ఇది లలిత కళా వేదిక
కళామతల్లి మాలిక
ప్రతి మనిషి గుండె లోంచి ప్రభవించే గీతిక
తిమిరంతో ఘన సమరం సాగించే దీపిక
నర్తించే నటరాజు కాలి గజ్జ మువ్వలం
అరుణ కాంతి విరజిమ్మే పార్వతి చిరునవ్వులం
గణపతి చరణాల చెంత వెలిగే చిరుదివ్వెలం
చిరునవ్వుల శ్రీవాణి హారంలో పూవులం
భరత జాతి ఔన్నత్యం ఆలపించు కోయిలలం
తెలుగు మాత ఘనకీర్తిని వినిపించే తుమ్మెదలం
సకల కళల మేలిమి సమ్మేళన రథ సారథులం
అఖిలాంధ్ర ప్రజానీక రస మానస పుత్రులం
Idi lalitha kalaa vedika
Kalaa mathalli maalika
Prathi manishi gunde lonchi prabhavinchey geethika
Thimiramtho ghana samaram saaginchey deepika
Narthinchey Nataraju kaali gajja muvvalam
Aruna kaanthi virajimmey Parvathi chirunavvulam
Ganapathi charanaala chentha veligey chirudivvelam
Chirunavvula Sreevani haaramlo poovulam
Bharatha jaathi ounnathyam aalapinchu koyilalam
Telugu maatha ghana keerthini vinipinchey thummedalam
Sakala kalala melimi sammelana ratha saarathulam
Akhilaandhra prajaaneeka rasa maanasa puthrulam
No comments:
Post a Comment