Wednesday 23 October 2019

Chakkera Kalipina - Light Music Song


Lyricist: Sri Jonnavitthula Ramalingeswara Rao

Chakkera kalipina theeyani kammani thodu perugu Telugu
Chakkani palukula sobagula nadakala hamsa hoyala bedagu
Nannaya Thikkana Errana pithikina aavu paala podugu
Chaduvula thalliki sumadhura sailiki puttinillu Telugu

Himagiri jalanidhi padamula amarina jilugu velugu Telugu
Ganayathi praasala rasadhvani saakhala kavithalallu pulugu
Nava nava padamula kavithaa rathamula saagipovu nelavu
Alavokaga ashtaavadhaanamula seyu kavula koluvu

Allasaani allikala jigibigini amrutha dhaara Telugu
Sreenadhuni kavithaa sudhaaralo amara ganga parugu
Raayala kalpanalo Ramakrishnuni silpamulo
Rasa dhaarayai Dhruva thaarayai mana desa bhaashalanu lessayai
Deva bhaashatho chelimi chesi palu
Desadesamula vaasikekkinadi

Mana aksharaala theeru mallepaadu kuduru
Mana bhaasha paala kadali bhaavam madhu murali
Anantha padamula alankritham mana bhaasha amrutha janitham
Bharatha bhaashaa Bharathi nudutana Telugu bhaasha thilakam

చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు
గణయతి ప్రాసల రసధ్వని శాఖల కవితలల్లు పులుగు
నవనవ పదముల కవితా రథముల సాగిపోవు నెలవు
అలవోకగ అష్టావధానముల సేయు కవుల కొలువు

అల్లసాని అల్లికల జిగిబిగిని అమృత ధార తెలుగు
శ్రీనాధుని కవితా సుధారలో అమర గంగ పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రసధారయై ధృవతారయై మన దేశ భాషలను లెస్సయై
దేవభాషతో చెలిమి చేసి పలు దేశదేశముల వాసికెక్కినది

మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు
మన భాష పాల కడలి భావం మధు మురళీ
అనంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం
భారత భాషా భారతి నుదుటన తెలుగు భాష తిలకం


2 comments: