Raagam: Brundavana Saranga
Thaalam: Aadi
వీడెవో అల విజయరాఘవుడు
పోడిమి కొలువున పొదలే చెలియ || రాముడు లోకాభిరాముడు గుణ ధాముడసురులకు దమనుడు తామర కన్నుల దశరథ తనయుడుమోమున నవ్వి మొక్కవే చెలియ ||
కోదండధరుడు గురుకిరీటపతి
ప్రోదిగ సురముని పూజితుడు
ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు
నీ దెస చూపులు నించే చెలియ ||
రావణాoతకుడు రాజశేఖరుడు
శ్రీవేంకటగిరి సీతాపతి
వావిలి పాటిలో వరమూర్తి తానై
ఓవరి కొలువున ఉన్నాడే చెలియ ||
Veedevo ala Vijaya Raghavudu
Podimi koluvuna podaley cheliyaa
Ramudu lokaabhi raamudu guna
dhaamudasurulaku damanudu
thaamara kannula Dasaratha thanayudu
momuna navvi mokkavey cheliyaa
Kodanda dharudu guru kireetapathi
Prodiga sura muni poojithudu
Aadima purushudu ambuda varnudu
Nee desa choopulu ninchey cheliyaa
Raavananthakudu Rajasekharudu
Sri Venkata giri Seethapathi
Vaavilipaatilo vara moorthi thaanai
Ovari koluvuna unnaadey cheliyaa
No comments:
Post a Comment