శిరము, నోటీ ద్వారా వెలువడుతుంది.

నాదంలో రెండు రకాలు ఉంటాయి. ఆహత నాదం, అనాహత నాదం.

ఆహత నాదం మానవుని ప్రయత్నం చేత పుడుతుంది. ప్రస్తుత కాలంలో మనం వింటున్నది అంతా ఆహతనాదమే,

అనాహత నాదం యోగసాధన లోంచి పుడుతుంది. ఋషుల తపోసమయంలో "భ్రామరి" అనే అభ్యాసంలోంచి పుట్టే ఈ ధ్వని ప్రణవాకారం (ఓంకార ఆకారం) లో ఉంటుంది..

ఆహతనాదంలోని రకాలు:

1) శరీరజ నాదం: మానవుని శరీరంలోంచి పుట్టే నాదం (పాట, కూనిరాగం)

2) నఖజ నాదం: గోటితో మీటటం వల్ల ఏర్పడే ధ్వని (ఉదా: వీణ, సితార)

3) వాయుజ నాదం: గాలి ఊదటం వల్ల ఏర్పడే నాదం (ఉదా: షెహనాయి, సన్నాయి, వేణువు)

4) చర్మజ నాదం: చర్మం యొక్క రాపిడివల్ల పుట్టే నాదం (ఉదా: మృదంగం, తబలా, డోలు, ఢోలక్)

5) ధనుర్జ నాదం: ధనుస్సులోంచి పుట్టే ధ్వని (ఉదా: వయోలిన్, వయోలా, సారంగి)

6) లోహజ నాదం: లోహమునుంచి పుట్టే ధ్వని (జౌదర, బ్రహ్మతాళం)


Sareeraja naadam


Nakhaja naadam





 

Vaayuja naadam




Charmaja naadam




Dhanurja naadam

Lohaja naadam



Swara (Note):

Sarngadeva stated in 'Sangeetha Ratnaakaram'..

“Swato ranjayanthi srothr chittham sa swaramuchyate

Swathah = on its own

Ranjayathi = to please

Thus, swara is the frequency of sound which spontaneously embellishes and gives delight to the listeners mind and heart. Swaras are 7 in number.

 

Swara Sthaanas

Shadjam (Peacock's cry)

Rishabham (Bull's lowing)

Gaandhaaram (Goat's bleating)

Madhyamam (Dove's calling)

Panchamam (Cuckoo/Nightingale's calling)

Daivatham (Horse's neighing)

Nishaadam (Elephant's trumpeting)

  

Classification of Swaras

Prakruthi and Vikruthi Swaras:

Prakruthi swarasThe swaras which have no variety are called “Prakruthi Swaras”. They have constant frequency or position. S, P are Prakruti swaras or Natural swaras or Achala swaras.

Vikruthi swarasThe swaras that have more than one frequency are called “Vikruthi Swaras”. R, G, M, D, N are Vikruthi swaras or Chala swaras.

 


Dwaadasa Swara Sthaanas

Shadjam

Suddha Rishabham

Chatusruthi Rishabham

Saadhaarana Gaandhaaram

Anthara Gaandhaaram

Suddha Madhyamam

Prathi Madhyamam

Panchamam

Suddha Daivatham

Chathusruthi Daivatham

Kaishiki Nishaadam

Kaakali Nishaadam

However, in Carnatic music, 16 swara sthaanas are in use, to facilitate the classification of raagas using KaTaPaYaadi system.

 

Shodasa Swaras

S

Shadjam

R1

Suddha Rishabham

R2

Chatusruthi Rishabham

R3

Shatsruthi Rishabham

G1

Suddha Gaandhaaram

G2

Saadhaarana Gaandhaaram

G3

Anthara Gaandhaaram

M1

Suddha Madhyamam

M2

Prathi Madhyamam

P

Panchamam

D1

Suddha Daivatham

D2

Chathusruthi Daivatham

D3

Shatsruthi Daivatham

N1

Suddha Nishaadam

N2

Kaishiki Nishaadam

N3

Kaakali Nishaadam

1) Chatusruthi Rishabham and Suddha Gaandhaaram (R2 and G1)

2) Shatsruthi Rishabham and Saadhaarana Gaandhaaram (R3 and G2)

3) Chathusruthi Daivatham and Suddha Nishaadam (D2 and N1)

4) Shatsruthi Daivatham and Kaishiki Nishaadam (D3 and N2)

These pairs of swaras have the same frequency.

So they should not appear together in the same raagam.

స్వరము:

సంగీత రత్నాకరము అనే గ్రంథములో శార్ఙ్గదేవుడు 

“స్వతో రంజయతి శ్రోతృ చిత్తం స స్వరముచ్యతే

అని పేర్కొన్నారు.

స్వతః = తనంతట తానుగా

రంజయతి = రంజింపజేసేది

వినేవారి మనసుకి ఆహ్లాదము కలిగించు ధ్వనిని 'స్వరము' అంటారు.

స్వరములు ఏడు.

 

స్వర స్థానములు

షడ్జము (నెమలి స్వరం)

రిషభము (ఎద్దు స్వరం)

గాంధారము (మేక స్వరం)

మధ్యమము (పావురం స్వరం)

పంచమము (కోయిల స్వరం)

దైవతము (గుఱ్ఱం స్వరం)

నిషాదము (ఏనుగు స్వరం)

  

స్వరములలో రకములు

ప్రకృతి మరియు వికృతి స్వరములు:

ప్రకృతి స్వరములు: స్వర స్థానములో మార్పు లేనివి. స, ప ప్రకృతి స్వరములు. ఎందుకంటే ఈ రెండూ ఎప్పుడూ ఒకే స్థానములో ఉంటాయి. చలనము లేనివి కాబట్టి వీటిని "అచల స్వరాలు" అని కూడా అంటారు.

వికృతి స్వరములు: ఒకటి కంటే ఎక్కువ స్థానములు గల స్వరాలను "వికృతి స్వరాలు" అని గానీ, "చల స్వరాలు" అని గానీ అంటారు. రి, గ, మ, ద, ని వికృతి స్వరాలు. 

ద్వాదశ స్వర స్థానములు

షడ్జము

శుద్ధ రిషభము

చతుశృతి రిషభము

సాధారణ గాంధారము

అంతర గాంధారము

శుద్ధ మధ్యమము

ప్రతి మధ్యమము

పంచమము

శుద్ధ దైవతము

చతుశ్శృతి దైవతము

కైశికి నిషాదము

కాకలి నిషాదము

అయితే, కర్ణాటక సంగీతంలో కటపయాది సూత్రం ప్రకారం రాగాల విభజన చేయటంకోసం 16 స్వరస్థానాలు వాడుకలో ఉన్నాయి.


షోడస స్వరములు

షడ్జం

రి1

శుద్ధ రిషభం

రి2

చతుశ్శృతి రిషభం

రి3

షట్శృతి రిషభం

గ1

శుద్ధ గాంధారం

గ2

సాధారణ గాంధారం

గ3

అంతర గాంధారం

మ1

శుద్ధ మధ్యమం

మ2

ప్రతి మధ్యమం

పంచమం

ద1

శుద్ధ దైవతం

ద2

చతుశ్శృతి దైవతం

ద3

షట్శృతి దైవతం

ని1

శుద్ధ నిషాదం

ని2

కైశికి నిషాదం

ని3

కాకలి నిషాదం

1) చతుశ్శృతి రిషభం మరియు శుద్ధ గాంధారం (రి2 and గ1)

2) షట్శృతి రిషభం మరియు సాధారణ గాంధారం (రి3 and గ2)

3) చతుశ్శృతి దైవతం మరియు శుద్ధ నిషాదం (ద2 and ని1)

4) షట్శృతి దైవతం మరియు కైశికి నిషాదం (ద3 and ని2)

ఈ జతల్లోని స్వరాలు ఏ రాగంలోనూ ఏచోటా రెండూ కలిసి ఉండవు ఎందుకంటే ఆయా స్వరాలకు ఒకటే ధ్వని (frequency) ఉంటుంది కనుక.




Sthaayi (Octave):

The range of swaras from Shadjam to Nishadam. There are five Sthaayis.

1. Anumandra (denoted by 2 dots under the swara)

2. Mandra (denoted by 1 dot under the swara)

3. Madhya (denoted without any dots)

4. Thaara (denoted by 1 dot above the swara)

5. Athithaara (denoted by 2 dots above the swara

However, only three are used mostly. They are

1. Mandra

2. Madhya

3. Thaara

స్థాయి:

షడ్జం నుండి నిషాదం వరకు స్వరాలను స్థాయి అంటారు. 5 స్థాయిలు ఉన్నాయి. అవి:

1. అనుమంద్రస్థాయి (స్వరము కింద రెండు బిందువులు ఉంటాయి)

2. మంద్రస్థాయి (స్వరము కింద ఒక బిందువు ఉంటుంది)

3. మధ్యస్థాయి (ఏ బిందువూ ఉండదు)

4. తారాస్థాయి (స్వరము పైన ఒక బిందువు ఉంటుంది)

5. అతితారాస్థాయి (స్వరము పైన రెండు బిందువులు ఉంటాయి)

అయితే సాధారణంగా మనం వాడేది మూడు స్థాయిలనే. అవి:

1. మంద్రస్థాయి

2. మధ్యస్థాయి

3. తారాస్థాయి


 

Arohana & Avarohana:

Arohana denotes the ascending stair of notes i.e., SRGMPDNS

Avarohana denotes the descending stair of notes i.e., SNDPMGRS

Moorchana is the ascending and the descending order together

ఆరోహణ - అవరోహణ:

ఆరోహణ అంటే కింది స్వరాలనుండి ఎగువ స్వరాలకు వెళ్ళే క్రమం. ఉదా: సరిగమపదనిస

అవరోహణ అంటే పై స్వరాలనుండి దిగువ స్వరాలకు వచ్చే క్రమం. ఉదా: సనిదపమగరిస

ఆరోహణను, అవరోహణను కలిపి మూర్ఛన అంటారు.

 

Dhaathu and Maathu:

Dhaathu: The swara part of a musical composition is known as Dhaathu.

Ex. GGP,P, (in Varaveena geetham) 

Maathu: The saahithyam part (the literary counterpart) of dhaathu in a composition is called maathu.

Ex. Varaveena Geetam starts with 4 maatus – Va, ra, vee, na


ధాతువు - మాతువు:

ధాతువు: ఒక పాటలోని స్వర భాగాన్ని 'ధాతువు' అంటారు.

ఉదా: గగప,ప, ('వరవీణా' గీతంలో) 

మాతువు: ఒక పాటలోని సాహిత్య భాగాన్ని 'మాతువు' అంటారు.

ఉదా: వరవీణా అనే గీతం మొదలయ్యేది వ, ర, వీ, ణా అనే మాతువులతో.



Poorvaangam and Uttharaangam:

Poorvaangam and Uttharaangam are applicable to swaras, mela, compositions, thaalam, Raagam-Thaanam-Pallavi and so on. When they are divided into two parts, the first part is called 'Poorvaangam' and the second part is called 'Uttharaangam'. 

పూర్వాంగము - ఉత్తరాంగము:

స్వరములకైనా, కీర్తనలకైనా, వర్ణాలకైనా, తాళానికైనా, రాగం-తానం-పల్లవులకైనా, దేనికైనా సరే, మొదటి సగభాగాన్ని పూర్వాంగం అని, రెండవ సగభాగాన్ని ఉత్తరాంగం అని పిలుస్తారు.


Sangathi:

The positive development of phrases in a krithi, depicting the emotional fervour of the words is called 'sangathi'. Sangathis lead to the systematic development of neravalu or vinyaasam of Manodharma sangeetham.

సంగతి:

కృతిలో గానీ కీర్తనలో గానీ సాహిత్యానికి మరింత అందాన్ని చేకూరుస్తూ, భావాన్ని ఇనుమడింపజేసేలా విధవిధములుగా ఒకొక్క పంక్తిని పాడితే వాటిని 'సంగతులు' అంటారు. మనోధర్మ సంగీతంలో నెరవలు లేక విన్యాసం చేయటానికి ఈ సంగతులు మొదటి మెట్టు.


Thaalam:

This is the measuring unit of time scale (tempo) of a musical composition.

Detailed explanation of the concept of thaalam is in this link:

https://srimansangeethanilayam.blogspot.com/2021/12/concept-of-thaalam-theory.html

తాళం:

ఏదైనా సంగీత రచనను కొలిచే పరిమాణమే తాళం. తాళాన్ని గురించిన మరిన్ని వివరాలు ఈ లింక్ లో ఉన్నాయి:

https://srimansangeethanilayam.blogspot.com/2021/12/concept-of-thaalam-theory.html



Aavartham:

All the prescribed angas of a particular thaalam coming once in that thaalam is called an 'Aavartham'. While writing notation, each anga ends with a | sign and each aavartham ends with a || sign.

ఆవర్తము:

ఒక తాళంలోని అంగములన్నీ ఒకసారి పూర్తి అవ్వటాన్ని ఒక ఆవర్తమని అంటారు. సంగీత రచనలోని ధాతువుని రాసేటప్పుడు ఒకొక్క అంగానికి చివర | గుర్తు, ఒకొక్క ఆవర్తానికి చివర || గుర్తు ఉపయోగిస్తాము.


Kaalam:

Kaalam is the measurement of speed of a composition. There are 6 speeds in music.

In each kaalam, the number of swaras is doubled (1, 2, 4, 8, 16, 32). In practice, only three degrees of speed are used. Trikaalam:

a) Vilamba (slow)/ Prathama kaalam (First speed): Slowest tempo having one short syllable per kriya

b) Madhya (medium)/ Dwiteeya kaalam (Second speed): The tempo of singing is double as compared to Prathama kaalam.

c) Dhrutha (fast)/ Triteeya kaalam (Third speed)The tempo is 4 times as fast as Prathama kaalam or twice compared to Dwiteeya kaalam.

Kaalas have 2 types of counting: Akshara Kaala and Maathra Kaala

Aksharakaalam: One akshara in each count

This is the time taken to sing one short syllable. In elementary lessons and abhyaasa compositions like geethams, akshara kaalas are used.

Maathrakaalam:

Maathra Kaala has 4 aksharas or swaras in a single count. This single count of 4 swaras is called a 'maathra'. Swarajathis, Jathi Swaras, Thaana Varnams, Padavarnams, Vilamba Kaala Krithis are composed in maathra kaala.

కాలం:

సంగీత రచనను కొలిచే పరిమాణమే 'కాలము'. సంగీతంలో ఆరు కాలాలు ఉంటాయి.

ఒకొక్క కాలంలోను స్వరాల సంఖ్య రెట్టింపు అవుతుంది (1, 2, 4, 8, 16, 32).

అభ్యాసంలో మూడు కాలాలు మాత్రమే ఉపయోగిస్తాము.

త్రికాలం:

a) విలంబ/ ప్రథమ కాలం (మొదటి కాలం): ఒకొక్క క్రియకి ఒకొక్క అక్షరం పాడటం

b) మధ్య/ ద్వితీయ కాలం (రెండవ కాలం): ఒకొక్క క్రియకి రెండేసి అక్షరాలు పాడటం (ప్రథమ కాలానికి రెట్టింపు వేగం)

c) ధృత / తృతీయ కాలం (మూడవ కాలం): ఒకొక్క క్రియకి నాలుగు అక్షరాలు పాడటం (ఒకటవ కాలానికి నాలుగింతల వేగం, రెండవ కాలానికి రెట్టింపు వేగం)


కాలాన్ని రెండు ప్రమాణాలతో కొలుస్తారు:

అక్షరకాలం మరియు మాత్రాకాలం

అక్షరకాలం: ఒకొక్క అక్షరం ఒక కొలమానం

అంటే ఒకొక్క అక్షరాన్ని పలకటానికి పట్టే కాలం. అభ్యాసంలో మొదటిలో (అంటే సరళీస్వరాలు మొదలుకొని గీతాల వరకు) అక్షరకాలాన్ని అనుసరించి నేర్చుకుంటాము.

మాత్రాకాలం: నాలుగేసి అక్షరాలు ఒక కొలమానం

నాలుగు స్వరాలను కలిపి ఒక 'మాత్ర' అంటాము. స్వరజతులు, జతిస్వరములు, తానవర్ణములు, పదవర్ణములు, విలంబకాల కృతులు మాత్రాకాలంలోనే కూర్చబడి ఉంటాయి.



Thourya Trikam:

Vocal music, instrumental music and dance together are called “Thourya Trikam”.


తౌర్య త్రికము:

సంగీతము, వాద్యసంగీతము, నాట్యము మూడింటిని కలిపి "తౌర్య త్రికము" అంటారు.





Trimurthi of music:

 

Composer

Mudra/ Signature

Thyagaraja Swamy

Thyaagaraja nutha/vinutha

Muthuswamy Deekshitar

Sri Guruguha/ Guruguha

Syama Sastry

Syamakrishna


 

Father of music (Sangeeta Pithamaha): Sri Purandhara dasu (1484 - 1564)

Mudra: Sri Purandara vittala

కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులు:

 

వాగ్గేయకారులు

ముద్ర

త్యాగరాజస్వామి

త్యాగరాజనుత/ వినుత

ముత్తుస్వామి దీక్షితులు

శ్రీ గురుగుహ/ గురుగుహ

శ్యామశాస్త్రి

శ్యామకృష్ణ 

కర్ణాటక సంగీత పితామహులు: శ్రీ పురంధరదాసు (1484 - 1564)

ముద్ర: శ్రీ పురంధర విఠల








 

Laws of Vibration:

Also known as ‘Gamakas’. Venkatamakhi Govinda Deekshitulu stated about 15 gamakas which are known as panchadasa gamakas. Gamakam refers to ornamentation used in performance of Indian Classical Music. Gamaka is any graceful turn, curve or cornering touch given to a single note or a group of swarams, which adds emphasis to each raga individually.

Panchadasa Gamakas (15):

1. Kampithamu

2. Leenamu

3. Andolithamu

4. Plapithamu

5. Sphurithamu

6. Thirupamu

7. Ahathamu

8. Vali

9. Ullasithamu

10. Hampithamu

11. Kurulamu

12. Tribhinnamu

13. Mudritamu

14. Namithamu

15. Misrithamu

 



Classification of Ragas:


Swaraantara Raagas (4 swaras either in Aarohana or Avarohana)

Audava Raagas (5 swaras)

Shaadava Raagas (6 swaras)

Sampoorna Raagas (7 swaras)


Janaka Raagas and Janya Raagas

Janaka Ragas - Parent Raagas/ Melakartha Raagas

They all are Sampoorna Raagas. They give rise to thousands of child raagas. 

Janya ragas – These are derived or child ragas. They are formed from any of the 72 melakartha raagas. It is said that there are total number of 34,776 janya ragas.


Janya ragas and their classifications – Varjya, Vakra, Upaanga and Bhashaanga


Varjya Ragas – In which few swarams are missing either in Arohanam or

Avarohanam.

Ex. 1) Mohana (Ma, Ni missing); Suddha Saveri (Ga, Ni missing)


Vakra Ragas – Where swarams or moorchana of the ragam is not in order and

is in vakra or zigzag or a jumbled manner.

Ex. Ananda bhairavi - SGRGMPDPS; Sri ragam - SNPDNPMRGRS


Upaanga Ragas – Where only swarams of melakarta or janaka ragam are used. 

These may be either few missing swaras or in vakram is a Upaanga ragam. 

Ex. Vasanta, Mohana, Malahari


Bhashanga Ragas – They have an anya swara (foreign or accidental note).

They can be in any numbers and they are not concerned to the janaka ragam.

Starting from 1 anya swarams to 5 anya swaram.

This is adopted to enlighten the beauty of the particular ragam. This anya swaram may or may not be present in the moorchana but used in certain phrases while singing.

Ex. 1) Bhairavi – in Arohanam, chatusruthi daivatam is used while suddha

daivatam in avarohanam.

2) Kambhoji – Kakali Nishadam is used in the phrase ‘SNP’ without D in

between.

Janaka ragams in their detailed forms:

Also called as 72 Melakartas, named as Kanakangi, Ratnangi etc.

72 ragams are divided into 12 chakras with 6 ragams each.

The first 6 chakras are suddha madhyama ragams and the other 6 ragams are prati madhyama ragas.

For further information regarding Melakartha system (KaTaPaYaadi System):


https://srimansangeethanilayam.blogspot.com/2022/11/katapayaadi-classification-of-raagas.html


Classification of Ragas based on gender:

Sangita Makaranda also classifies the ragas according to their gender i.e. Male Ragas, Female Ragas (i.e., Raginis) and Neuter Ragas. According to Narada, the Male Ragas depict emotions of Raudra (anger), Veera (heroic) and Bhayanaka (fearful); the Female Ragas represent sentiments of Shringara (romantic and erotic), Hasya (humorous) and Karuna (sorrow); while the Neuter Ragas represent emotions of Vibhatsa (disgustful), Adbhuta (amazement) and Shanta (peaceful).


రాగముల విభజన:


స్వరాంతర రాగములు (ఆరోహణలో గానీ అవరోహణలో గానీ 4 స్వరములు ఉంటాయి)

ఔడవ రాగములు (5 స్వరములు)

షాడవ రాగములు (6 స్వరములు)

సంపూర్ణ రాగములు (7 స్వరములు)


జనక రాగములు మరియు జన్య రాగములు


జనక రాగములు - మేళకర్త రాగములు అని కూడా అంటారు.

ఇవన్నీ సంపూర్ణ రాగాలే.వీటినుంచే వేలకొలది జన్య రాగాలు పుట్టాయి.

జన్య రాగములు – ఇవి 72 మేళకర్త రాగములలో ఏదో ఒకదానినుండి నుంచి పుట్టినవి. మొత్తం జన్యరాగాల సంఖ్య 34,776 అని అంటారు.


జన్య రాగములలో రకములు – వర్జ్య, వక్ర, ఉపాంగ, భాషాంగ రాగములు.


వర్జ్య రాగములు – జనక రాగంతో పోల్చినప్పుడు ఆరోహణలో గానీ అవరోహణలో గానీ ఒకటి గానీ కొన్ని గానీ స్వరములు లోపిస్తే వాటిని వర్జ్య రాగములు అంటారు.

ఉదా. 1) మోహన (మ, ని ఉండవు); శుద్ధసావేరి (గ, ని ఉండవు)


వక్ర రాగములు – మూర్ఛనలో స్వరాలు ఒక క్రమపద్ధతిలో కాకుండా వక్రంగా ఉంటాయి.

ఉదా. ఆనందభైరవి - సగరిగమపదపస; శ్రీరాగం - సనిపదనిపమరిగరిస


ఉపాంగ రాగములు – జనక రాగంలోని స్వరములు మాత్రమే ఉండే రాగాలు.

ఉదా. వసంత, మోహన, మలహరి


భాషాంగ రాగములు – జనక రాగంలో లేని ఒక స్వరం గానీ కొన్ని స్వరాలు గానీ ఉండే రాగాలు. అలా కొత్తగా కనిపించే స్వరాన్ని అన్య స్వరం అంటారు. ఒకటి నుండి ఐదు వరకు ఎన్నైనా అన్యస్వరాలు ఉండవచ్చు. ఈ అన్యస్వరం రాగ మూర్ఛనలో ఉండచ్చు, ఉండకపోవచ్చు. మూర్ఛనలో లేకపోయినా కొన్నికొన్ని ప్రయోగాల్లో మాత్రం కనిపిస్తుంది. రాగం యొక్క అందాన్ని ఇనుమడింపజేయటానికి అన్యస్వర ప్రయోగం ఉంటుంది.

ఉదా. 1) భైరవి – ఆరోహణలో చతుశ్శృతి దైవతం, అవరోహణలో శుద్ధ దైవతం ఉంటుంది.

2) కాంభోజి – 'సనిదప' అన్నప్పుడు మూర్ఛనలో ఉన్న కైశికి నిషాదం వచ్చినప్పటికీ, 'సనిప' అన్న ప్రయోగం ఎక్కడ వచ్చినా కాకలి నిషాదం వస్తుంది.


జనక రాగముల గురించి మరింత వివరణ:

కనకాంగి, రత్నాంగి మొదలైన 72 మేళకర్త రాగాలను కటపయాది సూత్రాన్ని అనుసరించి 12 చక్రములుగా విభజించారు. ఒకొక్క చక్రములోను 6 రాగాలు.

మొదటి 6 చక్రాలలోను శుద్ధమధ్యమ రాగాలను, తక్కిన 6 చక్రాలలోను ప్రతిమధ్యమ రాగాలను అమర్చారు.

కటపయాది సూత్రం, మేళకర్త రాగాల వర్గీకరణకు సంబంధించిన మరింత సమాచారం ఈ లింక్ లో దొరుకుతుంది.


https://srimansangeethanilayam.blogspot.com/2022/11/katapayaadi-classification-of-raagas.html


Classification of Ragas based on gender:

Sangita Makaranda also classifies the ragas according to their gender i.e. Male Ragas, Female Ragas (i.e., Raginis) and Neuter Ragas. According to Narada, the Male Ragas depict emotions of Raudra (anger), Veera (heroic) and Bhayanaka (fearful); the Female Ragas represent sentiments of Shringara (romantic and erotic), Hasya (humorous) and Karuna (sorrow); while the Neuter Ragas represent emotions of Vibhatsa (disgustful), Adbhuta (amazement) and Shanta (peaceful).






No comments:

Post a Comment