Raagam: Hindolam
Thaalam: Aadi
Thettalaaya mahimaley Tirumala konda
Vedamuley silalai velasinadee konda
Edesa punyaraasuley erulainadee konda
Kaadili Brahmaadi lokamula konala konda
Sridevudundeti Seshaadri ee konda
Sarva devathalu mruga jaathulai cherinchu konda
Nirvahinchi jaladhuley nitta charulaina konda
Urvi thapasuley tharuvulai nilachina konda
Poorvaputanjanaadri podavaati ee konda
Varamulu kotaarugaa vakkaninchi penchey konda
Paruvu Lakshmee kaanthu sobhanapu konda
Kurisi sampadalella guhala nindina konda
Virivainadadivo Sri Venkatapu konda
కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ
వేదములే శిలలై వెలసినదీ కొండ
ఏదెస పుణ్యరాశులే ఏరులైనదీ కొండ
కాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ
శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ
సర్వదేవతలూ మృగజాతులై చరించు కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ
పూర్వపుటంజనాద్రి పొడవాటి ఈ కొండ
వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరువు లక్ష్మీకాంతు శోభనపు కొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైనదదివో శ్రీ వేంకటపు కొండ
No comments:
Post a Comment